భారాస నుండి వెళ్లిపోయిన వారు తిరిగి రావాలి - జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
భారాస నుండి వెళ్లిపోయిన వారు తిరిగి రావాలి
- జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
కోరుట్ల సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు) :
బారాస నుండి ఇతర పార్టీలలోకి వెళ్లినవారు ఆత్మ విమర్శ చేసుకొని అభివృద్ధి సంక్షేమం కోసం తిరిగి రావాలని, వారికి ఎల్లవేళలా భారత రాష్ట్ర సమితి స్వాగతం పలుకుతుందని బారాస జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. కోరుట్ల పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత రెండు నెలల క్రితం పార్టీని వీడిన 30వ వార్డు కౌన్సిలర్ సజ్జు వాస్తవాలు గ్రహించి తిరిగి ఘర్ వాపసి బారాస లోకి తిరిగి రావడానికి ఆయన స్వాగతించారు. పాత్రికేయుల బారాస కార్యకర్తల సమావేశంలో ఆయనకు తిరిగి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
అభివృద్ధి సంక్షేమం కేసీఆర్ నాయకత్వంలోనే జరిగాయని, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ని ఎలాగా కొలుస్తున్నామో మనకు ప్రత్యేక తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కృషిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను కూడా మనం అంతే గౌరవించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలు మరిచి కెసిఆర్ ను బారాస నాయకులను తిట్టడం పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకొని అభివృద్ధి కోసం ఆలోచించాలని హితవుపలికారు.
హైడ్రా పేరుతో సొంత పార్టీ వాళ్లను వదిలేసి, బడా బాబులను వదిలేసి పేద మధ్యతరగతి వారి ఇండ్లు కూల్చేయడం సబబు కాదని, మీరు ప్రజల మేలుకోరే వారైతే ముందుగా వారికి ఇతర గృహాలు కేటాయించి అందులోకి మార్చిన తర్వాత వాటిని కూల్చేయాలని విజ్ఞప్తి చేశారు.
నాలుగు పర్యాయాలు తనకు కోరుట్ల ప్రజలు పట్టం కట్టారని అందుకు కోరుట్ల ప్రజలకు రుణపడి ఉంటాను అని మరొక మారు నా హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి తన తనయుడిని ఆశీర్వదించాలని తనలాగే తన తనయుడు కల్వకుంట్ల సంజయ్ అందరికీ అందుబాటులో ఉండి రాష్ట్రమంతా ప్రజా సమస్యల కోసం తిరుగుతూ ప్రజలలో మమేకమైతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కోరుట్ల పట్టణ ప్రజలు చాలా తెలివైన వారిని ఎక్కడ వారు చేసే పనులు బయటపడకుండా ఎలక్షన్ సమయంలో తగు నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బారాస నాయకులు సింగిరెడ్డి నారాయణరెడ్డి, చీటీ వెంకట్రావు, దారిశెట్టి రాజేష్, పహీం, రహీం పాషా బొమ్మ నరసయ్య గెల్లే గంగాధర్, పీర్ల సత్యం, అన్వర్, బాబా తదితరులున్నారు.
--------------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
