జగిత్యాల అభివృద్ధిలో వై ఎస్ పాత్ర ఎనలేనిది - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల అభివృద్ధిలో వై ఎస్ పాత్ర ఎనలేనిది - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల సెప్టెంబర్ 02:
జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాల పట్టణం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని, జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడు నిర్మాణం కానీ జగిత్యాల పట్టణంలో బైపాస్ రోడ్ జగిత్యాల చుట్టూ రింగ్ రోడ్స్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వారి కృషితో అభివృద్ధి చేసుకో కలిగామని అన్నారు.
మిషిన్ భగీరథ అమలు లేని సమయంలో జగిత్యాల పట్టణానికి నీటి తీరేలా ప్రతి ఇంటికి 200 రూపాయలకు నల్ల కలక్షన్ గాను 25 కోట్ల రూపాయల గ్రాంట్ సమకూర్చి జగిత్యాల పట్టణంలో ప్రతి ఇంటికి నీటి సమస్యను తీర్చే విధంగా కృషి చేసిన నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి, పాదయాత్ర ద్వారా రైతుల కష్టాలను తెలుసుకొని వారి సమస్యలను తీర్చే విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం రైతుల కష్టాలు తుడిచే విదంగా ఉచిత విద్యుత్ పైన చేయడం ఆయనతోనే సాధ్యం అయిందని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు
రైతులకు విత్తన సబ్సిడీతో పాటు ఐకేపీ సెంటర్ గాని ప్రతి పథకం రైతులకు నిరుపేదలకు చెందే విదంగా ప్రవేశ పెట్టడం ప్రతి ఒక్కరి గుండెల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
ఇందులో మున్సిపల్ ఛైర్పర్సన్ అదువల జ్యోతి, మాజీ ఛైర్మన్ గిరి నాగభూషణం, సీనియర్ నాయకులు బండ శంకర్, మహిళా అధ్యక్షురాలు విజయలక్మి,పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
