రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో మాడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

On
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో మాడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో మాడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు) :

 రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని మాడల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మాడల్ స్కూల్ వెళ్లే దారిలో రెండు రోడ్లు తెగిపోయినందున ముందుగా ఒక రోడ్డు నిర్మాణం కోసం ప్రణాళికలను సిద్ధం చేసి    ఈ జి ఎస్ కింద నిధులను మంజూరు చేసి త్వరలోనే పని పూర్తి చేస్తామని తెలిపారు.

ఇందులో భాగంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం నివేదికలు తయారుచేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లను శానిటేషన్ చేయించాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ని కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ వెంట  డి ఆర్ డి ఓ రఘువరన్, ఎమ్మార్వో, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags