నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠా అరెస్ట్.

On
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠా అరెస్ట్.

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠా అరెస్ట్.

రూ.7 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక బైక్, 6 సెల్ ఫోన్లు,5050/- రూపాయల నగదు స్వాధీనం.
జగిత్యాల ఆగస్టు 3( ప్రజా మంటలు)
నకిలీ నోట్లు చలామణి చేస్తూ జల్సా కు అలవాటు పడ్డ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మెట్పల్లి డిఎస్పి ఉమామహేశ్వర రావు తెలిపారు. డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ  మాట్లాడుతూ..  జగిత్యాల జిల్లా తాళ్ల ధర్మారం కి  చెందిన సంజీవ్, జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ నిర్మల్ జిల్లాకు చెందిన కిషన్, గంగారం, మల్లయ్య ల్లయ్య, అశోక్ అనే ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 7 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం, 6  సెల్ ఫోన్లు, 5050/- రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 
పై ఆరుగురు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకుని మరియు ఇద్దరిద్దరూ చొప్పున ఇద్దరు కారులో, ఇద్దరు బైక్ పై డబ్బులు మార్చుకున్నప్పుడు బైక్ పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చి పోలీసు పోలీసులు అని అరుస్తూ అసలు డబ్బులు ఇస్తున్న వ్యక్తి నుండి డబ్బులు తీసుకుని పారిపోయి అందరూ ఒకచోట కలుసుకొని ఆ యొక్క డబ్బుల్ని పంచుకొని జల్సాలు చేసేవారు. దాదాపు సంవత్సర కాలం నుండి పై ఆరుగురు హైదరాబాదులో ముగ్గురిని, ధర్మపురిలో ఒకరిని, కరీంనగర్ లో ఒకరిని, జన్నారం లో ఒకరిని, జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకొని రమ్మని దాదాపు పది లక్షల వరకు లాక్కొని పరారీలో ఉన్న వీరు ఈ నెల 1వ తేదీన స్థానిక పెద్ద గుండు వద్ద ధాబా యజమాని రాజేందర్ వద్ద లక్ష రూపాయలు లాక్కొని వెళ్లిపోగా రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  సి.ఐ  నిరంజన్ రెడ్డి ఎస్సై చిరంజీవి, రాజు గాలింపు చర్యలో భాగంగా ఈ రోజు  వెంకటరావుపేట వీరేంద్ర దాబాలో గుర్తించి ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించామని తెలిపారు. ఈ యొక్క నకిలీ నోట్ల ముఠాను చాకిచకంగా పట్టుకున్న సీఐ నిరంజన్ రెడ్డి ఎస్.ఐ లు  చిరంజీవి, రాజు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   అభినందించారు.

Tags