ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి

On
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి
జగిత్యాల జిల్లా 30( ప్రజా మంటలు):
అదనపు కలెక్టర్, జగిత్యాల  అధ్యక్షతన జిల్లా సమీకృత కార్యాలయము నందు వానాకాలము మరియు యాసంగి 2023-24కి సంబందించిన  సి  ఎం ఆర్  చెల్లింపులపై రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశము నిర్వహించినారు.

 అదనపు కలెక్టర్  సమావేశములో రైస్ మిల్లర్స్ మాట్లాడుతూ ప్రభుత్వము నిర్దేశించిన గడువు తేదిలోగా సి ఎం ఆర్ బకాయిలు చెల్లించాలని లేని ఎడల చట్ట పరమైన చర్యలు తీసుకోనబడునని హెచ్చరించినారు.

తదుపరి దీనికి సంబంధించి పౌరసరఫరాల క్షేత్రస్థాయి సిబ్బందికి రోజువారీ లక్ష్యం ప్రకారము వారి పరిధిలోని మిల్లుల నుండి సి  ఏంఆర్ డెలివరీలు చేయించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని అలానే  ఎఫ్  సిఐ అధికారులు  సి  ఎం ఆర్    గోడౌన్ లలో అవసరమైన స్థలాన్ని ఏర్పాటు చెయ్యాలని మరియు ఎస్  డబ్లూ సి వారు గోడౌన్ నకు వచ్చు స్టాక్స్ దిగుమతి చేసుకొనుటకు సరిపడు హమలిలను సమకూర్చుకోవాలని అదేశించినారు.

ఇట్టి సమావేశములో, జిల్లా పౌరసరఫరా అధికారి, జగిత్యాల మరియు జిల్లా మేనేజర్ పౌరసరఫరా సంస్థ జగిత్యాల , రా మరియు బాయిల్డ్ ప్రెసిడెంట్లు, పౌరసరఫరా క్షేత్రస్థాయి సిబ్బంది మరియు రా మరియు మిల్లర్లు పాల్గొన్నారు.

Tags