మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో జెడ్పి చైర్ పర్సన్ సమీక్ష

On
మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో జెడ్పి చైర్ పర్సన్ సమీక్ష

మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో జెడ్పి చైర్ పర్సన్ సమీక్ష

జగిత్యాల జూన్ 26 (ప్రజా మంటలు) :
జిల్లా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో  జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా దావా వసంత మాట్లాడుతూ,మండలాల్లోని ప్రతి గ్రామంలో పారిశుధ్యం మరియు సానిటేషన్ ఎప్పటికప్పుడు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.

రానున్నది వర్షాకాలం సందర్భంగా ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య మరియు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అన్నారు.

రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండే విధంగా ప్రతి ఒక్క మండల అధికారి కృషి చేయాలని అధికారులను కోరారు

జిల్లాలోని మండల అభివృద్ధిలో భాగస్వామ్యమైన మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారిని సన్మానించారు.మండలాల్లోని ప్రతి గ్రామంలో మత్తు పదార్థాల నివారణలో ఎంపీడీవోలు ప్రముఖ పాత్ర పోషించాలని అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) మరియు జెడ్పీ సీఈఓ రఘువరణ్  మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.

Tags