ఘనంగా ఎస్ టి యు 78 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

On
ఘనంగా ఎస్ టి యు 78 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 


జగిత్యాల జూన్ 9( ప్రజా మంటలు) : 


స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్న  సందర్భంగా ఎస్టీయు జిల్లా  అధ్యక్షులు మచ్చ శంకర్ స్థానిక ఎస్టీయు  భవన్లో ఆ సంఘ పతాక ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు ముగ్దుమ్ మొహినోద్దీన్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. నాయకులు  మాట్లాడుతూ.....

విద్యారంగ,  ఉపాధ్యాయ సమస్యల పోరాటంలో ఎస్టియు ముందు ఉందన్నారు.
స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ఉపాధ్యాయ ఆత్మ గౌరవ ఉద్యమం నుండి మొదలు ఈ నాటి వరకు సమస్యలు పరిష్కరిస్తూ విద్యా రంగ పురోగతికి ఎస్టీయు సంఘం కృషి చేస్తున్నదని అన్నారు. 

జి.ఓ 317 బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించి ఉపాధ్యాయులకు  జె.ఎల్ పదోన్నతులు కల్పించాలని , రెగ్యులర్ జిల్లా,  మండల విద్యాధికారి పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి  బైరం హరికిరణ్,
జిల్లా అసోసియేట్ అధ్యక్షులు మేకల ప్రవీణ్, 
పాలెపు శివ రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ఊరడి ప్రభాకర్ ఉన్నారు.

Tags