పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినందున జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల టీఎన్జీవోలు

On
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినందున జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల టీఎన్జీవోలు

(సిరిసిల్ల.రాజేంద్ర శర్మ - 9963349493/9348422113) : 

జగిత్యాల జూన్ 6( ప్రజా మంటలు)

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ మరియు జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఐఎఎస్ ని కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుండి ప్రజలకు ఓటు విలువ తెలియజేస్తూ ఉద్యోగులందరికీ సమయానుకూలంగా తగు సూచనలు చేస్తూ పోలింగ్ శాతం పెరిగేలా చేసి ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూసినందుకు జిల్లా కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలయజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఐఎఎస్ మాట్లాడుతూ... ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి లెక్కింపు పూర్తయ్యేంతవరకు అన్ని స్థాయిల ఉద్యోగులు సమన్వయంతో కష్టపడి పనిచేసినందుకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా ముగిసిందని అన్నారు.

జిల్లా లోని ఉద్యోగులందరి సమిష్టి కృషి వలననే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీఓ నాయకులు రవి కుమార్, రాజేశం, సుగుణాకర్, మధుకర్, భాస్కర్, శంకర్, శ్రీనివాస్, అయూబ్, కిరణ్, శ్రీకాంత్, మమత, శైలజ, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags