ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ? అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?
మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ? హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ? ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ? రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?
ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ?
అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?
మొదటి దశలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఎన్నికలకు దూరంగా ఉన్నారా ?
బీహార్, ఉత్తర ప్రదేశ్ లో ఎందుకు బిజేపి నాయకులు పార్టీని విడుతున్నారు?
మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ?
హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ?
ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ?
రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?
ప్రధాని ద్వంద నీతికి, ఆధికార దాహానికి ప్రతీకా?
బిజేపికి - ఆర్ ఎస్ ఎస్ నాయకత్వంతో దూరం పేరుగుతుందా?
సబ్ కా సాత్ – సబ్ కా సాత్ లో ముస్లింలు లేరా?
మొదటి దశలో తగ్గిన పోలింగ్ బిజేపికి వ్యతిరేకమా?
(మోడి ప్రసంగ ప్రభావం, బిజేపి భయానికి నిదర్శనమా .. పూర్తి విశ్లేషణ )
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
హైదరాబాద్ ఏప్రిల్ 23 :
మొదటి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే బిజేపికి అందిన సమాచారంతో , బిజేపి నాయకులలో అలజడి మొదలైనట్లు హిందీ రాష్ట్రాల నుండి వస్తున్న వార్తలు చేఉతున్నాయి. అందుకే మోడి కాంగ్రెస్ ను ముస్లింలకు లబ్ది చేకూర్చే పార్టీల అభివర్ణిస్తూ, విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. రాజస్తాన్ సభలో మోడి చేసిన విద్వేష పోర్టియా ప్రసంగం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో, రెండు రోజులకే అలీగఢ్త్ సభలో హజ్ యాత్రికులకు లబ్ది చేకూరుస్తున్నట్లు చెప్పుకొన్నారు. రాజస్తాన్ లో చెప్పిన కాంగ్రెస్ మేనిఫెస్టో, ఉత్తర ప్రదేశ్ లో వర్తించాడా లేక అక్కడి ప్రజలు, ఇక్కడి ప్రజలు వేరా అని చర్చించుకొంటూన్నారు.
ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం సహజం. గల్లీ లీడర్ నుండి డిల్లీ లీడర్ వరకు ఎదుటి పక్షం పై విమర్శలు చేయడం సహజం. కానీ వారి భాషలో, మాటలో కొంత తేడా ఉంటుంది. దేశ ప్రధాని స్థాయి నాయకుడు కూడా గల్లీ లీడర్ స్థాయిలో మాట్లాడితేనే దేశ ప్రజలకు అభ్యంతరం వ్యక్తం చేయని తప్పని సారి పరిస్థితి ఏర్పడుతుంది. విశ్వ గురువు స్థాయి నేత మాటలను దేశ ప్రజలే కాకుండా, విదేశ ప్రజలు, నాయకులు గమనిస్తారనే కనీస అవగాహన ఉండాలనుకోవడం అత్యాశ కాదు.
రాజస్తాన్ లోని బాన్స్ వాఢ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీ సభలో ఏప్రిల్ 21, ఆదివారం మాట్లాడిన మాటలు రాజకీయ, ప్రతిపక్ష నాయకులనే కాదు సాధారణ పౌరులకు కూడా ఆశ్చర్యానికి గురిచేసాయి.
కాంగ్రెస్ మంగళసూత్రాలను లాగేసుకొంటుందా?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, అందరి ఆస్తులను, చివరికి మంగళ సూత్రాలను కూడా లాక్కొని ఎక్కువ పిల్లలు ఉన్నా వారికి, రబాటుదారులకు(ముస్లింలకు) ఇస్తారని చెప్పడం, దిగజారిన రాజకీయాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముందు నుండి బిజేపికి, అందులో నరేంద్ర మోడీకి ముస్లిం లు అంటే మరీ ద్వేషమని అందరికీ తెలుసు.
రాజస్తాన్ లో మొదటి దశ పోలింగ్ జరిగిన 12 లోక సభ స్థానాలలో గతంలో కంటే దాదాపు 6 శాతం ఓటింగ్ తగ్గిందని లెక్కలు చెపుతున్నాయి. ముఖ్యంగా నగర, పట్టణ ప్రాంతాలలో ప్రజలు వోటు వేయడానికి సుముఖత చూపలేదని సమాచారం. బిజేపి, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు పోలింగ్ రోజు నిరాసక్తతతో, నిర్లిప్తంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే మిగతా రాష్ట్రాలలో కూడా బిజేపికి అనుకున్న రీతిలో వోట్లు పడలేదని, గతంలో గెలిచిన సీట్లు కూడా గెలవలేక పోతున్నట్లు నిఘా వర్గాల సమాచారంగా తెలుస్తుంది. ముఖ్యంగా, ఆదివాసీలు, ముస్లిములు, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వోటు వేసినా, మద్యతరగతి ప్రజలు ఓటింగ్ పట్ల నిరాసక్తత చూపినట్లు తెలుస్తుంది.
నాగపూర్ ఆర్ ఎస్ ఎస్ కేంద్రంలో ఏం జరిగింది?
అంతకు ముందే అంటే ఏప్రిల్ 19 న నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన మోడిని, సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ కూడా కాలవలేదనే సమాచారం. ఒక రాత్రంతా నాగపూర్ లో ఉన్నా, నితిన్ గడ్కారీ ని కూడా కలవలేదు. ఆర్ ఎస్ ఎస్ ముఖ్యలు ఎందుకు ప్రధానిని కాలవలేక పోయారు? ఆర్ ఎస్ ఎస్ తో ప్రధాని కి ఛేదిందా? ఇవన్నీ భేతాళ ప్రశ్నలే. నాగపూర్ లో మోడి అనుకున్న రీతిలో, ఆర్ ఎస్ ఎస్ నుండి స్పందన రాలేదనే ప్రచారం జరుగుతుంది. అదే వేడిలో రాజస్తాన్ వచ్చిన మోడి, కాంగ్రెస్ పార్టీ “న్యాయ పత్ర” (మానిఫెస్టో)లో దేశ సంపాదనంతా ముస్లింలకే పంచుతారని, చివరికి మంగళ సూత్రాలను కూడా దక్కనీయరాని మాట్లాడారు.
నిజానికి “మంగళ సూత్రం: అనేది దక్షిణ భారత దేశ ప్రజల పవిత్రమైన భార్యాభర్తల బంధానికి ప్రతీక. ఈ ఆచారం, మంగళసూత్రం కట్టడం అనేది ఉత్తర భారత దేశంలో లేనే లేదు. అక్కడ నుదుట కుంకుమ దిద్దాడమే ఆచారం. మరో రకమైన ఆచారం లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. మారిన కాలంలో, సినిమా, సటివి సీరియల్ ల ప్రభావంతో ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా నగరాలలో మంగళ సూత్రం అనే దానికి కొంత ప్రాధాన్యత ఏర్పడుతుందని అనుకొంటున్నారు. లేని “మంగళ సూత్రం” ను కాంగ్రెస్ లాగేసుకొని, ముస్లిం లకు ఇస్తుందనడం, ప్రధాని లో ఏర్పడ్డ నిరాశ,నిస్పృహలకు నిదర్శనంగా చెప్పుకొంటున్నారు.
అలిగఢ్ లో ముస్లింలపై పొంగిన ప్రేమ
రెండు రోజుల్లో ప్రధాని మాటలలో మళ్ళీ ప్రేమ పొంగిపొరలడం, ఆయా ప్రాంతాలలో తమ అవసరాలకు అనుగుణంగా ముస్లింలను వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారనడానికి, ఆయనకు ఎన్నికలు, వోట్లు, అధికారం కన్నా ఏది ప్రధానం కాదని మోడి అలిగఢ్ లో చేసిన ప్రసంగమే చెపుతుంది. రాజస్తాన్ లో ముస్లిం ల వోట్ల కన్నా హిందువుల వవట్లే ఎక్కువ. కానీ అలిగఢ్ చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గాలలో ముస్లింల వోట్లు ఎక్కువ. వారిని మచ్చిక చేసుకోవడానికే ప్రధాని మోడి “ హజ్ యాతరలో ముస్లిం మహిళలు, భారత దేశం నుండి పోయే వారికి సులువైన వీసా సౌకర్యం, ఎక్కువ కోటా” లాంటి విషయాలలో తాను సౌదీ దేశ అధికారుయాలతో, రాజుతో మాట్లాడి, భారతీయ ముస్లిం లకు ఎంతో మేలు చేసానని చెప్పుకొన్నారు.
వోట్ల కొరకు జాతుల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలను పెంచడానికి ఏ మాత్రం వెనుకాడరాని ఈ రెండు చోట్ల జరిగిన సభలలో ప్రధాని మోడి చేసిన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి. మాట విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం ఎన్నికల నిబందనల ప్రకారం నిషేదం. దీనిపై ఎన్నికల కమీషన్ కు వందలాది ఫిర్యాదులు అందాయి. ఎన్నికల కమీషన్ నిర్లజ్జగా, ఇలాంటి అన్నిరకాల బిజేపి ప్రచారాన్ని చూసి, చూడనట్లుగా ఉండడం ప్రజాస్వామ్యానికి చెడు అని పరిశీలకులు భావిస్తున్నారు.
----
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా కేంద్రంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే మహాభారత ప్రవచనం ప్రారంభం
జగిత్యాల డిసెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు ప్రవచన నిధి, సనాతన ధర్మ సవ్యసాచి,డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే మహాభారత నవహాన్నిక ప్రవచన మహా యజ్ఞం శనివారం ప్రారంభమైంది.
ఉదయం వాసవి మాత ఆలయం... అండర్-17 బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి కి ఎంపికయిన వెల్లుల్ల విద్యార్థులు,
మెట్టుపల్లి డిసెంబర్ 06 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 బాడ్మింటన్ సెలెక్షన్స్ నిన్న మంథని JNTU కాలేజ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండల పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నుండి పాల్గొన్న విద్యార్థులు... ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ను అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 6(ప్రజా మంటలు)అర్బన్ మండలం అంబారిపేట గ్రామ సర్పంచ్ గా గోడిసెల గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవగా గంగాధర్ ను శాలువాతో సత్కరించి అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఆలయ... సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహన తనిఖీలు - ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ అశోక్ కుమార్
ధర్మపురి డిసెంబర్ 6 ( ప్రజా మంటలు)సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖ తనిఖీలు, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడం జరిగిందనీ జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో ఎస్పీ ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన రాయపట్నం చెక్పోస్ట్ను, వెల్గటూర్ పోలీస్... శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ సేవలు వెలకట్టలేనివి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 6 (ప్రజా మంటలు)
శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ సేవలు వెలకట్టలేనివి అని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు.
జిల్లాలో ఘనంగా హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం పరేడ్
63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం నందు హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ... శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ డ్రామా
ప్రయాణికులకు అర గంట వేచి ఉండమన్న ఎయిర్లైన్ – భద్రతా లోపాలపై ప్రశ్నలు
హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ–హైదరాబాద్ మధ్య నడిచే ఎయిర్ ఇండియా AI–2879 ఫ్లైట్ శుక్రవారం రాత్రి అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంది. ల్యాండింగ్ పూర్తైన వెంటనే, విమానం చుట్టూ ఫైరింజన్లు, భద్రతా సిబ్బంది... ‘అఖండ 2’ రిలీజ్పై నిర్మాణ సంస్థ కొత్త ప్రకటన
కొత్త విడుదల తేదీ త్వరలో!ప్రకటిస్తారు?
హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘అఖండ 2’ రిలీజ్పై నిర్మాణ సంస్థ కీలక అప్డేట్ ఇచ్చింది. చిత్ర విడుదల కోసం చివరి దశ పనులు పూర్తిచేస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించబోతున్నట్టు తెలిపింది.
నిర్మాణ సంస్థ... పంచాయతీ బరిలో చంద్రబాబు – జగన్!
కొత్తగూడెం డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలోని పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. సాధారణంగా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రత్యర్థులుగా నిలిచే చంద్రబాబు – జగన్ పేర్లు ఈసారి గ్రామ సర్పంచి బరిలో కనిపించడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది. అయితే వారు మీరు అనుకునే రాజకీయ... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో
హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశను తెలిపే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ ఈ సదస్సులో ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యమని... రాష్ర్టంలో పెరిగిన వీధి కుక్కల బెడద : జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
సికింద్రాబాద్, డిసెంబర్ 05 (ప్రజామంటలు) :
తెలంగాణలో వీధికుక్కల బెడద మితిమీరిందని, రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు మనుషులపై దాడులు, కరవడం, ప్రాణాలు తీసే ఘటనలు పెరుగుతున్నా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొనసాగుతుందని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఈ విషయమై ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన అధికారులు తమ... గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి
బీసీ సంఘాల ఆందోళనతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
*ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు – పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన నిరసనకారులు పిఎంఓ లో రాజకీయ అలజడి సృష్టించిన హిరెన్ జోషి
హిరేన్ జోషి, ప్రో హిమానీ దూద్, నవనీత్ సెహగల్ లు ఎందుకు ఈరోజు ఢిల్లీ వర్గాల్లో చర్చనీయంగా మారారు? హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదకోశం జరుగుతున్న పోటీయే దీనికి ప్రధాన కారణమా? బెట్టింగ్ అప్ కంపెనీని నిర్వహిస్తున్న సెహగల్ కొడుకు వల్లన పీఎంఓ కు వీటి సంబంధాలు బయటకు రావడం కారణమా? పూర్తిగా చదవండి. 