ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ? అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?
మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ? హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ? ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ? రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?
ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ?
అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?
మొదటి దశలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఎన్నికలకు దూరంగా ఉన్నారా ?
బీహార్, ఉత్తర ప్రదేశ్ లో ఎందుకు బిజేపి నాయకులు పార్టీని విడుతున్నారు?
మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ?
హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ?
ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ?
రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?
ప్రధాని ద్వంద నీతికి, ఆధికార దాహానికి ప్రతీకా?
బిజేపికి - ఆర్ ఎస్ ఎస్ నాయకత్వంతో దూరం పేరుగుతుందా?
సబ్ కా సాత్ – సబ్ కా సాత్ లో ముస్లింలు లేరా?
మొదటి దశలో తగ్గిన పోలింగ్ బిజేపికి వ్యతిరేకమా?
(మోడి ప్రసంగ ప్రభావం, బిజేపి భయానికి నిదర్శనమా .. పూర్తి విశ్లేషణ )
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
హైదరాబాద్ ఏప్రిల్ 23 :
మొదటి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే బిజేపికి అందిన సమాచారంతో , బిజేపి నాయకులలో అలజడి మొదలైనట్లు హిందీ రాష్ట్రాల నుండి వస్తున్న వార్తలు చేఉతున్నాయి. అందుకే మోడి కాంగ్రెస్ ను ముస్లింలకు లబ్ది చేకూర్చే పార్టీల అభివర్ణిస్తూ, విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. రాజస్తాన్ సభలో మోడి చేసిన విద్వేష పోర్టియా ప్రసంగం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో, రెండు రోజులకే అలీగఢ్త్ సభలో హజ్ యాత్రికులకు లబ్ది చేకూరుస్తున్నట్లు చెప్పుకొన్నారు. రాజస్తాన్ లో చెప్పిన కాంగ్రెస్ మేనిఫెస్టో, ఉత్తర ప్రదేశ్ లో వర్తించాడా లేక అక్కడి ప్రజలు, ఇక్కడి ప్రజలు వేరా అని చర్చించుకొంటూన్నారు.
ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం సహజం. గల్లీ లీడర్ నుండి డిల్లీ లీడర్ వరకు ఎదుటి పక్షం పై విమర్శలు చేయడం సహజం. కానీ వారి భాషలో, మాటలో కొంత తేడా ఉంటుంది. దేశ ప్రధాని స్థాయి నాయకుడు కూడా గల్లీ లీడర్ స్థాయిలో మాట్లాడితేనే దేశ ప్రజలకు అభ్యంతరం వ్యక్తం చేయని తప్పని సారి పరిస్థితి ఏర్పడుతుంది. విశ్వ గురువు స్థాయి నేత మాటలను దేశ ప్రజలే కాకుండా, విదేశ ప్రజలు, నాయకులు గమనిస్తారనే కనీస అవగాహన ఉండాలనుకోవడం అత్యాశ కాదు.
రాజస్తాన్ లోని బాన్స్ వాఢ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీ సభలో ఏప్రిల్ 21, ఆదివారం మాట్లాడిన మాటలు రాజకీయ, ప్రతిపక్ష నాయకులనే కాదు సాధారణ పౌరులకు కూడా ఆశ్చర్యానికి గురిచేసాయి.
కాంగ్రెస్ మంగళసూత్రాలను లాగేసుకొంటుందా?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, అందరి ఆస్తులను, చివరికి మంగళ సూత్రాలను కూడా లాక్కొని ఎక్కువ పిల్లలు ఉన్నా వారికి, రబాటుదారులకు(ముస్లింలకు) ఇస్తారని చెప్పడం, దిగజారిన రాజకీయాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముందు నుండి బిజేపికి, అందులో నరేంద్ర మోడీకి ముస్లిం లు అంటే మరీ ద్వేషమని అందరికీ తెలుసు.
రాజస్తాన్ లో మొదటి దశ పోలింగ్ జరిగిన 12 లోక సభ స్థానాలలో గతంలో కంటే దాదాపు 6 శాతం ఓటింగ్ తగ్గిందని లెక్కలు చెపుతున్నాయి. ముఖ్యంగా నగర, పట్టణ ప్రాంతాలలో ప్రజలు వోటు వేయడానికి సుముఖత చూపలేదని సమాచారం. బిజేపి, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు పోలింగ్ రోజు నిరాసక్తతతో, నిర్లిప్తంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే మిగతా రాష్ట్రాలలో కూడా బిజేపికి అనుకున్న రీతిలో వోట్లు పడలేదని, గతంలో గెలిచిన సీట్లు కూడా గెలవలేక పోతున్నట్లు నిఘా వర్గాల సమాచారంగా తెలుస్తుంది. ముఖ్యంగా, ఆదివాసీలు, ముస్లిములు, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వోటు వేసినా, మద్యతరగతి ప్రజలు ఓటింగ్ పట్ల నిరాసక్తత చూపినట్లు తెలుస్తుంది.
నాగపూర్ ఆర్ ఎస్ ఎస్ కేంద్రంలో ఏం జరిగింది?
అంతకు ముందే అంటే ఏప్రిల్ 19 న నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన మోడిని, సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ కూడా కాలవలేదనే సమాచారం. ఒక రాత్రంతా నాగపూర్ లో ఉన్నా, నితిన్ గడ్కారీ ని కూడా కలవలేదు. ఆర్ ఎస్ ఎస్ ముఖ్యలు ఎందుకు ప్రధానిని కాలవలేక పోయారు? ఆర్ ఎస్ ఎస్ తో ప్రధాని కి ఛేదిందా? ఇవన్నీ భేతాళ ప్రశ్నలే. నాగపూర్ లో మోడి అనుకున్న రీతిలో, ఆర్ ఎస్ ఎస్ నుండి స్పందన రాలేదనే ప్రచారం జరుగుతుంది. అదే వేడిలో రాజస్తాన్ వచ్చిన మోడి, కాంగ్రెస్ పార్టీ “న్యాయ పత్ర” (మానిఫెస్టో)లో దేశ సంపాదనంతా ముస్లింలకే పంచుతారని, చివరికి మంగళ సూత్రాలను కూడా దక్కనీయరాని మాట్లాడారు.
నిజానికి “మంగళ సూత్రం: అనేది దక్షిణ భారత దేశ ప్రజల పవిత్రమైన భార్యాభర్తల బంధానికి ప్రతీక. ఈ ఆచారం, మంగళసూత్రం కట్టడం అనేది ఉత్తర భారత దేశంలో లేనే లేదు. అక్కడ నుదుట కుంకుమ దిద్దాడమే ఆచారం. మరో రకమైన ఆచారం లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. మారిన కాలంలో, సినిమా, సటివి సీరియల్ ల ప్రభావంతో ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా నగరాలలో మంగళ సూత్రం అనే దానికి కొంత ప్రాధాన్యత ఏర్పడుతుందని అనుకొంటున్నారు. లేని “మంగళ సూత్రం” ను కాంగ్రెస్ లాగేసుకొని, ముస్లిం లకు ఇస్తుందనడం, ప్రధాని లో ఏర్పడ్డ నిరాశ,నిస్పృహలకు నిదర్శనంగా చెప్పుకొంటున్నారు.
అలిగఢ్ లో ముస్లింలపై పొంగిన ప్రేమ
రెండు రోజుల్లో ప్రధాని మాటలలో మళ్ళీ ప్రేమ పొంగిపొరలడం, ఆయా ప్రాంతాలలో తమ అవసరాలకు అనుగుణంగా ముస్లింలను వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారనడానికి, ఆయనకు ఎన్నికలు, వోట్లు, అధికారం కన్నా ఏది ప్రధానం కాదని మోడి అలిగఢ్ లో చేసిన ప్రసంగమే చెపుతుంది. రాజస్తాన్ లో ముస్లిం ల వోట్ల కన్నా హిందువుల వవట్లే ఎక్కువ. కానీ అలిగఢ్ చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గాలలో ముస్లింల వోట్లు ఎక్కువ. వారిని మచ్చిక చేసుకోవడానికే ప్రధాని మోడి “ హజ్ యాతరలో ముస్లిం మహిళలు, భారత దేశం నుండి పోయే వారికి సులువైన వీసా సౌకర్యం, ఎక్కువ కోటా” లాంటి విషయాలలో తాను సౌదీ దేశ అధికారుయాలతో, రాజుతో మాట్లాడి, భారతీయ ముస్లిం లకు ఎంతో మేలు చేసానని చెప్పుకొన్నారు.
వోట్ల కొరకు జాతుల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలను పెంచడానికి ఏ మాత్రం వెనుకాడరాని ఈ రెండు చోట్ల జరిగిన సభలలో ప్రధాని మోడి చేసిన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి. మాట విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం ఎన్నికల నిబందనల ప్రకారం నిషేదం. దీనిపై ఎన్నికల కమీషన్ కు వందలాది ఫిర్యాదులు అందాయి. ఎన్నికల కమీషన్ నిర్లజ్జగా, ఇలాంటి అన్నిరకాల బిజేపి ప్రచారాన్ని చూసి, చూడనట్లుగా ఉండడం ప్రజాస్వామ్యానికి చెడు అని పరిశీలకులు భావిస్తున్నారు.
----
More News...
<%- node_title %>
<%- node_title %>
ఝార్ఖండ్ BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్ కంట్రోవర్సీ
బీహార్ ఎన్నికలలో కలకలం రేపుతున్న BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్ కంట్రోవర్సీ
జూన్ లో HAM పార్టీ నాయకుని అరెస్ట్ తో వెలుగులోకి వచి సెక్స్ రాకెట్
పట్నా / రాంచీ నవంబర్ 06:
భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా నాయకురాలు ఫూల్ జోషి పేరుతో వెలుగుచూసిన హై ప్రొఫైల్ సెక్స్... Gorak poor మహిళా కానిస్టేబుల్ శిక్షణ కేంద్రంలో బాత్ రూమ్ ల దగ్గర సీసీ కెమెరాలు - ట్రైనీల నిరసన
గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 05:గోరఖ్‌పూర్ జిల్లాలోని 26వ బెటాలియన్ PAC (Provincial Armed Constabulary) మహిళా శిక్షణా కేంద్రంలో భారీ కలకలం రేగింది. సుమారు 600 మంది మహిళా ట్రైనీ సిపాయిలు ఒకే సారి బయటకు వచ్చి రోదిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. బాత్రూమ్ దగ్గర కెమెరాలు అమర్చారనే ఆరోపణతో పాటు, వసతి... పొలస శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు
జగిత్యాల, నవంబర్ 05 (ప్రజా మంటలు):కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలోని శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ స్వయంగా ఆలయానికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం... లక్ష వర్తిక వెలుగు లతో దీపోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 05 ( ప్రజామంటలు) :
పద్మారావునగర్ లోని శ్రీ సాయి బాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిపారు. బుధవారం రాత్రి వేళ ఆలయ ఆవరణలో లక్ష వర్తిక దీపాలతో కార్తీక దీపోత్సవం నిర్వహించారు.వందలాది మంది హాజరై లక్ష వర్తిక దీపాలను వెలిగించారు. దీపాల వెలుగులో ఆలయం కొత్త శోభను సంతరించుకుంది.... 10లక్షల 25వేల రూపాయల LOC ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు) రూరల్ మండల అంతర్గం గ్రామానికి చెందిన పల్లపు సాత్విక్ హార్మోన్ డెఫిషియన్సీ తో బాధపడుతూ ఉండగా గ్రామ నాయకులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారి దృష్టికి విషయాన్ని తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం *2లక్షల 75* వేల
*ఈ... మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.జగిత్యాల నవంబర్ 5(ప్రజా మంటలు)
మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల పవన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న సెకండ్ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోస్టర్ ను జగిత్యాలలో పావని కంటి ఆసుపత్రి వద్ద పోస్టర్ ను... న్యూయార్క్ మేయర్ ఎన్నికాంలో రిపబ్లికన్లకు షాక్ - జోహార్ మందాని గెలుపు
న్యూయార్క్ నవంబర్ 05:
న్యూయార్క్ నగరంలో నిన్న, నవంబర్ 4న జరిగిన 2025-ఎలక్షన్‌లో యువ డెమోక్రాటిక్ సోషలిస్ట్ (34) ఘన విజయాన్ని సాధించి మేయర్‌గా ఎన్నికయ్యారు. మొట్టమొదటి ముస్లిం, దక్షిణాసియన్ మరియు సరికొత్త తరం నాయకుడిగా, ఈ విజయం రిపబ్లికన్‌లకు పెద్ద షాక్‌గా మారింది.
ట్రంప్ బెదిరింపులకు లొంగని న్యూయార్క్ పౌరులు, స్వేచ్చా ప్రియులు, మాందానిని... భారత్ సురక్ష సమితి అధ్వర్యంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు...
జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు)
గురునానక్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తహసిల్ చేరస్తా వద్ద భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు. గురునానక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత్ సురక్ష సమితి నాయకులు....
ఈ సందర్భంగా ఏ సిఎస్ రాజు, సామాజిక వేత్త చిట్ల గంగాధర్... బెంగాల్ లో SIR భయం.. ఎనిమిది మంది ఆత్మహత్యలు: TMC ఆరోపణ
కోల్‌కతా, నవంబర్ 05:
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ జాబితా ప్రత్యేక పునర్విమర్శ (SIR) నేపథ్యంలో ఆందోళన పెరుగుతోంది. ఈ భయంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని టీమ్‌సీ (TMC) ఆరోపించింది.
తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగర్ ప్రాంతానికి చెందిన సఫికుల్ గాజీ (57) అనే వ్యక్తి తన అత్తింటి వద్ద... “హర్యానా ఎన్నికల్లో లక్షల ఫేక్ ఓట్లు”: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
నవంబర్ 05, న్యూఢిల్లీ (ప్రజా మంటలు):
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ఓటర్ల మోసం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్రెజిల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఒక మహిళా ఫోటోను వాడి, అదే చిత్రం 22 మంది ఓటర్లుగా ఎన్నికల జాబితాలో కనిపించిందని ఆయన వెల్లడించారు.
రాహుల్ గాంధీ... కడుపుతో ఉన్న కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు – ప్రేమ వివాహం నేపథ్యంగా ఉద్రిక్తత
జగిత్యాల నవంబర్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో తల్లిదండ్రులే కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది.
ప్రియాంక తన తల్లిదండ్రులు, అక్క భర్త గుంజే కుమార్ మీద కిడ్నాప్ ప్రయత్నం మరియు మరణ బెదిరింపులపై ఫిర్యాదు చేసింది. తానూ తన భర్త రాకేష్ కూడా ప్రాణభయంతో ఉన్నామని,... ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు కోసం జీవన్ రెడ్డి కి వినతి
ముదిరాజ్ వృత్తి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మాజీ మంత్రి కలెక్టర్ కు లేఖ
జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో రాయికల్ మండలం, ఆలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో మత్స్య పారిశ్రామిక (ముదిరాజ్) సహకార సంఘం ఏర్పాటు కోసం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డికి... 