18 మంది లబ్ధిదారులకు రూ.3.94 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
జగిత్యాల, సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి (CMRF) కింద మంజూరైన రూ.3,94,500 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ ఎల్. రమణ క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదేశాల మేరకు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులు వైద్య ఖర్చుల కోసం ఎమ్మెల్సీ ఎల్. రమణను ఆశ్రయించగా, ఆయన ప్రభుత్వానికి దరఖాస్తులు పంపించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయించినట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంజూరు చేయించడంలో సహకరించిన ఎమ్మెల్సీ ఎల్. రమణకు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో అయిల్నేని సాగర్‌రావు, కోరుకంటి రాము, కొలముల రమణ, వొళ్ళేం మల్లేశం, దయ్యాల మల్లారెడ్డి, వొళ్ళాల గంగాధర్, వనమాల నిరంజన్, సాగి సత్యంరావు, బర్కం మల్లేశం, తేలు రాజు, అనంతుల గంగారెడ్డి, రత్నాకర్‌రావు, చిట్నేని రవీందర్‌రావు, బాదినేని రవి, నీలి ప్రతాప్, నవ్వోత్ రవీందర్, అనుమల్ల మహేష్, అరవెల్లి లక్ష్మణ్, చిరంజీవి, అజ్ఘర్ ఖాన్, చెట్టే రమేష్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉద్యోగుల అంకితభావంతోనే సంక్షేమ ఫలాలు ప్రజలకు: సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్, సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కలిపి సుమారు 10.5 లక్షల మంది ఉద్యోగులు 4 కోట్ల మంది ప్రజలకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం 3 శాతం మంది ఉద్యోగులు 95 శాతం ప్రజలకు సేవలందించడం ఎంతో శ్రమతో కూడుకున్నదని, ఉద్యోగుల... సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర.. రూ.340 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
సిరిసిల్ల, సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు):
ప్రజా పాలన–ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సిరిసిల్లలో 3 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి రగుడు ప్రాంతంలోని బహిరంగ సభ ప్రాంగణం వరకు ప్రజల మధ్య నడుస్తూ అభివాదం చేశారు. భారీగా తరలివచ్చిన ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు.... 18 మంది లబ్ధిదారులకు రూ.3.94 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
జగిత్యాల, సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి (CMRF) కింద మంజూరైన రూ.3,94,500 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ ఎల్. రమణ క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదేశాల మేరకు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
వివిధ అనారోగ్య... సీఎం పర్యటన పేరుతో ప్రజా గొంతుకను అణచివేయడం సరికాదు : బి ఆర్ ఎస్ నాయకుల విమర్శ
జగిత్యాల, సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
సీఎం పర్యటనలకు భద్రత కల్పించడం పోలీసుల... జగిత్యాల జిల్లాలో పలువురు ఎస్‌ఐల బదిలీలు
జగిత్యాల, సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో నలుగురు సబ్‌ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. జోన్-2 బాసర డీఐజీ ఆదేశాల మేరకు పరిపాలనా అవసరాలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే బదిలీలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎస్. శ్రీకాంత్ – డీఎస్‌బీ, జగిత్యాల నుంచి బుగ్గారం ఎస్‌హెచ్‌ఓగా... విద్యార్థుల మాక్ పార్లమెంట్.. నాలుగు బిల్లులకు ఆమోదం
జగిత్యాల, సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని 16 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన 32 మంది విద్యార్థులు పాల్గొని స్పీకర్, మంత్రులు, అధికార, ప్రతిపక్ష సభ్యుల పాత్రలను పోషిస్తూ పార్లమెంటరీ విధానాలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఎల్‌నినో, వాతావరణ... జగిత్యాల, PACS అభివృద్ధికి సమష్టి కృషి చేయాలి
జగిత్యాల, సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి సభ్యులు, పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని సంఘం PIC/అధ్యక్షుడు పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి అన్నారు. సంఘ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
సంఘం ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, సభ్యులకు అందిస్తున్న రుణ సదుపాయాలు, రుణాల... రేపు కరీంనగర్‌లో సీఎం పర్యటన.. ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష
కరీంనగర్, సెప్టెంబర్ 29 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు కరీంనగర్‌లో పర్యటించి నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. పర్యటన ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. భద్రత, పార్కింగ్, పరిశుభ్రత, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
కలెక్టరేట్ ప్రారంభంతో పాటు తెలంగాణ తల్లి... గాంధీ ఆస్పత్రిలో అదనంగా 20 అత్యవసర పడకలు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 29 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనంగా 20 పడకలను అందుబాటులోకి తెచ్చినట్లు సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ఉషారాణి తెలిపారు. మంగళవారం ఆస్పత్రి కాన్ఫరెన్స్ హాలులో వివిధ విభాగాల అధిపతులు (హెచ్‌ఓడీలు), ఆర్‌ఎంఓలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు.అంబులెన్సుల్లో... గ్రామీణ పరిస్థితులపై అవగాహనతోనే సమర్థవంతమైన వ్యవసాయ సేవలు
ఎల్కతుర్తి, సెప్టెంబర్ 29 (ప్రజా మంటలు):
గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ పరిస్థితులపై ప్రత్యక్ష అవగాహన పొందినప్పుడే రైతులకు మెరుగైన సేవలు అందించగలరని ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డీన్ డా. జి. భూపాల్ రాజ్ అన్నారు.
ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామంలో ఎస్సార్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు సోమవారం క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. గ్రామీణ... ప్రమోషన్ పొందిన కానిస్టేబుల్ భాస్కర్‌రెడ్డికి సన్మానం
ఎల్కతుర్తి, సెప్టెంబర్ 29 (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌రెడ్డికి ప్రమోషన్ లభించింది. ఈ సందర్భంగా మంగళవారం ఆయనను ఎల్కతుర్తి సీఐ శ్రీను, ఎస్‌ఐ నరసింహారావు శాలువాతో సత్కరించి అభినందించారు.
ప్రమోషన్‌పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తున్న భాస్కర్‌రెడ్డి విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణకు ఈ ప్రమోషన్... నీటిపారుదల శాఖలో ముగ్గురు ఆర్మీ ఇంజినీర్ల నియామకం
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ప్రజా మంటలు):
తెలంగాణ నీటిపారుదల శాఖలో కీలక ప్రాజెక్టుల పనుల పర్యవేక్షణ కోసం ముగ్గురు ఆర్మీ ఇంజినీరింగ్ అధికారులను డిప్యుటేషన్‌పై నియమించేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి గత జూన్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇండియన్ ఆర్మీ కార్ప్స్... 