ఓమన్ నుంచి యూఏఈలోకి చొరబాటు.. ఆరు నెలల జైలు, రూ.39 లక్షల జరిమానా
జరిమానా చెల్లించలేక దుబాయి జైలులోనే జగిత్యాల వాసి
జరిమానా మాఫీ చేయించి, క్షమాభిక్ష ప్రసాదించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
జగిత్యాల, అక్టోబర్ 5 (ప్రజా మంటలు):
ఉపాధి కోసం ఓమన్ వెళ్లి, అక్కడి నుంచి యూఏఈలోకి అక్రమంగా ప్రవేశించిన జగిత్యాల జిల్లా వాసి ఏగుర్ల మల్లేశం ప్రస్తుతం దుబాయి జైలులో చిక్కుకుపోయారు. కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్ష పూర్తయినా.. సుమారు రూ.39 లక్షల జరిమానా చెల్లించలేక జైలులోనే కొనసాగుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి తెలిపారు.
జగిత్యాల జిల్లా బీమారం మండలం మోత్కురావుపేటకు చెందిన ఏగుర్ల మల్లేశం 2018లో ఉపాధి కోసం ఓమన్‌లోని మస్కట్‌కు వెళ్లారు. గతంలో దుబాయిలో పనిచేసిన ఆయనకు యూఏఈలో ప్రవేశ నిషేధం ఉండటంతో, కొందరి సూచనల మేరకు ఓమన్ నుంచి భూమార్గంలో యూఏఈలోకి ప్రవేశించినట్లు సమాచారం.
ఎడారి మార్గంలో కొంతదూరం కారులో, మరికొంత దూరం కాలినడకన ప్రయాణించి సరిహద్దు దాటినట్లు తెలుస్తోంది. ఈ విధంగా సరిహద్దులు దాటే ప్రయత్నాల్లో ప్రమాదాలకు గురై పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేశం మాత్రం దుబాయిలో సుమారు ఎనిమిదేళ్ల పాటు అక్రమంగా నివసించినట్లు సమాచారం.
ఈ ఏడాది మార్చి 8న జరిగిన తనిఖీల్లో మల్లేశం అధికారులకు పట్టుబడ్డారు. అనంతరం దుబాయి కోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు లక్షా 50 వేల యూఏఈ దిర్హంల జరిమానా విధించింది. జరిమానా భారత కరెన్సీలో సుమారు రూ.39 లక్షలు ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. శిక్ష పూర్తయిన అనంతరం దేశ బహిష్కరణ (డిపోర్టేషన్)కు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
అయితే జరిమానా చెల్లించలేకపోవడంతో మల్లేశం జైలు నుంచి విడుదల కాలేదు. దీంతో ఆయన భార్య లత, తల్లి బచ్చవ్వ, గ్రామ సర్పంచ్ ఎనుగుల లచ్చయ్య, గ్రామ ప్రముఖుడు బూమల్ల మహేష్ ఇటీవల ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. జరిమానా మాఫీ చేయించి, క్షమాభిక్ష ద్వారా మల్లేశాన్ని విడుదల చేసి స్వదేశానికి తీసుకురావాలని వారు కోరారు.
కుటుంబం విజ్ఞప్తిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి దుబాయిలోని భారత కాన్సులేట్ ద్వారా మల్లేశం కేసుకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు భీంరెడ్డి తెలిపారు. జూలై 23న దుబాయిలోని అవీర్ జైలును భారత కాన్సులేట్ అధికారులు సందర్శించి మల్లేశాన్ని కలుసుకున్నారని చెప్పారు.
జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫోర్జరీ (నకిలీ పత్రాలు) కేసులో మల్లేశానికి ఆరు నెలల జైలు శిక్ష, లక్షా 50 వేల యూఏఈ దిర్హంల జరిమానా, అనంతరం దేశ బహిష్కరణ విధించినట్లు భారత కాన్సులేట్ కాన్సులర్ విభాగం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆశిష్ శర్మ తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఎన్నారై విభాగానికి ఈమెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు భీంరెడ్డి పేర్కొన్నారు.
ఈ కేసు వివరాలను ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బిభూతి నాథ్ పాండే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు కూడా లేఖ ద్వారా తెలియజేసినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం మల్లేశం శిక్షా కాలం పూర్తయినప్పటికీ జరిమానా చెల్లించలేక జైలులో కొనసాగుతున్న నేపథ్యంలో, జరిమానా మాఫీ, క్షమాభిక్ష లేదా అందుబాటులో ఉన్న ఇతర న్యాయపరమైన మార్గాల ద్వారా ఆయనను విడుదల చేసి స్వదేశానికి తీసుకురావడంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భీంరెడ్డి వెల్లడించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.
జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్‌లో విద్యార్థుల వ్యక్తిత్వ... మెట్పల్లి ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించిన భారతీయ హిందూ పరిషద్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు సంబారి కళావతి
జగిత్యాల నవంబర్ 15 (ప్రజా మంటలు)మెట్‌పల్లిలోని ఇస్కాన్ ఆలయాన్ని భారతీయ హిందూ పరిషద్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు సంబారి కళావతి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామీజీలను, ఆలయ కమిటీ సభ్యులను కలిసి భగవద్గీత పుస్తకాన్ని అందుకున్నారు. ఆలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా... నశా ముక్త్ తెలంగాణలో రెడ్‌క్రాస్ క్రియాశీలక పాత్ర పోషించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్ (లోక్ భవన్ నవంబర్- వికసిత్ భారత్ - 2047లో యువత భాగస్వామ్యం కీలకం- 68 వేల మంది కొత్త సభ్యుల చేరికపై అభినందన.. మూడు కీలక కార్యక్రమాలకు గవర్నర్ పిలుపు
మాదకద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ క్రియాశీలక పాత్ర పోషించాలని గవర్నర్ , ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ... నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న వాహనాలపై జగిత్యాల ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు
జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆదేశాల మేరకు, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనల ప్రకారం, జగిత్యాల పట్టణ సీఐ పి. కరుణాకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ మరియు సిబ్బందితో కలిసి జగిత్యాల పట్టణంలో ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా నంబర్ ప్లేట్లు... పద్మశాలి సంఘం స్వర్ణోత్సవాలకు ఎమ్మెల్సీ ఎల్.రమణకు ఆహ్వానం
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజా మంటలు):
గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలగందుల రమణను సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు,... రాష్ట్రస్థాయి అండర్ 17 బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హై స్కూల్ విద్యార్థిని ఎంపిక
జగిత్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు)ఈనెల 13 నుండి 15 వరకు కరీంనగర్ లో జరగనున్న రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక అయింది అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ జ్యోతిస్మరియ తెలిపారు
ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ జ్యోతిస్మరియ సిస్టర్స్ రేజిణ,లిల్లి,క్రిస్టిన,రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు... నంబర్ ప్లేట్లు మార్చి వాహనాలు నడుపుతే కఠిన చర్యలు తప్పవు పట్టణ సిఐ కరుణాకర్
జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు)వాహనదారులు నెంబర్ ప్లేట్లు తొలగించడం రంగులు వేయడం నెంబర్ ప్లేట్లు ఉంచడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని పట్టణ సిఐ కరుణాకర్ హెచ్చరించారు. బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో డిఎస్పి సూచనలతో ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా టౌన్... జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138 వ జయంతి వేడుకలు _పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ప్రసూనాంబ
జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు)
దేశంలో విద్యాభివృద్ధికి పునాదులు వేసిన మహానీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ అన్నారు. బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా... పార్కింగ్ స్థలాన్ని ఆలయ వేలం పాటల నుండి మినహాయించాలి
పంచాయతీ ఆధ్వర్యంలోనే పార్కింగ్ నిర్వహిస్తామని తీర్మానం రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)*ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు | గత మూడు నెలల ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ | అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా*
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని... హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో జగిత్యాల జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు – వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, నవంబర్ 03(ప్రజా మంటలు )
హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ, బాధితులకు నిరంతర వైద్య సేవలు, ఏ ఆర్ టి చికిత్స అందించడం, వైరల్ లోడ్ నియంత్రణలో జగిత్యాల జిల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ , తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు లభించాయి.... "జాతీయవాదుల సంగమం" కు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఏబీవీపీ నాయకులు.
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)
హైదరాబాదులో నిర్వహించనున్న జాతీయవాదుల సంగమం కార్యక్రమానికి జగిత్యాల పట్టణంలోని ఏబీవీపీ పూర్వ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ తరలి వెళ్లారు.
ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఇటీవల కర్ణాటక రాష్ట్ర కో ఇన్చార్జిగా నియామకం అయిన సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఏబివీపీ పూర్వ కార్యకర్తలు,... 