నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ దగా చేస్తున్నాయి
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
నేరెళ్ల బాధితులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేరెళ్ల ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు, నివేదికలు ఏమయ్యాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాకు వీడియో సందేశం విడుదల చేశారు.
2017లో ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన నేరెళ్ల దళితులపై జరిగిన ఘటనకు సంబంధించిన ఆధారాలను ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మాయం చేశారా? లేక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాయం అయ్యాయా? అని కవిత ప్రశ్నించారు. నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు.
సిరిసిల్ల పర్యటన సందర్భంగా బాధితులకు రూ.5 లక్షలు, రూ.10 లక్షల పరిహారం అందించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆమె ఆరోపించారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, మూడు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించినప్పుడే న్యాయం జరిగినట్లవుతుందని అన్నారు.
ఆధారాలు ఏమయ్యాయి?
నేరెళ్ల ఘటనపై అప్పటి జైలర్ నివేదికలు, డీఐజీ రవివర్మ బాధితులతో మాట్లాడి రూపొందించిన నివేదికలు ఏమయ్యాయో ప్రభుత్వం వెల్లడించాలని కవిత డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు ధ్వంసమై ఉంటే అందుకు బాధ్యులైన అధికారులు, నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
నేషనల్ ఎస్సీ కమిషన్ నిర్వహించిన ప్రజాకోర్టు, పబ్లిక్ హియరింగ్‌కు సంబంధించిన నివేదికను కూడా వెలుగులోకి తీసుకురావాలని కోరారు. బాధితులకు న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కమిషన్‌పై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.
బాధితులపై కేసులు ఉపసంహరించాలి
నేరెళ్ల బాధితులపైనే నమోదైన కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. బాధితులు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, ప్రభుత్వం ఇకనైనా వారి సమస్యను పరిష్కరించాలని కోరారు.
2017 జూలైలో నేరెళ్లలో జరిగిన ఘటన తెలంగాణ సమాజం మరువలేనిదని పేర్కొన్న కవిత.. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్కింగ్ స్థలాన్ని ఆలయ వేలం పాటల నుండి మినహాయించాలి
పంచాయతీ ఆధ్వర్యంలోనే పార్కింగ్ నిర్వహిస్తామని తీర్మానం రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)*ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు | గత మూడు నెలల ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ | అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా*
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని... హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో జగిత్యాల జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు – వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, నవంబర్ 03(ప్రజా మంటలు )
హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ, బాధితులకు నిరంతర వైద్య సేవలు, ఏ ఆర్ టి చికిత్స అందించడం, వైరల్ లోడ్ నియంత్రణలో జగిత్యాల జిల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ , తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు లభించాయి.... "జాతీయవాదుల సంగమం" కు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఏబీవీపీ నాయకులు.
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)
హైదరాబాదులో నిర్వహించనున్న జాతీయవాదుల సంగమం కార్యక్రమానికి జగిత్యాల పట్టణంలోని ఏబీవీపీ పూర్వ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ తరలి వెళ్లారు.
ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఇటీవల కర్ణాటక రాష్ట్ర కో ఇన్చార్జిగా నియామకం అయిన సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఏబివీపీ పూర్వ కార్యకర్తలు,... పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - 37 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన చిన్ననాటి మిత్రులు
భీమదేవరపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు):
మండలంలోని ముల్కనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1988–89 పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా జరిగింది. సుమారు 37 ఏళ్ల తర్వాత తాము చదువుకున్న బడి ఆవరణలో కలుసుకున్న చిన్ననాటి మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన స్నేహితులంతా... మంత్రి వాకిటి శ్రీహరికి ముదిరాజ్ మహాసభ జన్మదిన శుభాకాంక్షలు
సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజా మంటలు):
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు ముదిరాజ్ మహాసభ కమ్యూనిటీ నేతలు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 53 వసంతాలు పూర్తి చేసుకుని 54వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పాలమూరు కొదమసింహం, ముదిరాజ్ ముద్దుబిడ్డ అయిన ఆయన నిండు నూరేళ్లు... ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్
జగిత్యాల, నవంబర్ 01 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.
దేశ ప్రజాస్వామ్య... స్తంభంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నిలిచిపోయిన షేడ్ నిర్మాణ పనులు..
వెల్గటూర్ నవంబర్ 1 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కీ వచ్చే భక్తులకీ ఉపయోగపడే షేడ్ నిర్మాణ పనులు ప్రారంభ దశలో నిలిచిపోవడం జరిగింది.. ఈ షేడ్ నిర్మాణం పూర్తి అయితే భక్తులకీ చాలా ఉపయోగపడుతుంది.. స్వామి దర్శనం కీ నిద్ర కీ... నాయి బ్రాహ్మణ జనశక్తి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సంజీవ్ నియామకం
గొల్లపల్లి అక్టోబర్ 29 ప్రజా మంటలు
నాయి బ్రాహ్మణ జనశక్తి సేవా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెంగలాపూర్ గ్రామానికి చెందిన రాసమల్ల సంజీవ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర అధ్యక్షులు పసుపుకుంట్ల వికాస్ నాయీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు సికినమెట్ల శివప్రసాద్,ప్రధాన కార్యదర్శి సురేంపల్లి గణేష్ లు సంజీవ్‌కు... భీమ్ రాజు పల్లి లో భూముల రీ-సర్వే ముమ్మరం
గొల్లపల్లి అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
మండలంలోని భీమ్రాజు పల్లిలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం, కచ్చితమైన హద్దుల గుర్తింపే లక్ష్యంగా చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రెవెన్యూ, సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో కొలతలు చేపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలగని శ్రీలత గంగచారి, ఉప సర్పంచ్... పత్తిపాక యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అభినందనీయం:
గొల్లపల్లి అక్టోబర్ 29 ప్రజా మంటలు
పత్తిపాక గ్రామంలోని యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మరియు ట్రైనింగ్ యూత్ ఆఫీసర్ శిక్షణా పరిశీలనలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్లు (డీయోస్ ) సందర్శించారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ గోలి తిరుపతి... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో పాల్గొన్న మర్రి పురురవరెడ్డి
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
బల్కంపేట 60 ఫీట్ రోడ్డు పరిధిలో బుధవారం ఉదయం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర యువ నాయకుడు మర్రి పురురవరెడ్డి స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు... 