అమారత్-ఎ-మిల్లత్-ఎ-ఇస్లామియా ఎన్నికలకు సర్వం సిద్ధం
జగిత్యాలలో 25 మసీదుల్లో పోలింగ్.. టీఆర్ నగర్లో 3 మసీదులకు మినహాయింపు
జగిత్యాల, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
అమారత్-ఎ-మిల్లత్-ఎ-ఇస్లామియా జగిత్యాల అధ్యక్ష పదవికి నిర్వహించనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషనర్ ఇంజినీర్ మసియుద్దీన్ అఫ్సర్ తెలిపారు. ఆదివారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల వివరాలను వెల్లడించారు.
అక్టోబర్ 9న శుక్రవారం నమాజ్ అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు పట్టణంలోని 25 మసీదుల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. టీఆర్ నగర్‌లోని మూడు మసీదులను పోలింగ్ కేంద్రాల జాబితా నుంచి మినహాయించినట్లు పేర్కొన్నారు. 1989 నాటి రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.
ఎన్నికల నిర్వహణ కోసం మహమ్మద్ ముర్తజా అలీ జావేద్‌ను అదనపు ఎన్నికల కమిషనర్‌గా, మహమ్మద్ మక్బూల్, సయ్యద్ గౌస్ షమ్ము, అడ్వకేట్ మహమ్మద్ ఫజ్లుద్దీన్లను సహాయ ఎన్నికల కమిషనర్లుగా నియమించినట్లు తెలిపారు.
గత సెప్టెంబర్ 4న అప్పటి ఎన్నికల కమిషనర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య 11 ఓట్ల తేడా వచ్చిందని మసియుద్దీన్ అఫ్సర్ తెలిపారు. పలుమార్లు రీకౌంటింగ్ చేసినా తేడా కొనసాగడంతో ఆ ఎన్నికల ప్రక్రియపై నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ప్రస్తుత ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వయోజన ముస్లిం పురుషులు గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రానికి హాజరై తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు మెట్పల్లి, హుజూరాబాద్, సిద్దిపేట, రాయికల్, ధర్మపురి తదితర ప్రాంతాలకు చెందిన ముస్లిం సంఘాల అధ్యక్షులను పరిశీలకులుగా ఆహ్వానించినట్లు తెలిపారు.
విలేకరుల సమావేశంలో మహమ్మద్ మక్బూల్, డాక్టర్ సయ్యద్ గౌస్ షమ్ము తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్కింగ్ స్థలాన్ని ఆలయ వేలం పాటల నుండి మినహాయించాలి
పంచాయతీ ఆధ్వర్యంలోనే పార్కింగ్ నిర్వహిస్తామని తీర్మానం రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)*ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు | గత మూడు నెలల ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ | అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా*
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని... హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో జగిత్యాల జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు – వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, నవంబర్ 03(ప్రజా మంటలు )
హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ, బాధితులకు నిరంతర వైద్య సేవలు, ఏ ఆర్ టి చికిత్స అందించడం, వైరల్ లోడ్ నియంత్రణలో జగిత్యాల జిల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ , తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు లభించాయి.... "జాతీయవాదుల సంగమం" కు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఏబీవీపీ నాయకులు.
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)
హైదరాబాదులో నిర్వహించనున్న జాతీయవాదుల సంగమం కార్యక్రమానికి జగిత్యాల పట్టణంలోని ఏబీవీపీ పూర్వ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ తరలి వెళ్లారు.
ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఇటీవల కర్ణాటక రాష్ట్ర కో ఇన్చార్జిగా నియామకం అయిన సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఏబివీపీ పూర్వ కార్యకర్తలు,... పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - 37 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన చిన్ననాటి మిత్రులు
భీమదేవరపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు):
మండలంలోని ముల్కనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1988–89 పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా జరిగింది. సుమారు 37 ఏళ్ల తర్వాత తాము చదువుకున్న బడి ఆవరణలో కలుసుకున్న చిన్ననాటి మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన స్నేహితులంతా... మంత్రి వాకిటి శ్రీహరికి ముదిరాజ్ మహాసభ జన్మదిన శుభాకాంక్షలు
సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజా మంటలు):
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు ముదిరాజ్ మహాసభ కమ్యూనిటీ నేతలు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 53 వసంతాలు పూర్తి చేసుకుని 54వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పాలమూరు కొదమసింహం, ముదిరాజ్ ముద్దుబిడ్డ అయిన ఆయన నిండు నూరేళ్లు... ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్
జగిత్యాల, నవంబర్ 01 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.
దేశ ప్రజాస్వామ్య... స్తంభంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నిలిచిపోయిన షేడ్ నిర్మాణ పనులు..
వెల్గటూర్ నవంబర్ 1 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కీ వచ్చే భక్తులకీ ఉపయోగపడే షేడ్ నిర్మాణ పనులు ప్రారంభ దశలో నిలిచిపోవడం జరిగింది.. ఈ షేడ్ నిర్మాణం పూర్తి అయితే భక్తులకీ చాలా ఉపయోగపడుతుంది.. స్వామి దర్శనం కీ నిద్ర కీ... నాయి బ్రాహ్మణ జనశక్తి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సంజీవ్ నియామకం
గొల్లపల్లి అక్టోబర్ 29 ప్రజా మంటలు
నాయి బ్రాహ్మణ జనశక్తి సేవా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెంగలాపూర్ గ్రామానికి చెందిన రాసమల్ల సంజీవ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర అధ్యక్షులు పసుపుకుంట్ల వికాస్ నాయీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు సికినమెట్ల శివప్రసాద్,ప్రధాన కార్యదర్శి సురేంపల్లి గణేష్ లు సంజీవ్‌కు... భీమ్ రాజు పల్లి లో భూముల రీ-సర్వే ముమ్మరం
గొల్లపల్లి అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
మండలంలోని భీమ్రాజు పల్లిలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం, కచ్చితమైన హద్దుల గుర్తింపే లక్ష్యంగా చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రెవెన్యూ, సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో కొలతలు చేపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలగని శ్రీలత గంగచారి, ఉప సర్పంచ్... పత్తిపాక యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అభినందనీయం:
గొల్లపల్లి అక్టోబర్ 29 ప్రజా మంటలు
పత్తిపాక గ్రామంలోని యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మరియు ట్రైనింగ్ యూత్ ఆఫీసర్ శిక్షణా పరిశీలనలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్లు (డీయోస్ ) సందర్శించారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ గోలి తిరుపతి... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో పాల్గొన్న మర్రి పురురవరెడ్డి
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
బల్కంపేట 60 ఫీట్ రోడ్డు పరిధిలో బుధవారం ఉదయం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర యువ నాయకుడు మర్రి పురురవరెడ్డి స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు... 