‘నాన్నా.. ఇక మీరు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు’

3 కోట్లు భరణమ్ అరొపనలను ఖండించిన పొలుసులు

On
‘నాన్నా.. ఇక మీరు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు’

కుటుంబ కలహాలు.. చిన్నారి వైద్య ఖర్చులు.. అప్పుల భారం.. చివరకు 43వ అంతస్తు నుంచి దూకిన యువ ఇంజినీర్‌

నోయిడా అక్టొబర: 05

చేతిలో మంచి ఉద్యోగం.. కళ్లముందు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు.. తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు.. కానీ జీవితంలో ఎదురైన వరుస సమస్యలు ఆ యువకుడిని తీవ్రంగా కుంగదీశాయి. చివరకు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సంభవ్‌ జైన్‌.

గురుగ్రామ్‌లోని మానేసర్‌కు చెందిన 28 ఏళ్ల సంభవ్‌ జైన్‌ నోయిడాలోని సూపర్‌నోవా భవనంలో 43వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన కలకలం రేపింది. కుటుంబ వివాదం, తన కుమారుడి అనారోగ్యానికి అయిన భారీ వైద్య ఖర్చులు, అప్పులు, విడాకుల అనంతరం ఎదురైన ఆర్థిక బాధ్యతలు.. ఇలా పలు అంశాలు అతడిపై తీవ్ర ఒత్తిడిని పెంచినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

సంభవ్‌ కుమారుడు నెలలు నిండకముందే జన్మించడంతో చిన్నారి వైద్యం కోసం కుటుంబం భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. వైద్య ఖర్చులు, అప్పులు ఒకవైపు.. మరోవైపు భార్యతో ఏర్పడిన విభేదాలు, విడాకుల వ్యవహారం అతడిని మరింత ఆందోళనకు గురిచేశాయి. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, విడాకుల సెటిల్‌మెంట్‌లో సుమారు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉండగా, అందులో కొంత మొత్తం ఇప్పటికే చెల్లించారు. సోషల్‌ మీడియాలో ప్రచారమైన రూ.3 కోట్ల భరణం విషయాన్ని పోలీసులు ఖండించారు.

అయితే ఈ సమస్యలన్నింటికంటే మించి.. తండ్రితో సంభవ్‌ జరిపిన చివరి సంభాషణ ఇప్పుడు కుటుంబ సభ్యుల గుండెలను పిండేస్తోంది. తనను ఇంటికి తిరిగి రావాలని తండ్రి కోరుతుండగా, సంభవ్‌ తన ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. చివరకు తన కుమారుడి గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం.

“నాన్నా.. ఇక మీరు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు” అన్న అతడి చివరి మాటలు ఇప్పుడు తండ్రికి కన్నీళ్లను మిగిల్చాయి. తనను కాపాడాలని తండ్రి ప్రయత్నించినా.. అప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న సంభవ్‌ తీసుకున్న నిర్ణయం ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.

ఘటనకు ముందు కూడా సంభవ్‌ తన తండ్రితో తన పరిస్థితి గురించి మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. అతడి మొబైల్‌లో ఓ వీడియో కూడా లభించిందని, అందులో తన ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రస్తావించినట్లు పోలీసులు చెబుతున్నారు. కేసులో కుటుంబ పరిస్థితులు, అప్పులు, చిన్నారి వైద్య ఖర్చులు, విడాకుల వివాదం తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు.. ఒడిలో ఆడాల్సిన చిన్నారి.. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న కుటుంబం.. ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. సమస్యలు ఎంత పెద్దవైనా, ఒక మనిషి ప్రాణం కంటే అవి పెద్దవి కావని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Join WhatsApp

More News...

Local News 

‘నాన్నా.. ఇక మీరు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు’

‘నాన్నా.. ఇక మీరు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు’ కుటుంబ కలహాలు.. చిన్నారి వైద్య ఖర్చులు.. అప్పుల భారం.. చివరకు 43వ అంతస్తు నుంచి దూకిన యువ ఇంజినీర్‌ నోయిడా అక్టొబర: 05 చేతిలో మంచి ఉద్యోగం.. కళ్లముందు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు.. తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు.. కానీ జీవితంలో ఎదురైన వరుస సమస్యలు ఆ యువకుడిని తీవ్రంగా కుంగదీశాయి. చివరకు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని...
Read More...
State News 

సింగరేణి భవన్ ముట్టడించిన కల్వకుంట్ల కవిత  

సింగరేణి భవన్ ముట్టడించిన కల్వకుంట్ల కవిత   హైదరాబాద్ అక్టోబర్‌ 05: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్, హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత సింగరేణి భవన్‌ను ముట్టడించారు. నాయకులు, కార్మికులతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. సింగరేణి సీఎండీ స్వయంగా వచ్చి కార్మికులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా కవిత...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం జగిత్యాల, అక్టోబర్ 4 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక సమావేశ మందిరంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమానికి అవోపా జిల్లా శాఖ అధ్యక్షుడు రాజేషుని శ్రీనివాస్ అధ్యక్షత...
Read More...
Local News 

కాంగ్రెస్‌ ఎన్నికల హామీల అమలుపై జీవన్‌రెడ్డి ప్రశ్నలు

కాంగ్రెస్‌ ఎన్నికల హామీల అమలుపై జీవన్‌రెడ్డి ప్రశ్నలు జగిత్యాల, అక్టోబర్‌ 4 (ప్రజా మంటలు): కాంగ్రెస్‌ ప్రభుత్వం 2023 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి పలు అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన...
Read More...
State News 

ఈవీఎంలు పోవాలి.. పేపర్ బ్యాలెట్ విధానం రావాలి

ఈవీఎంలు పోవాలి.. పేపర్ బ్యాలెట్ విధానం రావాలి హైదరాబాద్‌  అక్టొబర 04 (ప్రజా మంటలు): దేశంలో ఎన్నికల ప్రక్రియను తిరిగి పేపర్‌ బ్యాలెట్‌ విధానంలో నిర్వహించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఈవీఎంలలో మానిప్యులేషన్‌కు అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నందున పారదర్శకత కోసం బ్యాలెట్‌ విధానాన్ని తీసుకురావాలని కోరారు. ఇందుకోసం ఢిల్లీ వరకు వెళ్లైనా పోరాటం చేస్తామని తెలిపారు....
Read More...
Local News 

నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ దగా చేస్తున్నాయి

నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ దగా చేస్తున్నాయి హైదరాబాద్, అక్టోబర్ 4 (ప్రజా మంటలు): నేరెళ్ల బాధితులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేరెళ్ల ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు, నివేదికలు ఏమయ్యాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాకు వీడియో సందేశం విడుదల...
Read More...
Local News 

స్మశాన వాటికలో స్వచ్ఛత సేవలు, మెట్ల నిర్మాణం

స్మశాన వాటికలో స్వచ్ఛత సేవలు, మెట్ల నిర్మాణం జగిత్యాల, అక్టోబర్ 4 (ప్రజా మంటలు): జగిత్యాల భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక సత్యహరిశ్చంద్ర స్మశాన వాటికలో ఆదివారం స్వచ్ఛత సేవా కార్యక్రమం నిర్వహించారు. సమితి కన్వీనర్ బట్టు రాజేందర్ ఆధ్వర్యంలో సేవా సభ్యులు స్మశాన వాటిక పరిసరాలను శుభ్రం చేశారు. స్నానాల గదులు, బాత్రూమ్‌లు, పూజా మంటపం, వంటగదిని శుభ్రం...
Read More...
Local News 

జగిత్యాల పీఏసీఎస్‌ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు

జగిత్యాల పీఏసీఎస్‌ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు జగిత్యాల, అక్టోబర్‌ 4 (ప్రజా మంటలు): జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా ధరూర్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కొలుగూరి దామోదర్‌రావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనతో పాటు పీఏసీఎస్‌ పాలకవర్గంలో 12 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా నియమితులైన దామోదర్‌రావు తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి...
Read More...
Local News 

గడ్డి మందు పిచికారీతో రైతు వరి పంట ధ్వంసం

గడ్డి మందు పిచికారీతో రైతు వరి పంట ధ్వంసం వెల్గటూర్, అక్టోబర్ 4 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్‌పేటలో రైతు బద్దం మాధవరెడ్డి సాగు చేసిన వరి పంట గుర్తుతెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేయడంతో ధ్వంసమైంది. సర్వే నంబర్ 135లోని 16 గుంటల భూమిలో సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ముగ్గురు వ్యక్తులు పొలంలోకి ప్రవేశించి మందు...
Read More...
Local News 

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని యువకుల పాదయాత్ర

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని యువకుల పాదయాత్ర ఎర్రవెల్లి అక్టొబర్ 04 (ప్రజా మంటలు):   04 (ప్రజా మంటలు):కేసీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా మంథని నుంచి ఐదు రోజుల పాటు పాదయాత్ర చేసిన ముగ్గురు యువకులు ఆదివారం ఎర్రవెల్లికి చేరుకున్నారు. మంథనికి చెందిన బూర్ల వెంకటేశ్, కొండ వెంకటేశ్, మంథని బెన్నిపాల్‌ కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి తమ కేసీఆర్‌...
Read More...
Local News 

అమారత్‌-ఎ-మిల్లత్‌-ఎ-ఇస్లామియా ఎన్నికలకు సర్వం సిద్ధం

అమారత్‌-ఎ-మిల్లత్‌-ఎ-ఇస్లామియా ఎన్నికలకు సర్వం సిద్ధం జగిత్యాల, అక్టోబర్‌ 4 (ప్రజా మంటలు): అమారత్‌-ఎ-మిల్లత్‌-ఎ-ఇస్లామియా జగిత్యాల అధ్యక్ష పదవికి నిర్వహించనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషనర్‌ ఇంజినీర్‌ మసియుద్దీన్‌ అఫ్సర్‌ తెలిపారు. ఆదివారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల వివరాలను వెల్లడించారు. అక్టోబర్‌ 9న శుక్రవారం నమాజ్‌ అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు పట్టణంలోని 25...
Read More...

సంతానం కోసం ఏళ్ల నిరీక్షణ.. బిడ్డను కని కన్నుమూసిన తల్లి

సంతానం కోసం ఏళ్ల నిరీక్షణ.. బిడ్డను కని కన్నుమూసిన తల్లి ఖమ్మం అక్టొబర్ 04 (ప్రజా మంటలు);ఏళ్ల నిరీక్షణ తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి.. ఆ బిడ్డను కళ్లారా చూడకుండానే కన్నుమూసిన విషాద ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంబల్‌కు చెందిన గౌడి లక్ష్మి (36) సంతానం కోసం ఐయూఐ, ఐవీఎఫ్ చికిత్సలు చేయించుకున్నారు. ఇందుకోసం సుమారు రూ.10...
Read More...