తెలంగాణ బీజేపీ పదాధికారుల పనితీరుపై మధుకర్, అభయ్ పాటిల్ అసంతృప్తి

On
తెలంగాణ బీజేపీ పదాధికారుల పనితీరుపై మధుకర్, అభయ్ పాటిల్ అసంతృప్తి

హైదరాబాద్ అక్టోబర్‌ 05:

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారుల పనితీరుపై పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు మధుకర్, అభయ్ పాటిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతల పనితీరుపై వారు తీవ్రంగా ప్రశ్నించినట్లు సమాచారం.

“ఇలా ఉంటే తెలంగాణలో అధికారంలోకి ఎలా వస్తాం?” అంటూ నేతలను నిలదీసినట్లు తెలుస్తోంది. పార్టీలో క్రియాశీల సభ్యత్వం లేని కొందరు కూడా రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో కొనసాగుతున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిధుల వినియోగంపై అభయ్ పాటిల్ సమీక్ష నిర్వహించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని హెచ్చరించారు. అవసరమైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

జిల్లా అధ్యక్షుల పనితీరుపైనా నేతలు ప్రశ్నలు సంధించారు. “జిల్లా అధ్యక్షులను ఏం అడుగుతారు? అందరూ హైదరాబాద్ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీ ఎలా బలోపేతం అవుతుంది?” అని ప్రశ్నించినట్లు సమాచారం. ముగ్గురు మినహా మిగతా నేతలంతా హైదరాబాద్‌లోనే ఉంటున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇకపై మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదని, పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే ప్రాధాన్యం ఉంటుందని మధుకర్, అభయ్ పాటిల్ స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్ర నేతల పర్యటనలను ఇకపై తామే నేరుగా పర్యవేక్షిస్తామని, నాయకులు జిల్లాలు, నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది.

Join WhatsApp

More News...

Social  State News 

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఫ్లైఓవర్లకు బదులు సిక్స్‌లేన్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదన

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఫ్లైఓవర్లకు బదులు సిక్స్‌లేన్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదన హైదరాబాద్‌ అక్టొబర్ 05: కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ప్రతిపాదించిన పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రణాళికను పునఃపరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ పరిస్థితులు, వన్‌వే విధానంతో వాహనాల రాకపోకల్లో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని కొత్త ప్రతిపాదనను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రోడ్‌ నంబర్‌–2 నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మీదుగా ఇతర ప్రధాన...
Read More...
Local News  Crime  Social 

జగిత్యాలలో రెస్టారెంట్లపై మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

జగిత్యాలలో రెస్టారెంట్లపై మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు జగిత్యాల, అక్టోబర్ 5 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని పలు రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ బృందం ఈ తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా రెస్టారెంట్లలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, శానిటరీ పరిస్థితులను అధికారులు పరిశీలించారు. తనిఖీల్లో కుళ్లిపోయిన ఆహార...
Read More...
Local News 

తెలంగాణ బీజేపీ పదాధికారుల పనితీరుపై మధుకర్, అభయ్ పాటిల్ అసంతృప్తి

తెలంగాణ బీజేపీ పదాధికారుల పనితీరుపై మధుకర్, అభయ్ పాటిల్ అసంతృప్తి హైదరాబాద్ అక్టోబర్‌ 05: తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారుల పనితీరుపై పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు మధుకర్, అభయ్ పాటిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతల పనితీరుపై వారు తీవ్రంగా ప్రశ్నించినట్లు సమాచారం. “ఇలా ఉంటే తెలంగాణలో అధికారంలోకి ఎలా వస్తాం?” అంటూ నేతలను నిలదీసినట్లు తెలుస్తోంది. పార్టీలో క్రియాశీల సభ్యత్వం...
Read More...
Crime  State News 

ఏసీబీ వలలో రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి

ఏసీబీ వలలో రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి . హైదరాబాద్, అక్టోబర్ 5: రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) స్వర్ణకుమారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కుకున్నారు. ఎల్బీనగర్‌లో లైసెన్స్ లేదంటూ మూసివేసిన ఓ ఫిజియోథెరపీ ఆస్పత్రిని తిరిగి తెరవడానికి రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారన్న ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఆపరేషన్ నిర్వహించారు.  ఈ లంచంలో...
Read More...
National  Crime  State News 

ఓమన్‌ నుంచి యూఏఈలోకి చొరబాటు.. ఆరు నెలల జైలు, రూ.39 లక్షల జరిమానా

ఓమన్‌ నుంచి యూఏఈలోకి చొరబాటు.. ఆరు నెలల జైలు, రూ.39 లక్షల జరిమానా   జరిమానా మాఫీ చేయించి,  క్షమాభిక్ష ప్రసాదించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి జగిత్యాల, అక్టోబర్ 5 (ప్రజా మంటలు):ఉపాధి కోసం ఓమన్‌ వెళ్లి, అక్కడి నుంచి యూఏఈలోకి అక్రమంగా ప్రవేశించిన జగిత్యాల జిల్లా వాసి ఏగుర్ల మల్లేశం ప్రస్తుతం దుబాయి జైలులో చిక్కుకుపోయారు. కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్ష పూర్తయినా.....
Read More...
Local News 

‘నాన్నా.. ఇక మీరు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు’

‘నాన్నా.. ఇక మీరు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు’ కుటుంబ కలహాలు.. చిన్నారి వైద్య ఖర్చులు.. అప్పుల భారం.. చివరకు 43వ అంతస్తు నుంచి దూకిన యువ ఇంజినీర్‌ నోయిడా అక్టొబర: 05 చేతిలో మంచి ఉద్యోగం.. కళ్లముందు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు.. తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు.. కానీ జీవితంలో ఎదురైన వరుస సమస్యలు ఆ యువకుడిని తీవ్రంగా కుంగదీశాయి. చివరకు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని...
Read More...
State News 

సింగరేణి భవన్ ముట్టడించిన కల్వకుంట్ల కవిత  

సింగరేణి భవన్ ముట్టడించిన కల్వకుంట్ల కవిత   హైదరాబాద్ అక్టోబర్‌ 05: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్, హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత సింగరేణి భవన్‌ను ముట్టడించారు. నాయకులు, కార్మికులతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. సింగరేణి సీఎండీ స్వయంగా వచ్చి కార్మికులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా కవిత...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం జగిత్యాల, అక్టోబర్ 4 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక సమావేశ మందిరంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమానికి అవోపా జిల్లా శాఖ అధ్యక్షుడు రాజేషుని శ్రీనివాస్ అధ్యక్షత...
Read More...
Local News 

కాంగ్రెస్‌ ఎన్నికల హామీల అమలుపై జీవన్‌రెడ్డి ప్రశ్నలు

కాంగ్రెస్‌ ఎన్నికల హామీల అమలుపై జీవన్‌రెడ్డి ప్రశ్నలు జగిత్యాల, అక్టోబర్‌ 4 (ప్రజా మంటలు): కాంగ్రెస్‌ ప్రభుత్వం 2023 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి పలు అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన...
Read More...
State News 

ఈవీఎంలు పోవాలి.. పేపర్ బ్యాలెట్ విధానం రావాలి

ఈవీఎంలు పోవాలి.. పేపర్ బ్యాలెట్ విధానం రావాలి హైదరాబాద్‌  అక్టొబర 04 (ప్రజా మంటలు): దేశంలో ఎన్నికల ప్రక్రియను తిరిగి పేపర్‌ బ్యాలెట్‌ విధానంలో నిర్వహించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఈవీఎంలలో మానిప్యులేషన్‌కు అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నందున పారదర్శకత కోసం బ్యాలెట్‌ విధానాన్ని తీసుకురావాలని కోరారు. ఇందుకోసం ఢిల్లీ వరకు వెళ్లైనా పోరాటం చేస్తామని తెలిపారు....
Read More...
Local News 

నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ దగా చేస్తున్నాయి

నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ దగా చేస్తున్నాయి హైదరాబాద్, అక్టోబర్ 4 (ప్రజా మంటలు): నేరెళ్ల బాధితులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేరెళ్ల ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు, నివేదికలు ఏమయ్యాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాకు వీడియో సందేశం విడుదల...
Read More...
Local News 

స్మశాన వాటికలో స్వచ్ఛత సేవలు, మెట్ల నిర్మాణం

స్మశాన వాటికలో స్వచ్ఛత సేవలు, మెట్ల నిర్మాణం జగిత్యాల, అక్టోబర్ 4 (ప్రజా మంటలు): జగిత్యాల భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక సత్యహరిశ్చంద్ర స్మశాన వాటికలో ఆదివారం స్వచ్ఛత సేవా కార్యక్రమం నిర్వహించారు. సమితి కన్వీనర్ బట్టు రాజేందర్ ఆధ్వర్యంలో సేవా సభ్యులు స్మశాన వాటిక పరిసరాలను శుభ్రం చేశారు. స్నానాల గదులు, బాత్రూమ్‌లు, పూజా మంటపం, వంటగదిని శుభ్రం...
Read More...