ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఇన్గొల్లపల్లి సెప్టెంబర్ 07
(ప్రజా మంటలు అంకం భూమయ్య):
ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దాదాపు రూ.200 కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఏ
ధర్మపురిలోని లక్ష్మీనరసింహ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ధర్మపురి కి చేరుకున్నారు.
ఈ సందర్భంగా *ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ* రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధర్మపురికి రావడంలో సుమారు ఐదు గంటలు ఆలస్యమైందని, అయినప్పటికీ ప్రజలు, కార్యకర్తలు ఎంతో ప్రేమాభిమానాలతో తనకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు చెబుతూ, ప్రజలు చూపిన ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రాధాన్యత, ధర్మపురి క్షేత్ర వైభవం అందరికీ తెలుసునని అన్నారు. గతంలో పలువురు నాయకులు ఆలయ అభివృద్ధిపై ఎన్నో హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదన్నారు. ప్రజల ప్రభుత్వం ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ.117 కోట్లు మంజూరు చేసిందని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరిన మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని ప్రకటించారు.
దాదాపు రూ.200 కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని, క్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యాలు, ఆలయ వైభవం, మౌలిక వసతులను మెరుగుపరుస్తామని చెప్పారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని, ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.
గత పదేళ్లలో ప్రజలు స్వేచ్ఛ లేకుండా భయంతో జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఉప ముఖ్యమంత్రి విమర్శించారు. ఒక కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని, తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అనేక అవమానాలు ఎదుర్కొన్నానని గుర్తుచేశారు.
ప్రజల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహించిన ప్రజల మార్చ్, పాదయాత్రలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనతో కలిసి పాల్గొన్నారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఒక్కో స్కూలుకు 200 కోట్ల నిధులతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేశామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు.
53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 16 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. ప్రతి రేషన్ కార్డు దారుడికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు.
కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ భీమా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ పథకం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు.
రైతుల రుణమాఫీ కింద 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్ల మేర ప్రయోజనం కల్పించామని, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించామని చెప్పారు. రూ.లక్ష కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేశామని, రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు రూ 500/- బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కేవలం ధర్మపురిలో మాత్రమే విద్యుత్ స్తంభాల మార్పిడి కోసం రూ.6 కోట్లు మంజూరు చేశామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు
*సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ* ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతోనే తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టానని అన్నారు.
స్వామివారి ఆశీస్సులతో ధర్మపురి అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.
ఈ చారిత్రక కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు.
గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురిలో యాగాలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చినా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం గోదావరి పుష్కరాల సందర్భంగా రూ.117 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
ధర్మపురి అభివృద్ధికి ప్రభుత్వ సహకారం మరింత అవసరమని మంత్రి కోరారు. అక్కపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, పాతిపాక రిజర్వాయర్, రొల్లవాగు ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
*జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడుతూ* తెలంగాణ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజల సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని కొనియాడారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల సమస్యలను శాసనసభలో బలంగా ప్రస్తావించారని తెలిపారు.
నేడు ఉప ముఖ్యమంత్రిగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ చేయడం ఈ క్షేత్ర చరిత్రలో గొప్ప ఘట్టమని అన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రికి ధర్మపురి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం తెలంగాణలోని ప్రసిద్ధ నవనరసింహ క్షేత్రాల్లో ఒకటని, గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించడంతో 'దక్షిణకాశీ', 'తీర్థరాజం', 'హరిహర క్షేత్రం'గా ప్రసిద్ధి చెందిందని తెలిపారు.
వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉగ్ర నరసింహస్వామి ఆలయాన్ని భక్తుల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా విస్తరించనున్నారని, మరో వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ స్తపతుల ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగ లక్ష్మీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ దినేష్ ఇతర సీనియర్ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఇన్గొల్లపల్లి సెప్టెంబర్ 07(ప్రజా మంటలు అంకం భూమయ్య):
ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు... జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన
జగిత్యాల, సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి... అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నిరసన
హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.
నల్ల టీషర్ట్లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత
హన్మకొండ, సెప్టెంబర్ 07, (ప్రజా మంటలు):
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు.
హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్... కొడంగల్‌పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ
హైదరాబాద్, సెప్టెంబర్ 6, ప్రజా మంటలు:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. ఈ నెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ... మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్, హైదరాబాద్, సెప్టెంబర్ 6: మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి... జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం
జగిత్యాల, సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు):
విద్యార్థుల్లో మేధాశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించడంలో చదరంగం కీలక పాత్ర పోషిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో విద్యార్థులకు చదరంగంలో మెరుగైన శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన జీనియస్ చెస్ అకాడమీని ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే... రాచకొండ కళాధర్ పార్థివ దేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత
జగిత్యాల సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కళాధర్ శనివారం జగిత్యాలలో దేహం చాలించారు. వారి పార్థివ దేహాన్ని జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు దేహ దానం చేశారు కుటుంబ సభ్యులు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు మంచాల కృష్ణ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం కళాధర్... జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ ...
జగిత్యాల సెప్టెంబర్ 6(ప్రజా మంటలు):
జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
గత కొంతకాలంగా పోలీస్ సిబ్బందికి డ్యూటీల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కిరణ్ కుమార్‌పై వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కొంతమంది సిబ్బందికి డ్యూటీలు ఇవ్వకుండా, వారి నుంచి పెద్ద మొత్తంలో... సీఎం రేవంత్ రెడ్డిపై విషప్రచారం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు
భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్
కరీంనగర్, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు అసత్య, అవమానకర ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్... 270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం
బెంగళూరు నుంచి లండన్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య
బెంగళూరు, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):
బెంగళూరు నుంచి లండన్‌కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆదివారం అత్యవసరంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ... గోవుల సంరక్షణకు గోశాల ఏర్పాటు అభినందనీయం
జగిత్యాల, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:గోవుల సంరక్షణ కోసం గోశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని సాయిబాబా ఆలయం ఎదురుగా శ్రీ లక్ష్మీ సాయి అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటు చేసిన గోశాలను ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్... 