ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్.

ఇది కాలం తెచ్చిన కరువు కాదు రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు.

On
ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్.

సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113. 

జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) : 

జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....

  1. ఈ ఏడాది ఎల్ ని నో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా పడటం, వర్షపాతం అస్థిరంగా ఉండటం వల్ల రైతులు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
  2. ఎప్పుడు వర్షం పడుతుందో, పంట ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో రైతు ధైర్యం చేసి సాగు ప్రారంభిస్తున్నాడు.
  3. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి, యూరియా, డీఏపీ ఎరువులు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు అందకుండా, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించడం అత్యంత దుర్మార్గం.
  4. ఒకవైపు ఎల్ ని నో ప్రభావంతో ప్రకృతి రైతును పరీక్షిస్తుంటే, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, బ్లాక్ మార్కెట్ మాఫియా రైతును ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. ఇది రైతుపై జరుగుతున్న ద్వంద్వ దాడి.
  5. పంటను కాపాడుకోవాలనే ఆత్రంతో రైతు ఎంత ధర చెప్పినా ఎరువులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బలహీనతను కొందరు అక్రమ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.
  6. ఎల్ ని నో ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇదేనా మీ అండ...? ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు ఎందుకు అందడం లేదు?బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైంది అని ప్రశ్నించారు...?
  7. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల దుకాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్ల లైసెన్సులను రద్దు చేయాలి అని అన్నారు.
  8. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరల నియంత్రణలో విఫలమైంది. సబ్సిడీ విధానం రైతుకు ఉపశమనం కలిగించేలా కాకుండా, మార్కెట్‌లో ధరల భారం రైతుపైనే పడే పరిస్థితి తీసుకొచ్చింది. రైతు చెల్లించే ధర పెరుగుతుంటే, కేంద్రం మాత్రం ప్రకటనలతో సరిపెడుతోంది.
  9. ఎల్ ని నో తో ప్రకృతి రైతును పరీక్షిస్తుంటే, బీజేపీ విధానాలు రైతు ఖర్చులను పెంచుతున్నాయి; రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం బ్లాక్ మార్కెట్‌కు అండగా మారుతోంది. ఇది రైతుపై ద్వంద్వ దాడి అని అన్నారు.
  10. యూరియా, డీఏపీ ఎరువులు ఎమ్మార్పీకే అందేలా కేంద్రం–రాష్ట్రం సంయుక్త పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి అని అన్నారు.
  11. రైతు చెమటతో దేశం నిలబడుతోంది. రైతును దోచుకునే బ్లాక్ మార్కెట్ ముఠాలను, వాటిని అడ్డుకోలేని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని, నిర్లక్ష్యంగా చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వా వికారిని రైతుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
  12. రైతులకు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే ఎరువులు అందేలా కఠిన చర్యలు తీసుకోవాలి.ఏల్నినో ప్రభావంతో నష్టపోయే రైతులకు ప్రత్యేక సహాయ చర్యలు ప్రకటించాలి.
  13. ఎల్ ని నో తో ప్రకృతి రైతును ఇబ్బంది పెడితే, ప్రభుత్వ వైఫల్యం రైతును మరింత కష్టాల్లోకి నెడుతోంది.
  14. రైతు చెమటను దోచుకునే బ్లాక్ మార్కెట్ ముఠాలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే, రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, BRS పార్టీ మండల అధ్యక్షులు అయిల్నేని ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, తేలు రాజు, నాయకులు ఎల్లా రాజన్న, నాడెం శంకర్, జక్కుల తిరుపతి, బక్కశెట్టి అంజన్న, ఆదిరెడ్డి రామకిషన్, ధర్మయ్య, గంగారెడ్డి, చిరంజీవి, బాలే చందు, మోహన్, భాస్కర్ నాయక్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం

బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం కొండగట్టు ఆగస్టు 16 (ప్రజా మంటలు)మల్యాల మండలం కొండగట్టు బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ లో ఆదివారం శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంటింటా లలిత పారాయణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కలశ గణాధిపతి గౌరీ పూజ తొలతగా నిర్వహించి అమ్మవారి విగ్రహానికి పల రసాలు పంచామృతాలతో అభిషేకం చేసి వివిధ రకాలైన పుష్పాలతో అమ్మవారిని...
Read More...
State News 

22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి    హైదరాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): నిషేధిత జాబితా (22-ఏ)లో చేరిన భూముల హక్కుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ...
Read More...
Local News 

ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య  సంస్మరణ వేడుక

ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య  సంస్మరణ వేడుక రాయికల్ ఆగస్టు 15 (ప్రజా మంటలు)రాయికల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో  చిలుకమర్రి పరాంకుశాచార్య  సంస్మరణ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమంలో పరాంకుశ ఆచార్య తనయుడు అడ్వకేట్ మదన్మోహన్ రాయికల్ సరస్వతి శిశు మందిర్ పునర్నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ. 1,11,111/-  భవన నిర్మాణ కమిటీకి అందజేయడం జరిగింది.    ఈ సందర్భంగా...
Read More...
Local News 

హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ

హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ జగిత్యాల ఆగస్టు 14లోక కళ్యాణార్థం పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సహస్రనామ సామూహిక పారాయణం ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు.    అంతకుముందు గణపతి గౌరీ దేవతల పంచామృత అభిషేకము నిర్వహించి శ్రీ లలిత అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో షోడశ ఉపచార పూజలు నిర్వహించారు. శ్రీ సూక్త...
Read More...
Local News 

పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు  తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత 

పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు  తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత  జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లకు పలుమార్లు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప ఇవ్వడం లేదని ఆరోపించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల పూర్తయిందని...
Read More...
Local News 

ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి 

ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి  జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సుయాత్ర చేరుకుంది. జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ బస్సు...
Read More...
Local News 

పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు 

పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు     జగిత్యాల ఆగస్ట్ 13( ప్రజా మంటలు)పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివుని మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏటా లాగే శ్రావణమాసం సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయపద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. తొలుతగా గణపతి ఉపనిషత్తులతో గణపతి పూజ, అనంతరం నారాయణ ఉపనిషత్తులతో శ్రీ సీతారామచంద్రుల పరివార...
Read More...
Local News 

వెల్గటూర్‌లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు

వెల్గటూర్‌లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు వెల్గటూర్, ఆగస్టు 13 (ప్రజా మంటలు): వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యం,...
Read More...
State News 

హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి

హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 13: హిందూ–ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇరువర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్...
Read More...
Local News  Crime 

బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్ 

బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్     బీర్ పూర్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ప్రజా మంటలు, ఆగస్ట్ 13:  జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.లంచం తీసుకుంటున్న రెవెన్యూ శాఖ గిర్ధావర్ రాహుల్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితురాలికి సంబంధించిన 12 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా...
Read More...
Local News 

కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

 కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు జగిత్యాల  ఆగస్టు 13 : ప్రతినిధి, ప్రజా మంటలు, జగిత్యాల పట్టణంలోనీ కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురు వారం తనిఖీలు చేశారు.  600 ఐస్ క్రీములు ఏప్రిల్ మాసంలోని తేదీ తయారీ ఉండగా ఫ్రీజర్ సరిగా పనిచేయక ఐస్ క్రీములు ఫంగస్ తో పాటు మెల్ట్ కావటంతో డైరీ నిర్వాహకులను ప్రశ్నించారు....
Read More...
Local News  State News 

అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి

అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు): అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లపై గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్...
Read More...