జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ
రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి కేటాయింపు – త్వరలో తాత్కాలిక భవనంలో తరగతుల ప్రారంభం
జగిత్యాల, జూలై 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సంయుక్తంగా భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. కేంద్రీయ విద్యాలయం కోసం గతంలో రైతులకు చెందిన భూమి కేటాయింపులో ఇబ్బందులు ఎదురైనా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కృషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలోని ఐదు ఎకరాల విలువైన భూమిని కేటాయించగలిగామని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,289 కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని, వాటిలో 13.51 లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. తెలంగాణకు 39 కేంద్రీయ విద్యాలయాలు మంజూరుకాగా, ప్రస్తుతం 37 పాఠశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు ప్రతీకలని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ దళాల సిబ్బంది పిల్లలతో పాటు స్థానిక విద్యార్థులకు కూడా ప్రవేశాల్లో అవకాశం ఉంటుందని వివరించారు. జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో ఐదు ఎకరాల భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం రావడం జిల్లాకు గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్కరణలను అమలు చేస్తోందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతో జాతీయ రహదారి సమీపంలోని ఐదు ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించామని చెప్పారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనంలోనే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయం కోసం నిరంతరం కృషి చేసిన ఫలితంగానే ఈ విద్యాసంస్థ జిల్లాకు వచ్చిందన్నారు. జగిత్యాల పరిసర ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం వంటి విద్యాసంస్థలు ఒకే ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయని తెలిపారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎంపీ అరవింద్ చేసిన కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యా రంగంలో విస్తృత సంస్కరణలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్. దినేష్, జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, చలగల్ గ్రామ సర్పంచ్ జున్ను రాజేందర్, ఆర్డీఓ మధుసూదన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం
కొండగట్టు ఆగస్టు 16 (ప్రజా మంటలు)మల్యాల మండలం కొండగట్టు బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ లో ఆదివారం శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంటింటా లలిత పారాయణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా కలశ గణాధిపతి గౌరీ పూజ తొలతగా నిర్వహించి అమ్మవారి విగ్రహానికి పల రసాలు పంచామృతాలతో అభిషేకం చేసి వివిధ రకాలైన పుష్పాలతో అమ్మవారిని... 22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): నిషేధిత జాబితా (22-ఏ)లో చేరిన భూముల హక్కుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ... ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ వేడుక
రాయికల్ ఆగస్టు 15 (ప్రజా మంటలు)రాయికల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమంలో పరాంకుశ ఆచార్య తనయుడు అడ్వకేట్ మదన్మోహన్ రాయికల్ సరస్వతి శిశు మందిర్ పునర్నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ. 1,11,111/- భవన నిర్మాణ కమిటీకి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా... హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ
జగిత్యాల ఆగస్టు 14లోక కళ్యాణార్థం పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సహస్రనామ సామూహిక పారాయణం ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు.
అంతకుముందు గణపతి గౌరీ దేవతల పంచామృత అభిషేకము నిర్వహించి శ్రీ లలిత అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో షోడశ ఉపచార పూజలు నిర్వహించారు. శ్రీ సూక్త... పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత
జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లకు పలుమార్లు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప ఇవ్వడం లేదని ఆరోపించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల పూర్తయిందని... ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సుయాత్ర చేరుకుంది. జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ బస్సు... పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు
జగిత్యాల ఆగస్ట్ 13( ప్రజా మంటలు)పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివుని మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏటా లాగే శ్రావణమాసం సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయపద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.
తొలుతగా గణపతి ఉపనిషత్తులతో గణపతి పూజ, అనంతరం నారాయణ ఉపనిషత్తులతో శ్రీ సీతారామచంద్రుల పరివార... వెల్గటూర్‌లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు
వెల్గటూర్, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యం,... హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 13:
హిందూ–ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇరువర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్... బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్
బీర్ పూర్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ప్రజా మంటలు, ఆగస్ట్ 13:
జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.లంచం తీసుకుంటున్న రెవెన్యూ శాఖ గిర్ధావర్ రాహుల్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
బాధితురాలికి సంబంధించిన 12 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా... కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
జగిత్యాల ఆగస్టు 13 : ప్రతినిధి, ప్రజా మంటలు,
జగిత్యాల పట్టణంలోనీ కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురు వారం తనిఖీలు చేశారు. 600 ఐస్ క్రీములు ఏప్రిల్ మాసంలోని తేదీ తయారీ ఉండగా ఫ్రీజర్ సరిగా పనిచేయక ఐస్ క్రీములు ఫంగస్ తో పాటు మెల్ట్ కావటంతో డైరీ నిర్వాహకులను ప్రశ్నించారు.... అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి
జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లపై గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్... 