సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు రోడ్డు భద్రత చర్యలు పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

On

 

జగిత్యాల జులై 22 (ప్రజా మంటలు)

ప్రతి 15 రోజులకు రవాణా, పోలీసు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమీక్ష


సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసి, అవసరమైన అన్ని చర్యలను 60 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రత కమిటీ చైర్‌ పర్సన్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.

బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌ లో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రోడ్డు భద్రతా నిబంధనల అమలుపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

IMG-20260722-WA0196

జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వివరించారు. జాతీయ రహదారులపై పార్కింగ్ నిషేధం, ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి వ్యవస్థ ఏర్పాటు, ఆక్రమణల తొలగింపు, హైవే భద్రతా పరిధిలో అనధికార వ్యాపారాల నియంత్రణ, హైవే సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు, హైవే సర్వేలెన్స్ పెట్రోలింగ్, అత్యవసర స్పందన వ్యవస్థ, వే సైడ్ అమెనిటీస్ (డబ్ల్యూ ఎస్ ఏ), స్పీడ్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు, సైన్‌బోర్డులు, ఎమర్జెన్సీ కాల్ బాక్సులు, ప్రతి 75 కిలోమీటర్లకు ట్రక్ లే-బై సదుపాయాలు, బ్లాక్‌స్పాట్ల అభివృద్ధి, హైమాస్ట్ లైటింగ్, అంతర్‌రాష్ట్ర సమన్వయం, సమగ్ర స్పందన నివేదికలపై సమావేశంలో వివరించారు.

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ,* జిల్లాలో డిస్ట్రిక్ట్ హైవే సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సూచించారు.

  
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లపై నీరు నిల్వ కాకుండా చర్యలు చేపట్టాలని, వరద ముంపునకు గురయ్యే రహదారులపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశించారు. గుంతలను వెంటనే పూడ్చి దెబ్బతిన్న రహదారులకు మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.

ప్రధాన రహదారులపై లైటింగ్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట అదనపు లైటింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. బ్లాక్‌ స్పాట్ల వద్ద హైమాస్ట్ లైట్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రమాదాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రద్దీ కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.

 ప్రజలకు, వాహనదారులకు రోడ్డు భద్రతా నిబంధనలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు జాతీయ రహదారుల వెంట ఆక్రమణలను తొలగించి నిఘా, పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. 


ప్రతి 15 రోజులకు ఒకసారి రవాణా శాఖ, పోలీసు శాఖ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు సమావేశమై రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను సమీక్షించాలని ఆదేశించారు.

 జాతీయ రహదారులపై ప్రయాణించే వారి కోసం అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నంబర్–1033పై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

IMG-20260722-WA0197

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ,* అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకపోవడం వల్లే అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై నిరంతర అవగాహన కల్పిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

గత నెలతో పోలిస్తే ఈ నెలలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులు, ఈ-చలాన్ అమలు వివరాలను సమావేశంలో వెల్లడించారు. వర్షాకాలంలో వాహనాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వాహనదారులకు సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజా గౌడ్, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, రవాణా శాఖ, పోలీసు శాఖ, ఆర్&బీ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం

బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం కొండగట్టు ఆగస్టు 16 (ప్రజా మంటలు)మల్యాల మండలం కొండగట్టు బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ లో ఆదివారం శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంటింటా లలిత పారాయణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కలశ గణాధిపతి గౌరీ పూజ తొలతగా నిర్వహించి అమ్మవారి విగ్రహానికి పల రసాలు పంచామృతాలతో అభిషేకం చేసి వివిధ రకాలైన పుష్పాలతో అమ్మవారిని...
Read More...
State News 

22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి    హైదరాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): నిషేధిత జాబితా (22-ఏ)లో చేరిన భూముల హక్కుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ...
Read More...
Local News 

ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య  సంస్మరణ వేడుక

ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య  సంస్మరణ వేడుక రాయికల్ ఆగస్టు 15 (ప్రజా మంటలు)రాయికల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో  చిలుకమర్రి పరాంకుశాచార్య  సంస్మరణ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమంలో పరాంకుశ ఆచార్య తనయుడు అడ్వకేట్ మదన్మోహన్ రాయికల్ సరస్వతి శిశు మందిర్ పునర్నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ. 1,11,111/-  భవన నిర్మాణ కమిటీకి అందజేయడం జరిగింది.    ఈ సందర్భంగా...
Read More...
Local News 

హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ

హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ జగిత్యాల ఆగస్టు 14లోక కళ్యాణార్థం పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సహస్రనామ సామూహిక పారాయణం ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు.    అంతకుముందు గణపతి గౌరీ దేవతల పంచామృత అభిషేకము నిర్వహించి శ్రీ లలిత అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో షోడశ ఉపచార పూజలు నిర్వహించారు. శ్రీ సూక్త...
Read More...
Local News 

పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు  తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత 

పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు  తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత  జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లకు పలుమార్లు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప ఇవ్వడం లేదని ఆరోపించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల పూర్తయిందని...
Read More...
Local News 

ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి 

ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి  జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సుయాత్ర చేరుకుంది. జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ బస్సు...
Read More...
Local News 

పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు 

పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు     జగిత్యాల ఆగస్ట్ 13( ప్రజా మంటలు)పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివుని మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏటా లాగే శ్రావణమాసం సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయపద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. తొలుతగా గణపతి ఉపనిషత్తులతో గణపతి పూజ, అనంతరం నారాయణ ఉపనిషత్తులతో శ్రీ సీతారామచంద్రుల పరివార...
Read More...
Local News 

వెల్గటూర్‌లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు

వెల్గటూర్‌లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు వెల్గటూర్, ఆగస్టు 13 (ప్రజా మంటలు): వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యం,...
Read More...
State News 

హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి

హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 13: హిందూ–ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇరువర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్...
Read More...
Local News  Crime 

బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్ 

బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్     బీర్ పూర్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ప్రజా మంటలు, ఆగస్ట్ 13:  జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.లంచం తీసుకుంటున్న రెవెన్యూ శాఖ గిర్ధావర్ రాహుల్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితురాలికి సంబంధించిన 12 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా...
Read More...
Local News 

కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

 కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు జగిత్యాల  ఆగస్టు 13 : ప్రతినిధి, ప్రజా మంటలు, జగిత్యాల పట్టణంలోనీ కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురు వారం తనిఖీలు చేశారు.  600 ఐస్ క్రీములు ఏప్రిల్ మాసంలోని తేదీ తయారీ ఉండగా ఫ్రీజర్ సరిగా పనిచేయక ఐస్ క్రీములు ఫంగస్ తో పాటు మెల్ట్ కావటంతో డైరీ నిర్వాహకులను ప్రశ్నించారు....
Read More...
Local News  State News 

అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి

అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు): అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లపై గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్...
Read More...