ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్‌మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రజలు మీ ప్రభుత్వాన్ని పడగొడతరు
ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొడతాం
గ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నరు
హైదరాబాద్, జూలై 20 (ప్రజా మంటలు):
ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల జోలికి వస్తే ప్రజలు ఈ ప్రభుత్వాన్నే పడగొడతారని ఆమె హెచ్చరించారు.
విద్యా కమిషన్ నివేదిక పేరుతో రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించే ప్రయత్నం జరుగుతోందని కవిత ఆరోపించారు. ఈ ప్రతిపాదనలను తెలంగాణ రక్షణ సేన మొదటి నుంచీ వ్యతిరేకిస్తోందన్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో ఒక్కో పాఠశాలకు సుమారు రూ.146 కోట్లు ఖర్చు చేయనున్నారని, మొత్తం 72 పాఠశాలల నిర్మాణానికి దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ పనుల్లో సగానికి పైగా కాంట్రాక్టులు మేఘా, కేఎంవీ సంస్థలకే దక్కాయని ఆరోపించారు.
ఈ సంస్థలు 5 శాతం అదనపు కోట్ చేయడం వల్ల ప్రభుత్వంపై రూ.600 కోట్లకు పైగా అదనపు భారం పడుతోందని కవిత అన్నారు. 72 పాఠశాలల టెండర్లలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. టెండర్లలో ‘రింగ్’ జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, కాంగ్రెస్ ఎంపీకి చెందిన ‘వెలుగు’ పత్రికలోనే దీనిపై వార్త ప్రచురితమైందని ఆమె అన్నారు.
“గుడి ఎంత ముఖ్యమో బడి కూడా అంతే ముఖ్యం. కానీ పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడిచినా విద్యార్థులకు యూనిఫాంలు అందలేదు. పిల్లలకు ఇస్తామని చెప్పిన బ్రేక్‌ఫాస్ట్ కూడా అందడం లేదు” అని కవిత విమర్శించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేస్తే విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, ముఖ్యంగా బాలికల విద్యకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల రవాణా కోసం బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఆ కాంట్రాక్టులు కూడా అదే సంస్థలకు అప్పగించే అవకాశం ఉందని ఆరోపించారు.
“గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సింది పోయి, వాటిని మూసివేసి గ్రామాల్లోకి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. బడ్జెట్ పాఠశాలలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారు” అని కవిత అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను భారీగా తగ్గిస్తే ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. కొత్తగా ఉపాధ్యాయుల నియామకాలు చేపడతారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డుకు ప్రభుత్వం కేవలం రూ.6 మాత్రమే చెల్లిస్తోందని, బయట మార్కెట్లో గుడ్డు ధర రూ.8గా ఉందని కవిత తెలిపారు. విద్యార్థులకు వారానికి మూడు రోజులు కాకుండా ఐదు రోజులు గుడ్డు అందించాలని, ఒక్కో గుడ్డుకు చెల్లించే ధరను రూ.8కు పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను తెలంగాణ రక్షణ సేన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని కవిత స్పష్టం చేశారు. గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు కొనసాగాలని, దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల వల్ల బాలికలు, పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆమె అన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితిలో, ముందుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం సరికాదని కవిత పేర్కొన్నారు. గ్రామ సర్పంచులు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
“ప్రభుత్వ పాఠశాలల జోలికి వస్తే ప్రజలు ఈ ప్రభుత్వాన్నే పడగొడతారు. ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేసే కుట్రలను ప్రజలతో కలిసి తిప్పికొడతాం” అని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం
కొండగట్టు ఆగస్టు 16 (ప్రజా మంటలు)మల్యాల మండలం కొండగట్టు బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ లో ఆదివారం శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంటింటా లలిత పారాయణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా కలశ గణాధిపతి గౌరీ పూజ తొలతగా నిర్వహించి అమ్మవారి విగ్రహానికి పల రసాలు పంచామృతాలతో అభిషేకం చేసి వివిధ రకాలైన పుష్పాలతో అమ్మవారిని... 22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): నిషేధిత జాబితా (22-ఏ)లో చేరిన భూముల హక్కుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ... ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ వేడుక
రాయికల్ ఆగస్టు 15 (ప్రజా మంటలు)రాయికల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమంలో పరాంకుశ ఆచార్య తనయుడు అడ్వకేట్ మదన్మోహన్ రాయికల్ సరస్వతి శిశు మందిర్ పునర్నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ. 1,11,111/- భవన నిర్మాణ కమిటీకి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా... హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ
జగిత్యాల ఆగస్టు 14లోక కళ్యాణార్థం పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సహస్రనామ సామూహిక పారాయణం ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు.
అంతకుముందు గణపతి గౌరీ దేవతల పంచామృత అభిషేకము నిర్వహించి శ్రీ లలిత అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో షోడశ ఉపచార పూజలు నిర్వహించారు. శ్రీ సూక్త... పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత
జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లకు పలుమార్లు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప ఇవ్వడం లేదని ఆరోపించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల పూర్తయిందని... ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సుయాత్ర చేరుకుంది. జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ బస్సు... పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు
జగిత్యాల ఆగస్ట్ 13( ప్రజా మంటలు)పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివుని మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏటా లాగే శ్రావణమాసం సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయపద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.
తొలుతగా గణపతి ఉపనిషత్తులతో గణపతి పూజ, అనంతరం నారాయణ ఉపనిషత్తులతో శ్రీ సీతారామచంద్రుల పరివార... వెల్గటూర్‌లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు
వెల్గటూర్, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యం,... హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 13:
హిందూ–ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇరువర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్... బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్
బీర్ పూర్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ప్రజా మంటలు, ఆగస్ట్ 13:
జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.లంచం తీసుకుంటున్న రెవెన్యూ శాఖ గిర్ధావర్ రాహుల్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
బాధితురాలికి సంబంధించిన 12 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా... కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
జగిత్యాల ఆగస్టు 13 : ప్రతినిధి, ప్రజా మంటలు,
జగిత్యాల పట్టణంలోనీ కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురు వారం తనిఖీలు చేశారు. 600 ఐస్ క్రీములు ఏప్రిల్ మాసంలోని తేదీ తయారీ ఉండగా ఫ్రీజర్ సరిగా పనిచేయక ఐస్ క్రీములు ఫంగస్ తో పాటు మెల్ట్ కావటంతో డైరీ నిర్వాహకులను ప్రశ్నించారు.... అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి
జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లపై గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్... 