విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన

NEET ప్రశ్నపత్రం లీకేజీపై ఉస్మానియా యూనివర్సిటీలో సంఘీభావ ర్యాలీ

On
విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన

హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు):

దేశవ్యాప్తంగా NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

NEET ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం: కందుల మధు

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కందుల మధు విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠిన కేసులు పెట్టడం దారుణమన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రధాని మోడీ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులకు న్యాయం చేయకపోతే పోరాటం: బొడ్డుపల్లి లింగం

దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని బొడ్డుపల్లి లింగం అన్నారు. 2024లో NTA, UGC నిర్వహించిన పలు పరీక్షలపై కూడా వివాదాలు తలెత్తాయని గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే ప్రభుత్వంపై మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

కేంద్రం బాధ్యత విస్మరించింది: అశోక్ యాదవ్

పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని అశోక్ యాదవ్ ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. జరిగిన పరిణామాలపై ప్రధాని మోడీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ర్యాలీలో గుమ్మడి క్రాంతి, సీహెచ్ భగత్ యాదవ్, కొప్పుల అర్జున్, రాజ్ కుమార్, కశ్యప్ యాదవ్, సాయి నేత, అకిల్ రెడ్డి, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

More News...

Local News 

జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన

జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన జగిత్యాల, సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
Read More...
State News 

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన    హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం...
Read More...
State News 

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత హన్మకొండ, సెప్టెంబర్ 07, (ప్రజా మంటలు): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్...
Read More...
State News 

కొడంగల్‌పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ

కొడంగల్‌పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ హైదరాబాద్, సెప్టెంబర్ 6, ప్రజా మంటలు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. ఈ నెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ...
Read More...
State News 

మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత

మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత    బంజారాహిల్స్, హైదరాబాద్, సెప్టెంబర్ 6: మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి...
Read More...
Local News  Sports 

జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం

జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం జగిత్యాల, సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు): విద్యార్థుల్లో మేధాశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించడంలో చదరంగం కీలక పాత్ర పోషిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో విద్యార్థులకు చదరంగంలో మెరుగైన శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన జీనియస్ చెస్ అకాడమీని ఎమ్మెల్సీ ఎల్‌. రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
Read More...
Local News 

రాచకొండ కళాధర్ పార్థివ దేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత 

 రాచకొండ కళాధర్ పార్థివ దేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత  జగిత్యాల సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కళాధర్ శనివారం జగిత్యాలలో దేహం చాలించారు. వారి పార్థివ దేహాన్ని జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు దేహ దానం చేశారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు మంచాల కృష్ణ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం కళాధర్...
Read More...
Local News 

జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ ...

జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ ... జగిత్యాల సెప్టెంబర్ 6(ప్రజా మంటలు): జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. గత కొంతకాలంగా పోలీస్ సిబ్బందికి డ్యూటీల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కిరణ్ కుమార్‌పై వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కొంతమంది సిబ్బందికి డ్యూటీలు ఇవ్వకుండా, వారి నుంచి పెద్ద మొత్తంలో...
Read More...
State News 

సీఎం రేవంత్ రెడ్డిపై విషప్రచారం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై విషప్రచారం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ కరీంనగర్, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు అసత్య, అవమానకర ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్...
Read More...
National 

270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం

270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం బెంగళూరు నుంచి లండన్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య బెంగళూరు, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు): బెంగళూరు నుంచి లండన్‌కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆదివారం అత్యవసరంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ...
Read More...
Local News 

గోవుల సంరక్షణకు గోశాల ఏర్పాటు అభినందనీయం

గోవుల సంరక్షణకు గోశాల ఏర్పాటు అభినందనీయం జగిత్యాల, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:గోవుల సంరక్షణ కోసం గోశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని సాయిబాబా ఆలయం ఎదురుగా శ్రీ లక్ష్మీ సాయి అపార్ట్‌మెంట్‌ వాసులు ఏర్పాటు చేసిన గోశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్...
Read More...
Local News 

నూకపల్లి సరస్వతీ ఆలయం వద్ద జగిత్యాల డైలీ వాకర్స్ సందడి

నూకపల్లి సరస్వతీ ఆలయం వద్ద జగిత్యాల డైలీ వాకర్స్ సందడి కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు.. ఆటపాటలతో ఉత్సాహం జగిత్యాల, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:జగిత్యాల పట్టణంలోని వివేకానంద స్వామి మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మల్యాల మండలం నూకపల్లిలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయ సన్నిధిలో వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 300 మంది వాకర్స్ తమ...
Read More...