ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?
ఆగమౌతున్న వలస కార్మికుల బతుకులు ప్రచారానికే పరిమితం అవుతున్న ప్రజాప్రతినిధులు నిజామాబాద్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం - పరిశీలన
ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?
ఆగమౌతున్న వలస కార్మికుల బతుకులు
ప్రచారానికే పరిమితం అవుతున్న ప్రజాప్రతినిధులు
నిజామాబాద్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం - పరిశీలన
హైదరాబాద్ మార్చ్ 28 ( ప్రత్యేక ప్రతినిధి) :
భారతదేశం నిండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళే కార్మికులలో, కేరలా తరువాత తెలంగాణ వారిదే ఎక్కువ సంఖ్య. అందులో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల నుండి మరి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. బతుకుతెరువు కొరకు అక్కడికి వెళ్ళిన అనేక బడుగు జీవుల బతుకులు ఆగమయ్యాయనేది, ఇక్కడి గ్రామాలలోని పేద కుటుంబాలను చూస్తే తెలుస్తుంది. పెద్ద దిక్కులేక పిల్లలు చాడుకోక, భార్య వారిని కట్టడి చేయలేక అనేక మంది పిల్లలు చెడు మార్గాలు పట్టిన సందర్భాలు అనేకం. అలాగే దోగా వీసాలతో వెళ్లి మోసపోయి, అక్కడి జైళ్ళలో గడుపుతున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదని అంటున్నారు. గతంలో అన్నీ రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు వీరి బాటుకులను బాగుచేస్తామని, వీరికి శిక్షణ ఇచ్చి మరీ గల్ఫ్ దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని హామీలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీరిని పట్టించుకోవడం లేదు.
ఇక్కడ బతకాలేమని, గల్ఫ్ దేశాలకు వెళ్ళే వలస కూలీలు లేదా కార్మికులను తయారు చేయడంలో దేశం ఎలాంటి పెట్టుబడి పెట్టడం లేదు. కానీ ఎన్నో గొప్ప గొప్ప చదులు చాడుకొన్నామని, మరిన్ని పెద్ద చదువులకు వెళుతున్నామని అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళే వారికంటే వీరే దేశానికి ఎక్కువ లాభం చేకూరుస్తున్నారు. కానీ వీరిని పట్టించుకొనే దిక్కులేదు. ఆమెరికాల్వనో, ఇంగ్లాండ్ లోనో, ఆస్ట్రేలియాలోనో ఒక్కడు చనిపోతే, దేశంలోని మీడియా అంతా గవగగొలు పెడుతుంది. కానీ దాదాపు ప్రతి రోజు ఏదో ఒక గల్ఫ్ దేశంలో, ఏదో కారణంగా భారతీయ కార్మికుడు చనిపోవడమో, ప్రమాదానికి గురవడంవ జరుగుతుంది. తమ తప్పులేకున్నా, వేల మంది కార్మికులు జైల్లో ఉంటున్నారు. వీరి గురించి మాత్రం ఆ మేధావులకు, నాయకులకు పట్టింపు లేదు.
ఎన్నికలు వచ్చినపుడు మాత్రం అందరూ వీరి గురించి ఉపన్యాసాలు, హామీలు ఇస్తారు. గతం ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఏర్పాటు; చేసిన భఏమా సౌకర్యం కూడా ఇప్పుడు లేదట, కానీ వీరు పంపే విదేశీ మారకం మాత్రం కావాలి. ప్రపంచంలో ఉన్న భారతీయులు మన దేశానికి పంపే విధేశీ మారకంలో దాదాపు 60 శాతం గల్ఫ్ కార్మికుల చామటోడ్చిన సంపాదనే అంటే అతిశయోక్తి కాదు. కానీ వారి గురించి ఎవరికి పట్టదు. ఎందుకంటే bbఆరిలో 90 శాతం బహుజన, బీసీ బిడ్డలే. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన నేపథ్యంలో... గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం శాసన మండలిలో, వివిధ వేదికలలో వారి గొంతుకగా పోరాటం చేసిన జీవన్ రెడ్డి ఈ ఎన్నికల్లో 'గల్ఫ్ ఓటు బ్యాంకు' పై ఆశలు పెట్టుకున్నారు.
భారత దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలలో అధిక గల్ఫ్ వలసలు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నిజామాబాద్ కూడా ఒకటి. ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళేవారిలో 99 శాతం పురుషులే. మహిళల వలస అత్యల్పం. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిజామాబాద్ అర్బన్ (బీజేపీ), ఆర్మూర్ (బీజేపీ), నిజామాబాద్ రూరల్ (కాంగ్రెస్), బోధన్ (కాంగ్రెస్), బాల్కొండ (బీఆర్ఎస్), కోరుట్ల (బీఆర్ఎస్), జగిత్యాల (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఫిబ్రవరి 8న ఎలక్షన్ కమీషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం నిజామాబాద్ పార్లమెంట్ లో 7,99,458 మంది పురుషులు, 8,90,411 మంది మహిళలు,1,088 ట్రాన్స్ జెండర్లు మొత్తం 16,89,957 మంది ఓటర్లు ఉన్నారు.
గల్ఫ్ ఓటు బ్యాంకు
గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న ఒక వలస కార్మికుడు, ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యులలో కనీసం ఇద్దరినీ ప్రభావితం చేస్తాడని అంచనా. గత పదేళ్లలో గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్న ఒక కార్మికుడు, కనీసం తాను ఒక్కడైనా ప్రభావితం అవుతాడని మరో అంచనా. ఈ విశ్లేషణ ప్రకారం గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులు, గల్ఫ్ రిటనీలు కలిసి నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 3,75,255 ఓటు బ్యాంకు ఉన్నదని అంచనా. ఇది మొత్తం ఓట్లలో 22.21 శాతం. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గల్ఫ్ ఓటు బ్యాంకు: నిజామాబాద్ అర్బన్ 46,286 (15.45%), నిజామాబాద్ రూరల్ 59,303 (23.33%), బోధన్ 42,243 (19.09%), ఆర్మూర్ 54,946 (26.07%), బాల్కొండ 58,237 (25.85%), కోరుట్ల 57,965 (23.75%). జగిత్యాల 56,275 (23.99%).
ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుంది. బీజేపీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ప్రకటించింది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఈసారి రంగంలో లేకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీహార్ జైలులో ఉండటం వలన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని మార్చి 27న ప్రకటించారు.
ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ - బీజేపీ ల మధ్యనే ఉంటుందనే అభిప్రాయం వ్యాపించింది. గల్ఫ్ దేశాలలో బీజేపీ అనుబంధ సంఘాలు చురుకుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఎన్నారై విభాగం డీలా పడింది. భారత జాగృతి అన్ని కమిటీలను కల్వకుంట్ల కవిత రద్దు చేశారు. గత పదేళ్లుగా కొంత చురుకుగా, కొంత నిద్రావస్థలో ఉన్న ప్రవాసీ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
టీఆర్ఎస్ కు దూరమైన 'గల్ఫ్'
2015 జూన్ లో బహ్రెయిన్ లో కార్మికులతో సహపంక్తి భోజనాలు చేసిన సందర్భంలో అప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత 'గల్ఫ్ నా ఎనిమిదో సెగ్మెంట్' అని ప్రేమగా చెప్పుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడంతో.. గల్ఫ్ కార్మికుల కుటుంబాలు తమ కోపాన్ని చూపించారు. ఫలితంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పరాజయం పాలయ్యారు. ఒయాసిస్సులా ఉన్న ఆమె రాజకీయ జీవితం ఎండమావి గా మారడానికి గల్ఫ్ ఓటు బ్యాంకు ఒక కారణం అయింది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ముంచిన గల్ఫ్ తుఫాన్
2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓడిపోయారు, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు.
నాలుగు నెలల్లోనే ఓటర్లు అనూహ్యామైన, విభిన్నమైన తీర్పు ఇవ్వడానికి గల ప్రధాన కారణాలలో గల్ఫ్ కార్మికుల సమస్య ఒక ప్రధాన కారణం అని తేలింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా గతంలో ఇచ్చిన ప్రధానమైన హామీలు గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించకపోవడం, సమగ్ర ఎన్నారై పాలసీ ప్రకటించకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం గల్ఫ్ కార్మికుల కోపానికి కారణమైంది.
చాలా మంది గల్ఫ్ కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్టుల నుంచి తొలగించడం, దూర దేశాల నుంచి వచ్చి ఓటెయ్యలేరు అనే కేసీఆర్ తిరస్కార భావన పట్ల గల్ఫ్ కార్మికులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. టీఆర్ఎస్ పై తమ కోపాన్ని తీర్చుకోవడానికి బీజేపీ సరైన ప్రత్యర్థి అని వారు భావించి తమ కుటుంబ సభ్యుల ద్వారా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని స్మార్ట్ ఫోన్ ల ద్వారా ప్రచారం చేశారు. కొందరికి కాంగ్రెస్ పై అభిమానం ఉన్నా అప్పుడు గెలిచే పరిస్థితి లేనందున బీజేపీ వైపే మొగ్గు చూపారు.
ఈ సారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ వోట్లను నమ్ముకోండి. గతంలో గెలిచిన బి ఆర్ ఎస్, బిజేపి అభ్యర్థులు ఎవరు కూడా తమకు న్యాయం చేయలేదని వీరు నమ్ముతున్నారు. బిజేపి, బి ఆర్ ఎస్ అభ్యర్థులు ఇద్దరు బీసీలే. అయినా వారిని కాదని కాంగ్రెస్ కు ఎందుకు వోటు వేయాలనే చర్చ గల్ఫ్ కారికుల కుటుంభలలో జరుగున్నట్లు తెలుస్తుంది. ఎవరు గెలిచినా, తమ బతుకుల్లో వెలుగు రావడమే ప్రధానంగా చూస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పాశ్చాత్య ప్రభావంతో లివ్-ఇన్ సంబంధాలు : విఫలం తర్వాత కేసులు
అలహాబాద్, జనవరి 24 ప్రత్యేక ప్రతినిధి):పాశ్చాత్య ఆలోచనల ప్రభావంతో యువత వివాహం లేకుండా లివ్-ఇన్ సంబంధాల్లోకి వెళ్తోందని, అలాంటి సంబంధాలు విఫలమైన తర్వాత అత్యాచారం వంటి కేసులు నమోదు అవుతున్నాయని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'లైవ్ లా' లో ప్రచురించిన కథనం ప్రకారం, మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాల ఆధారంగా... డీఎంకే వైపు ఏఐఏడీఎంకే నేతల వలస
తమిళనాడులోని ముఖ్యమైన పార్టీల గుర్తులు
చెన్నై, జనవరి 24 (ప్రత్యేక ప్రతినిధి):
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే వైపు ఏఐఏడీఎంకేకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుతున్నారు. గత ఆరు నెలల్లో మాజీ మంత్రి–ఎంపీ అన్వర్ రాజా, మాజీ ఎంపీ వి. మైత్రేయన్, మాజీ ఎమ్మెల్యే కార్తిక్ తొండైమాన్ సహా,... జపాన్‌లో ఎన్నికల సమరానికి సానే తకైచి పాంక్నిర్ణయం
టోక్యో జనవరి 24:
జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) నాయకురాలు మరియు 104వ ప్రధాన మంత్రి సానే తకైచి, గత అక్టోబర్‌లో పదవీ స్వీకరించినప్పటికీ, పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 8, 2026న దేశవ్యాప్త సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
తకైచి... అంతర్జాతీయ భ్రూణ హత్యల నివారణ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ
జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు)అంతర్జాతీయ భృణహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకొని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం రూపొందించిన, కరపత్రాలను, ప్రముఖ పౌరాణిక పండితులు బుర్రా భాస్కర శర్మ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్, ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బుర్రా భాస్కర శర్మ మాట్లాడుతూ పురి... జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..? ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.
జగిత్యాల, జనవరి 24 (ప్రజా మంటలు)
40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడాన్ని జగిత్యాల బిజెపి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు.
శనివారం బిజెపి సీనియర్ నేతలు సీపెళ్లి రవీందర్, అంకార్ సుధాకర్,... టీ-హబ్ స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
టీ-హబ్‌ను పూర్తిగా స్టార్టప్‌ల కేంద్రంగా మాత్రమే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చనున్నారన్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు.
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు... నోబెల్ శాంతి బహుమతి నిర్లక్ష్యమే గ్రీన్‌ల్యాండ్ అంశంపై వ్యాఖ్యలకు కారణమా?
అమెరికా రాజకీయాల్లో మరో వివాదాస్పద ప్రకటన
వాషింగ్టన్ జనవరి 24:
గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న గత వ్యాఖ్యల వెనుక కారణం నోబెల్ శాంతి బహుమతి అందకపోవడంపై అసంతృప్తినేనని అమెరికా మాజీ అధ్యక్షుడు వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యాఖ్యలు మరోసారి ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
తాను అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు... నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావొద్దు: సీపీ సజ్జనార్
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
నాంపల్లి ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో ప్రజలు **నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్)**కు రావద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు స్పష్టంగా సూచించారు. ఈరోజు నుమాయిష్ సందర్శనను వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నీచర్ షోరూమ్ గోదాంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.... మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి?
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతూ, తెలంగాణ జాగృతి పార్టీ చీఫ్ కవిత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తుద నిర్ణయం తీసుకున్నారు. స్థానిక రాజకీయాల్లో తన ఉనికిని ఘాటుగా చాటేందుకు, పార్టీ అభ్యర్థులను సింహం గుర్తుతో బరిలో నిలపనుంది.
పార్టీకి శాశ్వత గుర్తింపుగా సింహం గుర్తును ప్రజల్లో... పంటల ధర నిర్ణయ అధికారం రైతులకే ఉండాలి
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):పంటల ధరలను నిర్ణయించే అధికారం రైతులకే ఉండాలని, మార్కెట్లో జరిగే మోసాలను నియంత్రించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి స్పష్టం చేశారు.శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ శాఖ రిటైర్డ్ అధికారుల సంఘం రాష్ట్ర... ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవా తత్పరుడు కాసుగంటి సుధాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు)ప్రముఖ విద్యావేత్త,సామాజిక వేత్త,పారిశ్రామిక వేత్త సరస్వతీ శిశు మందిర్, శ్రీవాణి జూనియర్ కళాశాల ఛైర్మెన్ కాసుగంటి సుధాకర్ రావు ప్రథమ మాసికం( సంస్మరణ ) కార్యక్రమానికి ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్ పద్మనాయక కళ్యాణ మండపానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ఎందరో... నాంపల్లి రోడ్లో ఫర్నిచర్ షాప్ భవనంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
హైదరాబాద్ నాంపల్లి రోడ్‌లోని ఓ బహుళ అంతస్తుల ఫర్నిచర్ షాప్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు మంటల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఫర్నిచర్ షాప్‌కు చెందిన సెల్లార్లో ముందుగా అగ్ని... 