సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
జగిత్యాల అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
సీనియర్ సిటిజెన్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో టాస్కా జిల్లా స్థాయి సమావేశం జరిగింది.ఈ సందర్బంగా సీనియర్ సిటిజెన్స్ రాష్ట్ర సంఘానికి ఏకగ్రీవంగా రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికయిన మాజీ మున్సిపల్ చైర్మన్ జీ. ఆర్. దేశాయ్ కి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎన్నికయిన రిటైర్డ్ తహసీల్దార్ పి. హన్మంత్ రెడ్డి లకు పౌర సన్మానం నిర్వహించారు.ఈ సందర్బంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ వృద్ధుల సమస్యల పరిష్కారం, సంక్షేమము కోసం ప్రత్యేకంగా సీనియర్ సిటిజెన్స్ కమిషన్ వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఆ కమిషన్ చైర్మన్ గా తమ రాష్ట్ర అధ్యక్షులు పి. నర్సింహా రావు ను నియమించాలన్నారు.వృద్ధ తల్లిదండ్రులను నిరాదరించే ఉద్యోగుల వేతనాల లో నుంచి ప్రతి నెల 10శాతం మినహాయించి ఆ తల్లిదండ్రులకు అందజేసేలా చట్టం తెస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల తమ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరీశెట్టి విశ్వనాతం, ఉపాధ్యక్షులు బొల్లం విజయ్, ఎం. డీ. యా కూబ్, కోశాధికారి వెల్ ముల ప్రకాష్ రావు, ఆర్గనై జింగ్ కార్యదర్శులు పి. అశోక్ రావు, కే. సత్యనారాయణ,పట్టణ అధ్యక్షులు మానాల కిషన్, బీసీ మహిళా జేఏసి అధ్యక్షురాళ్లు కస్తూరీ శ్రీమంజరి, గంగము జలజ, సీనియర్ సిటిజన్స్ మహిళా కార్యదర్శి బి. కరుణ, మండల అధ్యక్షురాలు రాధ, మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు కొక్కుల ఆంజనేయులు,మైనారిటీ నేతలు జాఫర్, యాకూబ్ హుస్సేన్, సయ్యద్ యూసుఫ్, వజీర్, ఉమ్మడి జిల్లా విద్యార్ధి జేఏ సీ అధ్యక్షులు ధోనూరి భూమాచారి, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.

బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
