కుల.దురహంకారంతోనే సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై అనుచిత వ్యాఖ్యలు
- న్యాయమూర్తులను అవమానించడం న్యాయవ్యవస్థకు కళంకం
- నిందితులను ప్రాక్టీస్ నుంచి శాశ్వతంగా తొలగించాలి
- ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యుడు జక్కనపల్లి గణేష్
కరీంనగర్ సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు):
కుల దుర్హంకారంతోనే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ పై సిద్దిపేట బార్ అసోసియేషన్ చెందిన ఇద్దరు న్యాయవాదులు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యుడు జక్కనపల్లి గణేష్ ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా న్యాయవాదుల వాట్సాప్ గ్రూప్ లలో సిద్దిపేట పట్టణానికి చెందిన మురళీమోహన్ రావ్ అను న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి "కనకపు సింహాసనంన..." అనే సామెతతో పోలుస్తూ అభ్యంతరకర పోస్ట్ పెట్టగా, దానిని పొద్దుటూరి శ్రీకాంత్ అనే మరో న్యాయవాది సమర్థిస్తూ "వెనకటి ఊరి శునకాలు మలం తినేవి, వెనకటి శునకాలు మళ్లీ వచ్చాయి అనుకోలేదు, ప్రస్తుతనికి ఢిల్లీలో ఒకటి లభ్యం అయింది" అని అసభ్యంగా వివరణతో కొనసాగించాడన్నారు. న్యాయవాదులు ప్రవర్తించిన తీరు న్యాయవ్యవస్థకు కళంకమని, వీరిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తి అయినప్పటికీ మనువాదులు ఆయనను అగౌరవ పరుస్తున్నారన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వెంటనే నిందితులను ప్రాక్టీస్ నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
లోక — మలయాళ సినిమాకి కొత్త దిశ

వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)