బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు - ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు
వసూలైన ఇంటి పన్నులూ మాయం
దొంగ రశీదులతో ఇంటి పన్నుల వసూళ్లు
ట్రెజరీ లో జమ కాలేదని ఆరోపణ
గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడి దోపిడి
గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు పిర్యాదు
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - స్పెషల్ ఆపీసర్ జి.సునిత
బుగ్గారం ఏప్రిల్ 24:
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ హయాంలో ఇండ్ల నిర్మాణానికి దొంగ అనుమతి పత్రాలు జారీ అయ్యాయని ఆరోపిస్తూ తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి గురువారం స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు పిర్యాదు చేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్పెషల్ ఆపీసర్ జి. సునిత అధ్యక్షతన గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి ప్రత్యేకంగా పిర్యాదు చేస్తూ గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడిగా దోచుకున్నారని ఆరోపించారు.
భారీగా అవినీతికి పాల్పడి సుమారు 30 ఇండ్ల కు దొంగ అనుమతి పత్రాలు జారీ చేశారని అన్నారు. ఆ ఇండ్ల వివరాలు నేడు ఆన్ లైన్ లో కనబడడం లేదన్నారు. అదే ఇండ్ల పై ప్రతి ఏటా వసూలు చేసిన ఇంటి పన్నులు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయ రికార్డులలో నమోదు కాలేదన్నారు. అట్టి రశీదుల సొమ్ము కూడా ట్రెజరీ ద్వారా బ్యాంక్ ఖాతాలో కూడా జమ కాలేదని చుక్క గంగారెడ్డి సూచించారు. స్థానిక మండల పంచాయతీ అధికారి దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా, గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ లు ఇద్దరూ కుమ్మక్కై ఈ అక్రమాలు చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తగు విచారణ జరిపి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధిత ఇంటి యజమానులకు కూడా సరైన న్యాయం చేయాలని ఆయన కోరారు. *PRESS NOTE* - 2
గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దాం
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - బుగ్గారం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన స్పెషల్ ఆపీసర్ జి.సునిత 
బుగ్గారం గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దామని, ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంచుదామని స్పెషల్ ఆపీసర్ జి. సునీత గురువారం బుగ్గారం గ్రామ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆమె అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సమైక్య గ్రూప్ లతో కలిసి ముందుగా పరిశుభ్రత - పారిశుధ్యం, నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత, మరుగు దొడ్ల నిర్మాణం తదితర ముఖ్య అంశాలతో కూడిన విషయాలను ప్రజల నోటితో అనిపిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ సభలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామం లోని వీధి లైట్లు, మురికి కాలువలను, రోడ్ల ను ఆమె ప్రత్యేకంగా తిరిగి పరిశీలించారు. గ్రామ కార్యదర్శి అక్బర్ నేతృత్వంలో గ్రామ ప్రజలు, వివిధ శాఖల సిబ్బంది స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు ఘన స్వాగతం పలికారు. అంజీర మొక్కను బహుమతి గా ఆమెకు అందజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ గ్రామ సభలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, కోర్ కమిటి కో కన్వీనర్ పెద్దనవేణి రాగన్న, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, విడిసి సభ్యులు సుంకం గంగారెడ్డి, శ్రీ పేరంబూదూరి సురేందర్ స్వామి, చింతపండు మల్లయ్య, అంగన్ వాడీ టీచర్లు, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, మహిళా సమైక్య గ్రూప్ లీడర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష
.jpeg)
బిసి బంద్ ను విజయవంతం కొరకు ముందుకు రండి...
