బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు -  ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు

On
బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు -   ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు

వసూలైన ఇంటి పన్నులూ మాయం
దొంగ రశీదులతో ఇంటి పన్నుల వసూళ్లు

ట్రెజరీ లో జమ కాలేదని ఆరోపణ
గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడి దోపిడి

గ్రామ సభలో  స్పెషల్ ఆపీసర్ కు పిర్యాదు
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - స్పెషల్ ఆపీసర్ జి.సునిత  


బుగ్గారం ఏప్రిల్ 24:

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ హయాంలో ఇండ్ల నిర్మాణానికి దొంగ అనుమతి పత్రాలు జారీ అయ్యాయని ఆరోపిస్తూ తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి గురువారం స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు పిర్యాదు చేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్పెషల్ ఆపీసర్ జి. సునిత అధ్యక్షతన గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి ప్రత్యేకంగా పిర్యాదు చేస్తూ గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడిగా దోచుకున్నారని ఆరోపించారు.
భారీగా అవినీతికి పాల్పడి సుమారు 30 ఇండ్ల కు దొంగ అనుమతి పత్రాలు జారీ చేశారని అన్నారు. ఆ ఇండ్ల వివరాలు నేడు ఆన్ లైన్ లో కనబడడం లేదన్నారు. అదే ఇండ్ల పై ప్రతి ఏటా వసూలు చేసిన ఇంటి పన్నులు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయ రికార్డులలో నమోదు కాలేదన్నారు. అట్టి రశీదుల సొమ్ము కూడా ట్రెజరీ ద్వారా బ్యాంక్ ఖాతాలో కూడా జమ కాలేదని చుక్క గంగారెడ్డి సూచించారు. స్థానిక మండల పంచాయతీ అధికారి దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా, గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ లు ఇద్దరూ కుమ్మక్కై ఈ అక్రమాలు చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తగు విచారణ జరిపి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆపీసర్ కు  చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధిత ఇంటి యజమానులకు కూడా సరైన న్యాయం చేయాలని ఆయన కోరారు. *PRESS NOTE* - 2


గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దాం

ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - బుగ్గారం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన స్పెషల్ ఆపీసర్ జి.సునిత  IMG-20250424-WA0009

బుగ్గారం గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దామని, ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంచుదామని స్పెషల్ ఆపీసర్ జి. సునీత గురువారం బుగ్గారం గ్రామ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆమె అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సమైక్య గ్రూప్ లతో కలిసి ముందుగా పరిశుభ్రత - పారిశుధ్యం, నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత, మరుగు దొడ్ల నిర్మాణం తదితర ముఖ్య అంశాలతో కూడిన విషయాలను ప్రజల నోటితో అనిపిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ సభలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
 గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామం లోని వీధి లైట్లు, మురికి కాలువలను, రోడ్ల ను ఆమె ప్రత్యేకంగా తిరిగి పరిశీలించారు.  గ్రామ కార్యదర్శి అక్బర్ నేతృత్వంలో గ్రామ ప్రజలు, వివిధ శాఖల సిబ్బంది స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు ఘన స్వాగతం పలికారు. అంజీర మొక్కను బహుమతి గా ఆమెకు అందజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు. 
ఈ గ్రామ సభలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్,  కోర్ కమిటి కో కన్వీనర్ పెద్దనవేణి రాగన్న, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, విడిసి సభ్యులు సుంకం గంగారెడ్డి, శ్రీ పేరంబూదూరి సురేందర్ స్వామి, చింతపండు మల్లయ్య, అంగన్ వాడీ టీచర్లు, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, మహిళా సమైక్య గ్రూప్ లీడర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రారంభం – 121 నియోజకవర్గాల్లో పోలింగ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రారంభం – 121 నియోజకవర్గాల్లో పోలింగ్ పాట్నా, నవంబర్ 06:బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం (నవంబర్ 6, 2025) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో — నవంబర్ 6 మరియు నవంబర్ 11 తేదీలలో జరగనున్నాయి, కాగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.మొత్తం 3.75 కోట్లకు...
Read More...

ఇండియా ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా ‘ఎ’ వన్డే సిరీస్ – తిలక్ వర్మ సారథ్యంలో జట్టు ప్రకటింపు

ఇండియా ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా ‘ఎ’ వన్డే సిరీస్ – తిలక్ వర్మ సారథ్యంలో జట్టు ప్రకటింపు మొదటి టెస్ట్: నవంబర్ 14, కోల్కతా- రెండవ టెస్ట్: నవంబర్ 22, గౌహతి హైదరాబాద్, నవంబర్ 06: దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇండియా ‘ఎ’ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ నవంబర్ 13 నుంచి గుజరాత్‌లోని రాజ్కోట్ వేదికగా...
Read More...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల 10వ తరగతి ఫీజులు తానే చెల్లించనున్న ఎంపీ బండి సంజయ్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల 10వ తరగతి ఫీజులు తానే చెల్లించనున్న ఎంపీ  బండి సంజయ్ కరీంనగర్, నవంబర్ 06 (ప్రజా మంటలు):కేంద్ర సహాయ మంత్రి మరియు బీజేపీ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గంలోని విద్యార్థులకు శుభవార్త చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను తానే చెల్లిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసి తాను...
Read More...
National  Crime  State News 

ఝార్ఖండ్ BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్‌ కంట్రోవర్సీ

ఝార్ఖండ్ BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్‌ కంట్రోవర్సీ   బీహార్ ఎన్నికలలో కలకలం రేపుతున్న BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్‌ కంట్రోవర్సీ జూన్ లో HAM పార్టీ నాయకుని అరెస్ట్ తో వెలుగులోకి వచి సెక్స్ రాకెట్ పట్నా / రాంచీ నవంబర్ 06:  భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా నాయకురాలు ఫూల్ జోషి పేరుతో వెలుగుచూసిన హై ప్రొఫైల్ సెక్స్...
Read More...
National  State News 

Gorak poor మహిళా కానిస్టేబుల్ శిక్షణ కేంద్రంలో బాత్ రూమ్ ల దగ్గర సీసీ కెమెరాలు - ట్రైనీల నిరసన

Gorak poor మహిళా కానిస్టేబుల్ శిక్షణ కేంద్రంలో బాత్ రూమ్ ల దగ్గర సీసీ కెమెరాలు - ట్రైనీల నిరసన గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 05:గోరఖ్‌పూర్ జిల్లాలోని 26వ బెటాలియన్ PAC (Provincial Armed Constabulary) మహిళా శిక్షణా కేంద్రంలో భారీ కలకలం రేగింది. సుమారు 600 మంది మహిళా ట్రైనీ సిపాయిలు ఒకే సారి బయటకు వచ్చి రోదిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. బాత్రూమ్‌ దగ్గర కెమెరాలు అమర్చారనే ఆరోపణతో పాటు, వసతి...
Read More...

పొలస శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు

పొలస  శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు జగిత్యాల, నవంబర్ 05 (ప్రజా మంటలు):కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలోని శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ స్వయంగా ఆలయానికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం...
Read More...
Local News  Spiritual  

లక్ష వర్తిక వెలుగు లతో  దీపోత్సవం

లక్ష వర్తిక వెలుగు లతో  దీపోత్సవం సికింద్రాబాద్, నవంబర్ 05 ( ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని శ్రీ సాయి బాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిపారు. బుధవారం రాత్రి వేళ ఆలయ ఆవరణలో లక్ష వర్తిక దీపాలతో కార్తీక దీపోత్సవం నిర్వహించారు.వందలాది మంది హాజరై లక్ష వర్తిక దీపాలను వెలిగించారు. దీపాల వెలుగులో ఆలయం కొత్త శోభను సంతరించుకుంది....
Read More...
Local News 

10లక్షల 25వేల రూపాయల LOC ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

10లక్షల 25వేల రూపాయల LOC ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్    జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు)  రూరల్ మండల అంతర్గం గ్రామానికి చెందిన పల్లపు సాత్విక్ హార్మోన్ డెఫిషియన్సీ తో బాధపడుతూ ఉండగా గ్రామ నాయకులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారి దృష్టికి విషయాన్ని తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం *2లక్షల 75* వేల *ఈ...
Read More...
Local News 

మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .జగిత్యాల నవంబర్ 5(ప్రజా మంటలు) మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల పవన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న  సెకండ్ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోస్టర్ ను జగిత్యాలలో పావని కంటి ఆసుపత్రి వద్ద పోస్టర్ ను...
Read More...
National  International  

న్యూయార్క్‌ మేయ‌ర్ ఎన్నికాంలో రిపబ్లికన్లకు షాక్ - జోహార్ మందాని గెలుపు

న్యూయార్క్‌ మేయ‌ర్ ఎన్నికాంలో రిపబ్లికన్లకు షాక్ - జోహార్ మందాని గెలుపు న్యూయార్క్ నవంబర్ 05: న్యూయార్క్‌ నగరంలో నిన్న, నవంబర్ 4న జరిగిన 2025-ఎలక్షన్‌లో యువ డెమోక్రాటిక్ సోషలిస్ట్  (34) ఘన విజయాన్ని సాధించి మేయ‌ర్‌గా ఎన్నికయ్యారు. మొట్టమొదటి ముస్లిం, దక్షిణాసియన్ మరియు సరికొత్త తరం నాయకుడిగా, ఈ విజయం రిపబ్లికన్‌లకు పెద్ద షాక్‌గా మారింది. ట్రంప్ బెదిరింపులకు లొంగని న్యూయార్క్ పౌరులు, స్వేచ్చా ప్రియులు, మాందానిని...
Read More...
Local News 

భారత్ సురక్ష సమితి అధ్వర్యంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు... 

భారత్ సురక్ష సమితి అధ్వర్యంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు...     జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు) గురునానక్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తహసిల్ చేరస్తా వద్ద భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు. గురునానక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత్ సురక్ష సమితి నాయకులు.... ఈ సందర్భంగా  ఏ సిఎస్ రాజు, సామాజిక వేత్త  చిట్ల గంగాధర్...
Read More...
National 

బెంగాల్ లో SIR భయం.. ఎనిమిది మంది ఆత్మహత్యలు: TMC ఆరోపణ

బెంగాల్ లో SIR భయం.. ఎనిమిది మంది ఆత్మహత్యలు: TMC ఆరోపణ కోల్‌కతా, నవంబర్ 05: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్‌ జాబితా ప్రత్యేక పునర్విమర్శ (SIR) నేపథ్యంలో ఆందోళన పెరుగుతోంది. ఈ భయంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని టీమ్‌సీ (TMC) ఆరోపించింది. తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగర్ ప్రాంతానికి చెందిన సఫికుల్ గాజీ (57) అనే వ్యక్తి తన అత్తింటి వద్ద...
Read More...