జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి
జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి.
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
...............................
భారత్‌లో మిమిక్రీ కళకు ఆయన ఆద్యుడు, ఎంతో మంది ప్రముఖుల వందలాదిగా గొంతులను సునాయాసంగా, యథాతథంగా అనుకరించేవాడు. భారత్‌లో అనుకరించి నవ్వించే కళగా మాత్రమే ఉన్న మిమిక్రీని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించే స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కళాకారుడు. రాష్ట్రపతులు, ప్రధానుల నుండి సామాన్యుల వరకూ దేశంలో ఆయన అపూర్వ, అపురూప కళను అభినందించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు గుర్తు పట్టారనుకుంటా. ఆయనే వందలాది గొంతుకల వేణు మాధవుడు.
ధ్వన్యనుకరణ సామ్రాట్ అనే బిరుదును పొందిన తెలంగాణ గర్వించ దగ్గ ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ ( డిసెంబరు 28, 1932 - జూన్ 19, 2018 ) చిన్నప్పుడు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నాడు. అయినా ఆయన అమెరికా, బ్రిటన్ ఇంగ్లిష్ ఉచ్చారణలతో కూడా గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన సొంతంగా ఈ కళను సాధన చేశారు. స్వీయ పరిశీలన, స్వయం అధ్యయనంతో తనను తాను మెరుగు పరచుకుంటూ అత్యున్నత స్థాయిని అందుకున్న ప్రతిభాశాలి.
చిన్నతనంలో చిలకమర్తి
లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నా అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. 1953 లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, జె. ఎన్. టి. యు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌరసన్మానం జరిగాయి. ఆయన స్వయంగా నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి యేటా ఒక కళాకారుడిని సన్మానించాడు. హనుమకొండలో ఆయన పేరు మీదుగా డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం నిర్మించారు.
నేరెళ్ళ వేణుమాధవ్ వరంగల్ పట్టణంలోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు.
పండితుడైన తండ్రి, వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ తన ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తుండగా, అలా వచ్చిన వారిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి గొప్పవారి సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. సినిమాలంటే ఎంతో ఇష్టం. చిత్తూరు నాగయ్య నటించిన గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి, నాగయ్య కూడా ధ్వన్యనుకరణ చేయగలవారు కావడంతో ఆయన పై అభిమానంతో కేవలం స్వయం పరిశీలనతోనే ఆ రంగంలో ప్రవేశించాడు. అలాగే వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవాడు. అలా మొదలయ్యింది అయన మిమిక్రీ ప్రస్థానం.
1950 లో మెట్రిక్యులేషన్, 1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు, ఇతర లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ కు ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ ( బర్సరీ ) మంజూరు చేశారు. ఆ డబ్బుతో పలు ఇంగ్లీషు సినిమాల్ని చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు పరమానంద భరితులై "యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్" అని, అయితే నీవు నా రెండవ కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని 'విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్' గా ఎదిగేలా చేసాయి. 1953 లో ప్రభుత్వ పాఠశాల (జి సి ఎస్ స్కూలు హనుమకొండ) లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. అనంతరకాలంలో ప్రైవేటుగా బీ.ఏ. బీ. కాం పాసయ్యారు.
తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు. మలి ప్రదర్శన 1953 లో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ సహానీ గారి అధ్యక్షతన, గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు, స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజు గారల సమక్షంలో ఇచ్చారు.
ఆయన ప్రదర్శనలు చూసిన పలువురు రాజకీయ ప్రముఖుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు లాంటి ఎంతోమంది ఉన్నారు.
ఆస్ట్రేలియా,ఫిజీ దీవులు -1965,
సింగపూర్,మలేషియా - 1968
పశ్చిమ జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా, కెనెడా, లెబనాన్ - 1971
ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన - 1971, సింగపూర్,మలేషియా - 1975, అమెరికా, కెనెడా - 1976
దక్షిణాఫ్రికా,మారిషస్,సీషెల్స్ - 1976, సింగపూర్, మలేషియా -1977, అమెరికా, కెనెడా - 1982
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 1987, మారిషస్ - 1990 తదితర దేశాలలో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చాడు.
వేణుమాధవ్ గారు నిర్వహించిన పదవుల్లో ఎం.ఎల్.సీ (1972-78)
ఎఫ్.డీ.సీ డైరెక్టర్ (1976-77)
సంగీత నాటక అకాడమీ సభ్యుడు (1974-78), సౌత్ జోన్ కల్చరల్ కమిటీ, తంజావూరు సభ్యుడు,
దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-94),
టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-96),
రైల్వే జోనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు (1993-96),
ఎ.పి.లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడు (1972-75), రవీంద్ర భారతి కమిటీ సభ్యుడు (1974-78), ప్రభుత్వ అకాడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడు (1975-76) తదితర పదవులు నిర్వహించాడు.
ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, చుపే రుస్తుం ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళాసరస్వతి, స్వర్ కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ, మున్నగు బిరుదులు వరించాయి. 1977 ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ బిరుదు, 1982 రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, 1987 జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వ విద్యాలయం, 1992 కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు...1997 కనకాభిషేకం, 1998 ఎన్టీఆర్ ఆత్మ గౌరవ పురస్కారం, 2001 పద్మశ్రీ, 2005 తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018లో భాగంగా జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయ బడింది. తిరుపతి పట్టణంలో గజారోహణం, పొరసన్మానం జరిగాయి.
పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ 2018, జూన్ 19వ తేదీ తమ 85వ యేట కన్నుమూశారు. హనుమకొండ పట్టణంలో నిర్మింపబడ్డ 'డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళాప్రాంగణం ' సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగ పడుతున్నది. నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్' ను స్థాపించి ప్రతియేటా తన పుట్టినరోజైన డిసెంబర్ 28న ప్రముఖ కళాకారులను పదివేల రూపాయల పురస్కారంతో సత్కరిస్తున్నారు.
2017లో నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 28వ తేదీని తెలుగు రాష్ట్రాల్లో 'మిమిక్రీ డే'గా జరుపు కుంటారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిశువుతో మహిళా జర్నలిస్టుకు సీసీఎస్‌లో గంటల తరబడి విచారణ
హైదరాబాద్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
ఆరు నెలల పసికందును చేతుల్లో ఎత్తుకుని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు వెళ్లిన మహిళా జర్నలిస్టు జల్లి రేఖను దాదాపు ఏడు గంటలపాటు అక్కడే ఉంచి ప్రశ్నించారనే ఆరోపణలు హైదరాబాద్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె వెంట మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. మహిళా... లక్ష్మీపూర్‌లో కోడి పందాలపై పోలీసుల దాడి
గొల్లపల్లి అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో గొల్లపల్లి పోలీసులు దాడి నిర్వహించారు.
గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి పోలీసులు లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు ఎనిమిది మంది వ్యక్తులు, మరికొందరు కలిసి... విద్యుత్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి
ఎల్కతుర్తి, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి 33/11 కేవీ సబ్స్టేషన్లతో పాటు 132/32 కేవీ భీమదేవరపల్లి సబ్‌స్టేషన్‌ను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న... జగిత్యాల మెడికల్ కళాశాల భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారు?
జగిత్యాల, అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులని, వాటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావా వసంత సురేష్, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన... ఆర్టీసీ డిపో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, డిసిసి అధ్యక్షులు నందయ్య
జగిత్యాల అక్టోబర్ 8 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వద్ద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్ టి సి యూనియన్ ఎన్నికల్లో ఐ ఎన్ టి యు సి ,ఎస్ డబ్ల్యూ యూ, టి డబ్ల్యూయూ, ఎస్ డబ్ల్యూ ఎఫ్ లకు మద్దతుగా బాణం గుర్తుకే ఓటు... ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు : బీజేపీ నేత ఖమ్మం వేంకటేశం
కోహెడ, అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
ఆలయాల అభివృద్ధి కోసం భక్తులు, దాతలు సమకూర్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేసుకోవడం సరికాదని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం అన్నారు. గురువారం కోహెడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి... రోల్లవాగు ప్రాజెక్టు పూర్తికి కృషి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
బీర్పూర్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
గోదావరి పుష్కరాల నేపథ్యంలో బీర్పూర్ మండలంలోని రంగసాగర్, మంగేలా, కమ్మనూరు, చిత్రవేణిగూడెం, రేకులపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పర్యటించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మంగేలా ఆశ్రమ పాఠశాలలో... రూ.12 వేల లంచం తీసుకుంటూ అటవీ అధికారి అరెస్ట్
ఖానాపూర్ అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టింబర్ డిపో పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి రవీందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘బ్లాక్ డే’
కరీంనగర్ అక్టొబర్ 08(ప్రజా మంటలు):
AICC, TPCC పిలుపు మేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ‘బ్లాక్ డే’ నిరసన చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు.
కార్పొరేషన్... రేకుల షెడ్డులోనే వైద్య తరగతులా?
జగిత్యాల అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తమకు కనీస వసతులు కల్పించడంలేదని ఆరోపిస్తూ వరుసగా రెండో రోజు ఆందోళనకు దిగారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆందోళనలో ప్రధానంగా తరగతి గదులు, మౌలిక వసతుల కొరత... బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత
ముంబాయి అక్టోబర్ 08:
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో ఆయన అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మణిపాల్ ఆసుపత్రి వైద్యుల ప్రకారం నానా పటేకర్ ... రైతుల సంక్షేమానికి పీఏసీఎస్‌లు సమర్థవంతంగా పనిచేయాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
రాయికల్, అక్టోబర్ 7 (ప్రజా మంటలు):
రైతుల సంక్షేమం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) మరింత సమర్థవంతంగా పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సూచించారు.
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహించిన ఇటిక్యాల పీఏసీఎస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పీఏసీఎస్... 