జయ జయహే తెలంగాణ జన జాగృత గీతానికి అరుదైన గౌరవం
జయ జయహే తెలంగాణ జన జాగృత గీతానికి అరుదైన గౌరవం
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు )
*జయ జయహే తెలంగాణ జనని జయకేతనం* అన్న అందెశ్రీ గీతం తెలంగాణ జాతీయ గీతం గా మారిందనుటలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏ వేదిక పైన అయినా ఈ గీతం లేని కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు. అన్ని వర్గాల వారిని ఆలోచింపజేసినది ఈ గీతం .అలాంటి ఈ గీతం యొక్క చరణం పేరుతోనే ఢిల్లీలో ఈనెల 26న జరగబోయే గణతంత్ర దినోత్సవ శకటానికి" జయ జయహే తెలంగాణ" అని పేరు పెట్టడమే కాకుండా తెలంగాణ పోరాటయోధుల విగ్రహాలతో శకటం ఢిల్లీలో పరేడ్లో ప్రదర్శన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ అని చెప్పక తప్పదు. ఈ గీతం కేవలం ఉద్యమ సమయానికి మాత్రమే పరిమితం కాకుండా నిరంతరము తెలంగాణలో ప్రజా స్వామ్య ఉద్యమ స్ఫూర్తి గుర్తుకు వచ్చేలా రూపు దిద్దుకుంది. తెలంగాణలో విద్యాసంస్థల్లో ప్రార్థనకు ముందు *తెలంగాణ జాతీయగీతం* గా వినిపించడం జరుగుతుంది.
ఈ గీతానికి ప్రజల్లో ఉన్న గౌరవానికి గుర్తుగా జాతీయస్థాయిలో ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మన రాష్ట్ర గీతం పేరుతోనే *జయ జయహే తెలంగాణ* అని తెలంగాణ శకటానికి నామకరణం చేయడం అందెశ్రీ రచించిన ఈ గీతమునకు ఇన్ని సంవత్సరాల తర్వాతనైన సరియైన వేదికపైన తెలంగాణ గీతానికి సముచిత స్థానం కల్పించడం తెలంగాణ ప్రజలు గర్వించాల్సిందే. స్వరాష్ట్రసాధన కోసం తెలంగాణ ఉద్యమకారులను ఎంతో ప్రభావితం చేసిన ఈ గీతం ద్వారా అప్పట్లో ఉద్యమకారుల్లో ప్రేరణ కలిగించ డమే కాకుండా గీతం ఆనాటి తొలి దశ తెలంగాణ ఉద్యమ నాయకుల పేర్లు స్మరిస్తూ గీతం కొనసాగడమే కాకుండా మలిదశ ఉద్యమానికి కూడా ప్రేరణగా నిలవడం ఆ గీతానికి ఉన్న ప్రాధాన్య గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రధానమంత్రిని కలిసి గణతంత్ర దినోత్సవం లో తెలంగాణ ఘనతను చాటేలా శకటానికి జయ జయహే*తెలంగాణ గీతం* నామకరణం తో పాటు తొలి దశ, ఉద్యమాల్లో పాల్గొన్న వారి విగ్రహాలను ఆ శకటంపై మట్టి పరిమళాలు కొమరం భీమ్, రాంజీగోండ్, చాకలి ఐలమ్మ ల విగ్రహాలు ఉంచడం తెలంగాణ కోసం బలిదానాలు చేసుకొన్న పోరాట యోధులకు మనమిచ్చే నిజమైన నివాళులు అని చెప్పక తప్పదు.
అందెశ్రీ రచించిన *జయ జయహే తెలంగాణ* గీతం పేరు గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే శకటానికి నామకరణం చేయడం ఆ గీతానికి "సార్ధకత" కల్పించినట్లయింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
బెంగళూరులో విషాదం: కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్య
బెంగళూరు జనవరి 30 (ప్రజా మంటలు):
వ్యాపార వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసే విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాన్ఫిడెంట్ గ్రూప్ యజమాని, చైర్మన్ అయిన సీజే రాయ్ (57) శుక్రవారం బెంగళూరు సెంట్రల్ ప్రాంతంలోని తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటనతో వ్యాపార వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా... ఫోన్‌ట్యాపింగ్ కేసు: కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు
హైదరాబాద్ జనవరి 30 (ప్రజా మంటలు):
ఫోన్‌ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారణకు అనుమతి ఇవ్వలేమని సిట్ స్పష్టం చేసింది. తమ రికార్డుల్లో... ప్రజల బ్రతుకులు బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయాలి: రాంచందర్ రావు
▶ కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపణ▶ జగిత్యాలలో ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితి: అరవింద్▶ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోంది.
జగిత్యాల, జనవరి 30 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ శంఖారావం... అందుబాటులో ఉండనున్న జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు
జగిత్యాల జనవరి 30 ( ప్రజా మంటలు) రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులుగా ఖర్టాడే కాళీచరణ్ సుదామ రావు జగిత్యాల జిల్లాకు నియమించబడగా జగిత్యాల లోని అతిథి గృహంలో సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు
ప్రజలు,... మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
జగిత్యాల/ కోరుట్ల/ మెట్పల్లి జనవరి 30 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, జగిత్యాల, కోరుట్ల,మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
విధుల్లో ఉన్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు... ఆధార్ సెంటర్ ఆపరేటర్స్ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలి అదనపు కలెక్టర్ బిఎస్ లత
జగిత్యాల జనవరి 30 (ప్రజా మంటలు) జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరము లో శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్, బి. సత్యప్రసాద్, ఆదేశాల క్రమము జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్. లత జిల్లాలోని ఆధార్ సెంటర్ ఆపరేటర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది.
యు ఐ డి ఏ ఐ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలని ఎవరైనా... సమ్మక్క–సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల కోసం పోరాటం: కవిత
మేడారం, జనవరి 30 (ప్రజా మంటలు):
సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు.
కాకతీయుల వంటి రాజులతో పోరాడిన వనదేవతలు సమ్మక్క–సారలమ్మలు తమ జాతి కోసం నిలబడి పోరాడిన వీరవనితలని అన్నారు. గోవిందరాజు, పడిగిద్దరాజు వంశానికి చెందిన గొప్ప... అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి అడ్లూరి
గొల్లపల్లి, జనవరి 30 (ప్రజా మంటలు):
ధర్మపురి పట్టణంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన స్టార్ బిర్యాణి సెంటర్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఘటన వివరాలను బాధితుల నుంచి తెలుసుకున్నారు.
గతంలో కూడా యాజమానికి చెందిన టెంట్ సామగ్రి అగ్ని ప్రమాదంలో నష్టపోయిందని, ఇప్పుడు బిర్యాణి సెంటర్... ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన సిగ్గుచేటు : జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం
కరీంనగర్, జనవరి 30 (ప్రజా మంటలు):
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక వీధి రౌడీలా మాట్లాడటం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ మాట్లాడారు.
వీణవంకలో... మారేడు ఆకుపై అమ్మవార్లు…
జగిత్యాల, జనవరి 30 (ప్రజా మంటలు):
జగిత్యాలకు చెందిన చిత్రకారుడు, కళాశ్రీ గుండేటి రాజు తన ప్రత్యేక కళా నైపుణ్యంతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నారు. పవిత్రమైన మారేడు ఆకుపై సమ్మక్క–సారక్క అమ్మవార్ల ప్రతిమలను తన కుంచెతో అద్భుతంగా చిత్రీకరించి భక్తుల మనసులు గెలుచుకున్నారు.
శుక్రవారం సమ్మక్క–సారక్క ఇద్దరూ గద్దెపై కొలువుదీరిన సందర్భంగా, అపారమైన భక్తితో... తెలంగాణ జల ద్రోహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి: హరీష్ రావు
హైదరాబాద్, జనవరి 30 (ప్రజా మంటలు):
రాజకీయాలకన్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో అత్యవసరంగా ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన… రాష్ట్రానికి జరుగుతున్న తీవ్రమైన జల ద్రోహాన్ని దేశరాజధాని ఢిల్లీ కేంద్రంగా ప్రజల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ పరిస్థితిని... భారతదేశ ఆర్ధిక రంగ ముఖచిత్రమే ఆర్ధిక సర్వే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025–26 భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ స్థితిని సంఖ్యలతో స్పష్టంగా చూపిస్తోంది. ప్రభుత్వ ప్రచార వాదనలకు భిన్నంగా, ఈ సర్వే భారత ఆర్థిక నిర్మాణంలో ఉన్న బలహీనతలను బహిర్గతం చేస్తోంది.
ఎగుమతులు–దిగుమతులు: అసమతుల్యత స్పష్టం
ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం, భారత... 