జయ జయహే తెలంగాణ జన జాగృత గీతానికి అరుదైన గౌరవం
జయ జయహే తెలంగాణ జన జాగృత గీతానికి అరుదైన గౌరవం
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు )
*జయ జయహే తెలంగాణ జనని జయకేతనం* అన్న అందెశ్రీ గీతం తెలంగాణ జాతీయ గీతం గా మారిందనుటలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏ వేదిక పైన అయినా ఈ గీతం లేని కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు. అన్ని వర్గాల వారిని ఆలోచింపజేసినది ఈ గీతం .అలాంటి ఈ గీతం యొక్క చరణం పేరుతోనే ఢిల్లీలో ఈనెల 26న జరగబోయే గణతంత్ర దినోత్సవ శకటానికి" జయ జయహే తెలంగాణ" అని పేరు పెట్టడమే కాకుండా తెలంగాణ పోరాటయోధుల విగ్రహాలతో శకటం ఢిల్లీలో పరేడ్లో ప్రదర్శన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ అని చెప్పక తప్పదు. ఈ గీతం కేవలం ఉద్యమ సమయానికి మాత్రమే పరిమితం కాకుండా నిరంతరము తెలంగాణలో ప్రజా స్వామ్య ఉద్యమ స్ఫూర్తి గుర్తుకు వచ్చేలా రూపు దిద్దుకుంది. తెలంగాణలో విద్యాసంస్థల్లో ప్రార్థనకు ముందు *తెలంగాణ జాతీయగీతం* గా వినిపించడం జరుగుతుంది.
ఈ గీతానికి ప్రజల్లో ఉన్న గౌరవానికి గుర్తుగా జాతీయస్థాయిలో ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మన రాష్ట్ర గీతం పేరుతోనే *జయ జయహే తెలంగాణ* అని తెలంగాణ శకటానికి నామకరణం చేయడం అందెశ్రీ రచించిన ఈ గీతమునకు ఇన్ని సంవత్సరాల తర్వాతనైన సరియైన వేదికపైన తెలంగాణ గీతానికి సముచిత స్థానం కల్పించడం తెలంగాణ ప్రజలు గర్వించాల్సిందే. స్వరాష్ట్రసాధన కోసం తెలంగాణ ఉద్యమకారులను ఎంతో ప్రభావితం చేసిన ఈ గీతం ద్వారా అప్పట్లో ఉద్యమకారుల్లో ప్రేరణ కలిగించ డమే కాకుండా గీతం ఆనాటి తొలి దశ తెలంగాణ ఉద్యమ నాయకుల పేర్లు స్మరిస్తూ గీతం కొనసాగడమే కాకుండా మలిదశ ఉద్యమానికి కూడా ప్రేరణగా నిలవడం ఆ గీతానికి ఉన్న ప్రాధాన్య గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రధానమంత్రిని కలిసి గణతంత్ర దినోత్సవం లో తెలంగాణ ఘనతను చాటేలా శకటానికి జయ జయహే*తెలంగాణ గీతం* నామకరణం తో పాటు తొలి దశ, ఉద్యమాల్లో పాల్గొన్న వారి విగ్రహాలను ఆ శకటంపై మట్టి పరిమళాలు కొమరం భీమ్, రాంజీగోండ్, చాకలి ఐలమ్మ ల విగ్రహాలు ఉంచడం తెలంగాణ కోసం బలిదానాలు చేసుకొన్న పోరాట యోధులకు మనమిచ్చే నిజమైన నివాళులు అని చెప్పక తప్పదు.
అందెశ్రీ రచించిన *జయ జయహే తెలంగాణ* గీతం పేరు గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే శకటానికి నామకరణం చేయడం ఆ గీతానికి "సార్ధకత" కల్పించినట్లయింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
