ద్వి చక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్ 5 ద్వి చక్ర వాహనాలు మరియు 1 కారు స్వాదీనం
జగిత్యాల ఫిబ్రవరి 9( ప్రజా మంటలు )
ఈ సంవత్సరం జనవరి నెలలో తిప్పన్నపేట గ్రామంలో తన ఇంటి ముందు పార్కు చేసిన టూ వీలర్ బైక్ ని ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించినారు అని పిర్యాదిదారుడు భారతపు పెద్ది రాజం s/o రాజం, r/o తిప్పన్నపేట గ్రామం అనునతడి ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ SI సదాకర్ కేసు నమోదు చేసుకొని, జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీం లో ఏర్పాటు చేయగా, జగిత్యాల రూరల్ ఎస్సై సదాకర్ టీం ఆదివారం 09-02-2025 ఉదయం 05:30 గంటలకు తిప్పన్నపేట గ్రామ శివారులోని హుందాయి క్రేటా కారులో వస్తున్న ఐదుగురు అనుమానిత వ్యక్తులను గుర్తించి వారిని విచారించగా,
వారు,
1. జక్కుల గోపాల్ తండ్రి పేరు రాజన్న, వయస్సు 36 సంవత్సరాలు, కులము యాదవ,వృత్తి:డ్రైవర్
2.సింగం రాజు తండ్రి పేరు నారాయణ 37 సంవత్సరాలు కులము:గౌడ్, వృత్తి:డ్రైవర్
3.నేరెళ్ల నరేష్ తండ్రి పేరు వెంకటి గౌడ్ వయస్సు 35 సంవత్సరాలు కులము గౌడ, వృత్తి:డ్రైవర్
4.సంపతి కుమారస్వామి తండ్రి పేరు పోచయ్య, 27 సంవత్సరాలు, కులము యాదవ, వృత్తి:వ్యవసాయం r/o కలమడుగు గ్రామం, జన్నారం మండలం, జిల్లా మంచిర్యాల మరియు
5.బుర్ర రాజేందర్ తండ్రి పేరు సత్తయ్య గౌడ్, 27 సంవత్సరాలు, వృత్తి:డ్రైవర్ r/o తిర్యాని గ్రామం మరియు మండలం, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా
అనువారలను విచారించగా, వారంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళలో కలమడుగు నుంచి కారులో బయలుదేరి వివిధ గ్రామాలలో ఇంటి ముందు పార్కు చేసిన బైకులను దొంగలిస్తున్నామని, అట్టి దొంగిలించిన బైక్లను వారి స్వగృహంలో దాచి పెట్టినామని నేరం ఒప్పుకున్నారు. ఈ విధంగా వారు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో డిసెంబర్ నెలలో ఒక బైక్ ని దొంగిలించామని, అంతకు ముందు దండేపల్లి లోని వెలగనూర్ గ్రామం లో ఒక బైక్ ని, జనవరి నెలలో చిన్న బెల్లాల్ గ్రామం లోని ఇంటి ముందు పార్క్ చేసిన ఒక బైక్ ని, జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలోని ఒక బైక్ ని మరియు దండేపల్లి లోని ద్వారక గ్రామంలో ఇంటి ముందు పార్కు చేసిన బైక్ లను దొంగతనం చేశామని నేరం ఒప్పుకున్నారు. వాటిని దాచిన అట్టి ప్రదేశాన్ని చూపెట్టినారు.
నిందుతుల నుండి స్వాదినం చేసుకున్న వాటి వివరాలు
1. రికవరీ చేసిన బైక్లు-5
2. క్రేటా కార్-1
3.మొబైల్ ఫోన్-5
ఈ రోజు వారిని జ్యూడిషల్ రిమాండ్ గురించి మేజిస్ట్రేట్ వద్దకు పంపుతున్నామన్నారు.
ఇట్టి నిందితులను చాకచక్యంగా పట్టుకొని టు వీలర్ బైక్లను రికవరీ చేసిన జగిత్యాల రూరల్ CI కృష్ణా రెడ్డి, ఎస్సై సధాకర్ మరియు పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాస్,గంగాధర్,రాహుల్, ఉమర్, మోహన్ లను జగిత్యాల ఎస్పి అశోక్ కుమార్ అభినందించారు.
డిఎస్పి,జగిత్యాల
More News...
<%- node_title %>
<%- node_title %>
వెనిజులా పై అమెరికా దాడి: చట్టమా? లేక సామ్రాజ్యవాద దౌర్జన్యమా?
— సిహెచ్. వి. ప్రభాకర్ రావు
వెనిజులా పై అమెరికా చేసిన సైనిక–భద్రతా చర్యలు, ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బలవంతంగా అమెరికాకు తీసుకెళ్లి క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రపంచ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రమాదకర మలుపుగా మారింది. ఇది ఒక సాధారణ “చట్ట అమలు చర్య” కాదు; ఒక సార్వభౌమ దేశంపై... బీసీల బందు కేసీఆర్ అయితే బీసీలకు రాబందు రేవంత్ రెడ్డి- దావ వసంత సురేష్
జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)పట్టణంలోని సావిత్రిబాయి పూలే పార్కులో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బిఆర్ఎస్ నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా తొలి జడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...* బిఆర్ఎస్ హయంలో బడుగు బలహీన వర్గాలకు... రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నాయకులు
జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సి ఎస్టి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.
మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ టీఎన్జీవో ఉద్యోగులందరికీ నూతన సంవత్సర... డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు
జగిత్యాల జనవరి 3 ( ప్రజా మంటలు)జగిత్యాల ముద్దుబిడ్డ డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు లభించింది.
హైదరాబాదులో నిర్వహించిన 22వ అప్రస్కాన్ 20 25 అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ఫరెన్స్లో జగిత్యాలకు చెందిన డాక్టర్ అభినవ్... కోరుట్ల పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో తనిఖీలు.. జరిమానాలు విధించిన మున్సిపల్ అధికారులు
కోరుట్ల జనవరి 3 (ప్రజా మంటలు)
పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలో తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు పట్టణంలో గల రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి పరిశుభ్రత పాటించని, మరియు సింగిల్... అభయాంజనేయ స్వామి ఆలయంలో ధార్మిక సంస్థల సమావేశం
జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు) వివిధ ధార్మిక సంస్థల సమావేశము అభయాంజనేయ స్వామి టెంపుల్ అరవింద నగర్ లో జరిగింది దీనిలో భూమి, నీరు,వాయువు అగ్ని ఆకాశము పంచభూతాలను కాపాడుతూ పర్యావరణo అసమతౌల్యం వల్ల జరిగే నష్టాలను అధిగమించుటకు పర్యావరణ సమస్యలను అధిగమించుటకు అందరూ అన్ని దేవాలయాలలో సింగల్ యూస్ ప్లాస్టిక్ వాడకూడదని నిర్ణయం ఆంజనేయుని దయతోనే నాకు పునర్జన్మ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కొండగట్టు, జనవరి 3 (ప్రజా మంటలు):
ఆంజనేయ స్వామి దయతోనే తనకు పునర్జన్మ లభించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కొండగట్టులో టిటిడి సహకారంతో నిర్మించనున్న వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ... శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా సుదర్శన హోమం
జగిత్యాల జనవరి 2 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీ ధనుర్మాస ఉత్సవ సందర్భంగా లోక కళ్యాణము కోసం భగవత్ ఆచార్య అనుగ్రహ ప్రాప్తికై, తొమ్మిది రోజులపాటు, ఏకకుండాత్మక, శ్రీ లక్ష్మీ నారాయణ సుదర్శన హోమం,ఒకటవ తేదీ నుండి 9వ
శుక్రవారం... మున్సిపల్ ఓటర్ల జాబితాలో తప్పులు సవరించాలని రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్ డి ఓ) ఏవో జగిత్యాల కి వినతిపత్రం సమర్పించిన భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు..
జగిత్యాల జనవరి 3 ( ప్రజా మంటలు)
మున్సిపల్ అధికారులు రూపొందించిన ఓటరు జాబితా తప్పుల తడకగా ఉంది దానిని సవరించుట గురించి ఈరోజు స్థానిక ఆర్డీవో ఏవోకి వినతిపత్రం సమర్పించారు భారత్ సురక్ష సమితి నాయకులు. వారు మాట్లాడుత రానున్న మున్సిపల్ ఎన్నికల నేపద్యంలో జగిత్యాల మున్సిపల్ అధికారుల రూపొందించిన ఓటరు జాబితా తప్పుల... లోక కళ్యాణార్థం సుదర్శన హోమం
జగిత్యాల జనవరి 2 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీ ధనుర్మాస ఉత్సవ సందర్భంగా లోక కళ్యాణము కోసం భగవత్ ఆచార్య అనుగ్రహ ప్రాప్తికై, తొమ్మిది రోజులపాటు, ఏకకుండాత్మక, శ్రీ లక్ష్మీ నారాయణ సుదర్శన హోమం,ఒకటవ తేదీ నుండి 9వ
శుక్రవారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కొండగట్టు జనవరి 2 (ప్రజా మంటలు)1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అశోక్... రాష్ట్ర మంత్రులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు
జగిత్యాల జనవరి 2 (ప్రజా మంటలు)నూతన సంవత్సరం 2026 పురస్కరించుకొని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు ఆడవాళ్ళ జ్యోతి లక్ష్మణ్తెలంగాణ రాష్ట్ర మంత్రులకు పొన్నం ప్రభాకర్ కి, అడ్లూరి లక్ష్మణ్ మరియు శ్రీధర్ బాబులను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్యతో ప్రత్యక్షంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు... 