ద్వి చక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్ 5 ద్వి చక్ర వాహనాలు మరియు 1 కారు స్వాదీనం
జగిత్యాల ఫిబ్రవరి 9( ప్రజా మంటలు )
ఈ సంవత్సరం జనవరి నెలలో తిప్పన్నపేట గ్రామంలో తన ఇంటి ముందు పార్కు చేసిన టూ వీలర్ బైక్ ని ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించినారు అని పిర్యాదిదారుడు భారతపు పెద్ది రాజం s/o రాజం, r/o తిప్పన్నపేట గ్రామం అనునతడి ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ SI సదాకర్ కేసు నమోదు చేసుకొని, జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీం లో ఏర్పాటు చేయగా, జగిత్యాల రూరల్ ఎస్సై సదాకర్ టీం ఆదివారం 09-02-2025 ఉదయం 05:30 గంటలకు తిప్పన్నపేట గ్రామ శివారులోని హుందాయి క్రేటా కారులో వస్తున్న ఐదుగురు అనుమానిత వ్యక్తులను గుర్తించి వారిని విచారించగా,
వారు,
1. జక్కుల గోపాల్ తండ్రి పేరు రాజన్న, వయస్సు 36 సంవత్సరాలు, కులము యాదవ,వృత్తి:డ్రైవర్
2.సింగం రాజు తండ్రి పేరు నారాయణ 37 సంవత్సరాలు కులము:గౌడ్, వృత్తి:డ్రైవర్
3.నేరెళ్ల నరేష్ తండ్రి పేరు వెంకటి గౌడ్ వయస్సు 35 సంవత్సరాలు కులము గౌడ, వృత్తి:డ్రైవర్
4.సంపతి కుమారస్వామి తండ్రి పేరు పోచయ్య, 27 సంవత్సరాలు, కులము యాదవ, వృత్తి:వ్యవసాయం r/o కలమడుగు గ్రామం, జన్నారం మండలం, జిల్లా మంచిర్యాల మరియు
5.బుర్ర రాజేందర్ తండ్రి పేరు సత్తయ్య గౌడ్, 27 సంవత్సరాలు, వృత్తి:డ్రైవర్ r/o తిర్యాని గ్రామం మరియు మండలం, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా
అనువారలను విచారించగా, వారంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళలో కలమడుగు నుంచి కారులో బయలుదేరి వివిధ గ్రామాలలో ఇంటి ముందు పార్కు చేసిన బైకులను దొంగలిస్తున్నామని, అట్టి దొంగిలించిన బైక్లను వారి స్వగృహంలో దాచి పెట్టినామని నేరం ఒప్పుకున్నారు. ఈ విధంగా వారు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో డిసెంబర్ నెలలో ఒక బైక్ ని దొంగిలించామని, అంతకు ముందు దండేపల్లి లోని వెలగనూర్ గ్రామం లో ఒక బైక్ ని, జనవరి నెలలో చిన్న బెల్లాల్ గ్రామం లోని ఇంటి ముందు పార్క్ చేసిన ఒక బైక్ ని, జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలోని ఒక బైక్ ని మరియు దండేపల్లి లోని ద్వారక గ్రామంలో ఇంటి ముందు పార్కు చేసిన బైక్ లను దొంగతనం చేశామని నేరం ఒప్పుకున్నారు. వాటిని దాచిన అట్టి ప్రదేశాన్ని చూపెట్టినారు.
నిందుతుల నుండి స్వాదినం చేసుకున్న వాటి వివరాలు
1. రికవరీ చేసిన బైక్లు-5
2. క్రేటా కార్-1
3.మొబైల్ ఫోన్-5
ఈ రోజు వారిని జ్యూడిషల్ రిమాండ్ గురించి మేజిస్ట్రేట్ వద్దకు పంపుతున్నామన్నారు.
ఇట్టి నిందితులను చాకచక్యంగా పట్టుకొని టు వీలర్ బైక్లను రికవరీ చేసిన జగిత్యాల రూరల్ CI కృష్ణా రెడ్డి, ఎస్సై సధాకర్ మరియు పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాస్,గంగాధర్,రాహుల్, ఉమర్, మోహన్ లను జగిత్యాల ఎస్పి అశోక్ కుమార్ అభినందించారు.
డిఎస్పి,జగిత్యాల
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు

మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.
