రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత
రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు
- అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎమ్మెల్సీ కవిత
వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష గారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
మలేషియా వేదికగా జరిగిన U19WorldCup ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి ఇండియా విశ్వ విజేతగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన త్రిష ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచారు. దూకుడుగా ఆడి చివరి వరకు నిలబడి సత్తా చాటారు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు.
గొంగడి త్రిష లాంటి క్రీడాకారులు Telangana రాష్ట్రానికి గర్వ కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మరింతగా రాణించి భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యమున్న యువతీ యువకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్సీ కవిత అభినందనలు
T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుని దానిని నిలబెట్టుకున్నందుకు అండర్-19 మహిళా క్రికెట్ జట్టుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు.u
ఈరోజు తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను గెలుచుకున్నందుకు తెలంగాణకు చెందిన త్రిష గొంగడికి ప్రత్యేక ప్రశంసలు. భారతదేశం మరియు తెలంగాణకు గర్వకారణమైన క్షణం మని, ఛాంపియన్స్, మరోసారి ఇంటికి తీసుకువచ్చినందుకు ఇండియా టీం కు ఎమ్మెల్సి కవిత అభినందనలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు

మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.
