వేల గొంతులు...లక్ష డప్పుల ప్రొగ్రాం ప్రపంచాన్నే ఆకర్శించనుంది...
వేల గొంతులు...లక్ష డప్పుల ప్రొగ్రాం ప్రపంచాన్నే ఆకర్శించనుంది...
* ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అద్యక్షులు మందకృష్ణ మాదిగ
సికింద్రాబాద్, ఫిబ్రవరి 02 ( ప్రజామంటలు) :
ఫిబ్రవరి 7న జరగబోయే వేల గొంతులు..లక్ష డప్పుల అతిపెద్ద సాంస్కృతిక ప్రదర్శన కేవలం తెలంగాణ కే పరిమితం కాకుండా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్శించేలా చేస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అద్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. బన్సీలాల్ పేట లోని మల్టీపర్పస్హాల్ లో జరిగిన హైదరాబాద్ జిల్లా సన్నాహాక సమావేశం నిర్వహించారు. దివంగత నాయకుడు కొండూరు రాజ ఎల్లయ్య కు నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ...సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి ఐదు నెలలు అవుతున్నా, ఇంకా ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. అందరికంటే ముందుగా రాష్ర్టంలో వర్గీకరణ అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, మాలల ఒత్తిడికి తలొగ్గి మాట తప్పారన్నారు. తాను 30 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నానని, దేశంలోనే తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదర్రాబాద్ కు వచ్చి తమకు మద్దతు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ ను కూలదొస్తామని హెచ్చరించారు. కార్పొరేటర్లు కే.హేమలత, ప్రసన్న లక్ష్మీ, రచయిత మిట్టపల్లి సురేందర్, గోవింద్ నరేష్, బొర్ర బిక్షపతి, నర్సింహారావు, అంజన్న, అశోక్, మాదిగల అభివృద్ది ఐక్యత జేఏసీ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
