తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు
తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు
హైదరాబాద్ జనవరి 20:
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ‘తీన్మార్ సంక్రాంతి’గా మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికో లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి ప్రారంభించగా, గుప్తేశ్వరి వాసుపిల్లి, శ్రీమతి పద్మజ వరదా, సమత కాకర్ల, కస్తూరి ఛటర్జీ మరియు మాధురి చాతరాజు జ్యోతి ప్రజ్వలన చేయగా, శ్రీతన్ పూల మరియు ఆర్యన్ పూల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.
ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీస్ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాన్సీ డ్రెస్, డ్రాయింగ్, ముగ్గులు మరియు వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను గుప్తేశ్వరి వాసుపిల్లి పర్యవేక్షించారు. 
కార్యక్రమంలో భాగంగా వందమందికి పైగా చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వచనాలను అందించారు. అలాగే TCA స్పాన్సర్ NCPL అధినేత రాంబాబు వాసుపిల్లిచే 2025 టోరెంటో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు. శ్రీనివాస్ మన్నెం ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో’ అనే విధముగా తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.
తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి శ్రీరంజని కందూరి గారు, రాహుల్ బాలనేని మరియు మాధురి చాతరాజు నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్గా వ్యవహరించిన NCPL అధినేత శ్రీ రాంబాబు వాసుపిల్లి గారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు.
ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. వేడుకలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. ఫ్యాన్సీ డ్రెస్ బహుమతి స్పాన్సర్గా వ్యవహరించిన విభూతి ఫాబ్ స్టూడియో వారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు TCA లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి ప్రణీత్ పాలడుగు, కోశాధికారి రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీరంజని కందూరి, శ్రీ కోటేశ్వర్ చెటిపెల్లి, శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు రాహుల్ బాలనేని, పవన్ కుమార్ పెనుమచ్చ, రాము బుధారపు, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, అతిక్ పాషా, కలీముద్దీన్ మొహమ్మద్, అఖిలేష్ బెజ్జంకి, శ్రీనివాస తిరునగరి, సంతోష్ గజవాడ, వేణుగోపాల్ రోకండ్ల, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురం మరియు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి కృతజ్ఞతా వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలను ఘనంగా ముగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి. -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు):
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం టీ.పి.సి.ఏ.ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో పెన్షన్ నిబంధనలు-ప్రయోజనాలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
అనంతరం 2024... హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్
కోరుట్ల డిసెంబర్ 19|(ప్రజా మంటలు):
కోరుట్లకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ క్యాన్సర్తో మృతి చెందడంపై తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి మాజీ జెడ్పీటీసీ అడ్డగట్ల లలితలతో కలిసి... అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన... ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ప్రజల సంతృప్తి_ గ్రామపంచాయతీ ఎన్నికల తీర్పు నిదర్శనం
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తున్న తీరుకు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు... భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు, ₹4,000 జరిమానా కీలక తీర్పును వెలువరించిన . జిల్లా సెషన్స్ జడ్జి రత్న పద్మావతి
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లం రాజేశ్వరి అనే మహిళ కు స్టంభంపల్లి గ్రామానికి చెందిన బొల్లం జగదీష్ను 2016 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, బొల్లం... కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తాత్కాలికంగా రద్దు
న్యూఢిల్లీ డిసెంబర్ 19| (ప్రజా మంటలు):
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ ఏడాది అవార్డుల ప్రకటనకు ముందే అవార్డు జాబితా ఒక ఆంగ్ల పత్రికకు లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గురువారం(18 డిసెంబర్ ),మధ్యాహ్నం జరగాల్సిన సాహిత్య అకాడమీ మీడియా సమావేశాన్ని... ఆర్యుపిపి జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల స్వామి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల రాజేంద్రప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 19 (|ప్రజా మంటలు):
రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం (ఆర్యుపిపిటీఎస్) ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శానమోని నర్సిములు, రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి సత్తిరాజు శశికుమార్ యాదవ్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అల్లకట్టు సత్యనారాయణను... అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరణపై టీజీహెచ్ఆర్సీ సీరియస్
హైదరాబాద్ డిసెంబర్ 19 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా మండల విద్యా కార్యాలయాల్లో (MEO కార్యాలయాలు) మెసెంజర్లు (ఆఫీస్ సబార్డినేట్లు)గా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరించడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన జరిగిన విచారణలో, 20 సంవత్సరాలకు పైగా... మణుగూరు–భద్రాచలం జనం బాటలో గిరిజనుల పక్షాన కల్వకుంట్ల కవిత పోరాటం
భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 19 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో గిరిజనులు, ఆదివాసీలు, సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు.
మణుగూరు ఓసీ–2 గనిని సందర్శించిన కవిత, కార్మికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్లో కార్మికులతో కలిసి... ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి
హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి హెచ్చరించారు.
మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి... 