రూ.450కోట్ల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం
రూ.450కోట్ల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం
సింగపూర్ జనవరి 19:
సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌లో రూ. 450కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్యాండ్ (Capita Land) ముందుకొచ్చింది.
సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచస్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన క్యాపిటల్యాండ్ హైదరాబాద్ నగరంలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది.
ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం క్యాపిటల్యాండ్ ప్రతినిధులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది.
ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, క్యాపిటల్యాండ్ తరఫున ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం గారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ తదితరులు పాల్గొన్నారు.
క్యాపిటల్యాండ్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. క్యాపిటల్యాండ్ గ్రూపు చేపట్టే ఈ కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలను క్యాపిటల్యాండ్ నిర్మించే ఐటీ పార్కులో అందుబాటులో ఉంటాయి.
రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించటం ఆనందంగా ఉందని క్యాపిటల్యాండ్ సీఈఓ గౌరీ శంకర్ నాగభూషణం అభిప్రాయపడ్డారు.
క్యాపిటల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ (ITPH), అవాన్స్ హైదరాబాద్, సైబర్‌పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలోనే అందుబాటులోకి వస్తుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
