రూ.450కోట్ల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ సంస్థ  క్యాపిటల్ ల్యాండ్‌ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం

On
రూ.450కోట్ల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ సంస్థ  క్యాపిటల్ ల్యాండ్‌ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం

రూ.450కోట్ల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ సంస్థ  క్యాపిటల్ ల్యాండ్‌ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం

సింగపూర్‌ జనవరి 19:

సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌లో రూ. 450కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ  క్యాపిటల్యాండ్‌ (Capita Land) ముందుకొచ్చింది.

సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచస్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన క్యాపిటల్యాండ్‌  హైదరాబాద్ నగరంలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది.

ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం క్యాపిటల్యాండ్ ప్రతినిధులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది.

 ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, క్యాపిటల్యాండ్ తరఫున ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం గారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ తదితరులు పాల్గొన్నారు.

 క్యాపిటల్యాండ్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. క్యాపిటల్యాండ్ గ్రూపు చేపట్టే ఈ కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలను క్యాపిటల్యాండ్ నిర్మించే ఐటీ పార్కులో అందుబాటులో ఉంటాయి.IMG-20250119-WA0139

 రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించటం ఆనందంగా ఉందని క్యాపిటల్యాండ్ సీఈఓ గౌరీ శంకర్ నాగభూషణం అభిప్రాయపడ్డారు.

 క్యాపిటల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ (ITPH), అవాన్స్ హైదరాబాద్, సైబర్‌పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలోనే అందుబాటులోకి వస్తుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది.

Tags

More News...

Local News 

పొలం బాట లో రైతుల చెంతకు విద్యుత్ యంత్రాంగం

పొలం బాట లో రైతుల చెంతకు విద్యుత్ యంత్రాంగం మెట్ పల్లి జులై 10 (ప్రజా మంటలు)రైతులు నాట్లు వేసే ప్రస్తుత ముమ్మర దశలో పొలం బాట కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది  రైతులను పంట పొలాల్లోనే కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం గుండంపల్లి గ్రామం సందర్శించిన సందర్భంగా మెటుపల్లి ఎన్పీడీసీఎల్ డీఈ మధుసూదన్ మాట్లాడుతూ రైతులు...
Read More...
Local News 

నారాయణ దాసు ఆశ్రమంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభం

నారాయణ దాసు ఆశ్రమంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభం జగిత్యాల జులై 10 (ప్రజా మంటలు)స్థానిక నారాయణ దాసు ఆశ్రమంలో వేముల రాంరెడ్డి ఆధ్వర్యంలో భగవద్ గీత శిక్షణ తరగతులు ప్రారంభ మయ్యాయి. గురువారం నుండీ 10రోజుల పాటు సాయంత్రం 6గంటల నుండి 7గంటల వరకు రోజు గంట పాటు ఈ శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. సామాజిక కార్యకర్త తవుటు రాంచంద్రం ,...
Read More...
Local News 

గాంధీ ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తుల మృతి

గాంధీ ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తుల మృతి సికింద్రాబాద్, జూలై 11 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయారు. ఓపి బ్లాక్ ఎదురుగా 45-50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి,  NTPC హాల్లో 55-60 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీ లు లభించాయి. అలాగే మెడికల్ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్న 65 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి...
Read More...
Local News 

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు గురు పౌర్ణమి సందర్బంగా భక్తుల రద్దీ సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని శ్రీసాయి కుమార్ వ్యాధి నివారణ  ఆశ్రమ్ లోని శ్రీసాయిబాబా ఆలయంలో గత వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీసాయి సప్తాహ వేడుకలు గురువారం తో ముగిశాయి. చివరి రోజున ఉదయం శ్రీసాయి కుంభాభిషేకం,శ్రీసాయి విభూతి సేవ,సాయంత్రం మహామృత్యుంజయ హోమం...
Read More...

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు జూలై 10, ఎల్కతుర్తి (ప్రజామంటలు) :ఎల్కతుర్తి మండలంలోని జీల్గుల గ్రామానికి చెందిన పెద్ది సౌందర్య, బండి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి  గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ...
Read More...
Local News 

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు సికింద్రాబాద్ జులై 10 (ప్రజామంటలు): కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తున్న హిందీ అధికారిక భాషా విభాగం 50ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో  గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక భాషా విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ మీనాక్షీ జాలీ తెలిపారు.ఈ మేరకు  సికింద్రాబాద్ కవాడీగూడలోని సీజీఓ టవర్స్లో  ఆమె శుక్రవారం మీడియాకు...
Read More...
Local News 

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసిన టీమ్ విమలాకర్ సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు): కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేట్‌లో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి  నేతృత్వంలోని టీమ్ విమలాకర్ కేవలం మూడు నెలల వ్యవధిలో 50 మేజర్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ అధునాతన శస్త్రచికిత్సల్లో ప్యాంక్రియాస్, కాలేయం, బైలరీ ట్రాక్ట్,...
Read More...
Local News 

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి సికింద్రాబాద్, జూలై 10 (ప్రజామంటలు) : ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తూనే మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ జన్మదిన వేడుకల సందర్బంగా గురువారం టీఎన్జీవో నాయకులు గాంధీ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ...
Read More...
Local News 

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత బాలికల ఆరోగ్యానికి సంబంధించి పెద్ద సమస్య రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం  - ఐఎం ఏ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్  -ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి   గొల్లపల్లి జూలై 10 (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండల కేంద్రంలోని గురువారం  బాలికల ఉన్నత పాఠశాలలో ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో అనీమియా ముక్త్...
Read More...
Local News  State News 

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మహిళలు వస్తాం... ఇచ్చిన హామీలపై చర్చిద్దాం ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  లేఖ తెలంగాణ జాగృతిలో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఐటీయూ కార్యదర్శి వీరన్న కొత్తగూడెం జూలై 10:    "పదే పదే కేసీఆర్ మహిళలకు...
Read More...
Local News 

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం' దేవాలయ ఏకీకరణ దేవాలయ రక్షణ (అంకం భూమయ్య) మల్యాల జులై 10 (ప్రజా మంటలు):    మల్యాల మండలం కొండగట్టులో గురుపూర్ణిమ వ్యాస పూర్ణిమ గురువారం రోజున తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో 30. వ గిరి ప్రదక్షిణ చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ...
Read More...
Local News 

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి 

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి  గొల్లపల్లి జూలై 10 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో  ట్రాక్టర్లు ఇనుప కేజీ వీలతో రోడ్డు పై తిరిగినచో కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ ఎం, కృష్ణ సాగర్ రెడ్డి హెచ్చరించారు ఎస్ఐ మాట్లాడుతూ కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లపై ట్రాక్టర్ కేజీ వీల్స్ తో తిరగడం వల్ల బీటీ...
Read More...