అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్
అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్
- సందీప్ రావు అయిల్నేని
కష్టజీవి కన్నీళ్ళే ఆయన కలానికి సిరా చుక్కలు..
తను రాసిన కవితలు మర ఫిరంగులు..
అక్షర తూటాలతో అగ్గి పుట్టించినా..
అతి తక్కువ పదాలతో ఆకాశమంత భావ వ్యక్తీకరణ చేసినా..
అది తనకే చెల్లింది.
సామాజిక రుగ్మతలపై ఆయన ప్రతి కవితా విప్లవ బాణాలు సంధించింది.రాణించారు.
సృజనాత్మకంగా, అతి తక్కువ పదాలతో ప్రజలకు అర్థం అయ్యేలా కవితలు రాయడం అలిశెట్టి ప్రత్యేకత. పేదరికం, బాధకు, కన్నీళ్లను తన కవితా వస్తువులుగా మలుచుకున్నారు. పాఠకుల్లో ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కవిత్వాన్ని అస్త్రంగా సంధించారు.
ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్త లేఖ, సిటీ లైఫ్ వంటి కవితా సంకలనాలు అలిశెట్టి వెలువరించారు. చిత్రకారుడిగా, ఫోటోగ్రాఫర్ గా, కవిగా తనదైన ముద్ర వేసుకున్నారు.
అలిశెట్టి కవితల్లో మచ్చుకు కొన్ని:
ఆకాశమంత ఆకలిలో అన్నం మెతుకంత చందమామ - కంటికీ ఆనదు కడుపూ నింపదు
మరణం నా చివరి చరణం కాదు
అత్యధికంగా అత్యద్భుతంగా అస్తి పంజరాలను చెక్కే ఉలి - ఆకలి
గడియారం పెట్టుకున్న ప్రతి వాడూ - పరిగెడుతున్న కాలాన్ని పట్టుకోలేడు..
అలిశెట్టి ఏ కవిత రాసినా అందులో నిజానిజాలు గోచరిస్తాయి. కవిత్వాన్నే శ్వాసగా, ఆశగా చేసుకుని ఆయన బతికారు. ప్రజలను ఆలోచనా దృక్పథంలో మార్పు తీసుకురాగలిగారు. కవిత్వానికే తన జీవితాన్ని అంకితం చేశారు.
చివరకు ఆ అక్షర యోధుడిని క్షయ వ్యాధి కబళించింది. అప్పుడు కూడా డబ్బు మనిషిలా నువ్వు జబ్బు మనిషిగా నేను - అందుకే నువ్వెప్పుడూ డాక్టరువి నేనెప్పుడూ పేషంటుని అని మినీ కవితలు రాస్తూ 1993 జనవరి 12న తుది శ్వాస విడిచారు. అలిశెట్టి జయంతి, వర్ధంతి ఒకే రోజు కావడం యాదృచ్చికం. భౌతికంగా అలిశెట్టి మన మధ్య లేకపోయినప్పటికీ కవితల రూపంలో ఆ అక్షర సూర్యుడు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలి..... సిఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతు ఐక్యవేదిక విజ్ఞప్తి

కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్
