అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జనవరి 07:
ధర్మపురి దేవస్థానంలో ఈనెల 10న శుక్ర వారం నిర్వహించనున్న ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి ఉత్సవాన్ని భక్తు లకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా, అపశృతులు లేకుండా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి నిలపాలని, అందుకు సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం అత్యవసరమని రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. దేవస్థానంలో ముక్కోటి ఉత్సవ సంద ర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆయన మంగళ వారం పర్యవేక్షించారు. ఉత్సవ పూర్వాపరాల తెలుసుకుని, చేస్తున్న ఏర్పాట్ల గురించి విప్ సమీక్షించారు. దేవాలయంలో చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించి, అన్నదాన మరియు దర్శన టికెట్ల కౌంటర్లను ప్రారంభించారు . భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటిక పుడు సమీక్షించుకుని, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందని, లక్షమంది భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినం సంద gvర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నామని, దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, గతంలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటిని సమీక్షించుకుంటూ తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వేద పండితులు,అర్చకుల సూచనల మేరకు, సమయ పాలనకు అనుగుణంగా వైకుంఠ ద్వారాలను తెరవాలని సూచించారు.
విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, స్థానిక తహశీల్దార్ శ్రీ కృష్ణచైతన్య, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, స్థానిక సి.ఐ. రామ నర్సింహరెడ్డి, ఎస్.ఐ. ఉదయ్ కుమార్, విద్యుత్ శాఖ సహాయక ఇంజనీయర్ రవి, దేవస్థాన వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ఉపప్రధాన అర్చకులు నేరళ్ల శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ డి.కిరణ్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఎ.శ్రీనివాస్ పాల్గోన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
.jpg)
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్
