సకల వేదాంత సారం భాగవతం - ప్రముఖ పండితులు శంకర శర్మ
సకల వేదాంత సారం భాగవతం
- ప్రముఖ పండితులు శంకర శర్మ
రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494
"సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే, తద్రసామృత తృప్తస్య నాస్యత్ర స్యాద్రతి క్వచిత్", శ్రీమత్ మహాభాగవతం..."సకల వేదాంత సారం. భాగవత రసామృ తాన్ని పానం చేసిన వారికి మరే ఇత రములు రుచించవు. భాగవతం పురాణాలలో ముఖ్య స్థానాన్ని సంతరించుకుందని ఉద్ఘాటించారు ధర్మపురి క్షేత్రస్థ ప్రాచ్య డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, భగవత్ సేవా పరాయణులు పెండ్యాల శంకర శర్మ.
ప్రాచీన ఆర్ష విజ్ఞా నానికి, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మయై, వేద వేదాంగ శాస్త్రాగమ, సకల కళలకు,
సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమై, పుణ్యభూమిగా వెలుగొందుతున్న భారతావనికి చరిత్రకు అందనంత పూర్వమైన, ఉజ్వల సాంస్కృతిక, వైదిక, తాత్త్విక, పౌరా ణిక, ఐతిహాసిక, చారిత్రక వారసత్వం కలిగిన ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శేషప్ప కళా వేదిక పై అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థ
(అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం)
ఆధ్వర్యంలో మంగళ వారం
నిర్వహించిన భాగవత వ్యాఖ్యాన యుక్త 18 గ్రంథాల సెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు పెండ్యాల శంకర శర్మ ప్రధాన ప్రాసంగికునిగా భాగవతాన్ని గురించి వివరిస్తూ...
భగవంతుని, భగవద్భక్తుల కథలు గాను, భక్తి యోగాన్ని చాటి చెపుతున్న ప్రాచీన గాధ. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తిలతో కూడుకున్నదే భాగవతం అని వివరించారు.
భాగవతంలో వివిధ భాగాలను స్కంధాలు అంటారని వివిధ స్కంధాలలో విష్ణువు అవతారాలు, కార్యాలు, భక్తుల గాధలు, తత్వ బోధనలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక సంబంధ సంవాదాలు, భగవంతుని లీలలు, సవివర వర్ణనలతో ఉన్నాయని వివరించారు. ఇలాంటి భాగవత గొప్పతనాన్ని హిందూ బంధువులకు తెలియచేసి, అధ్యయనం, పారాయణ కోసం వ్యాఖ్యానం తో కూడి ప్రచురించి వితరణ చేస్తున్న ఇస్కాన్ సంస్థ సేవలను అభినందించారు.
ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కవి, పండితులు, వ్యాఖ్యాత పెండ్యాల మహేందర్ శర్మ తన సుదీర్ఘ ప్రసంగంలో అపర శుక మహర్షి గుండి రాజన్న శాస్త్రి గురించి వివరించారు. భాగవతాన్ని పూర్వం పరీక్షిత్తుకు శ్రీశుక యోగీశ్వరుడు వివరించిన నేపథ్యం ఆధారంగా గుండి రాజన్న శాస్త్రి నిత్యం ప్రవచించడం, సాంప్రదాయాచరణాసక్తులైన భక్తులు క్రమం తప్పకుండా శ్రవణం గావించడంనేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ప్రవీణ్ ప్రభు, ఇషావతార దాస్, మాధవ గోపీనాథ్ దాస్, కె వి సుబ్బారావు, రంగతీర్త దాస్ పాల్గొని తమ సంస్థ స్థాపన నిర్వహణా ఉద్దేశాలను వివరించారు. గచ్చిబౌలి భక్తి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో
..పెండ్యాల శంకర శర్మ, మహేందర్, బొజ్జా రమేశ్, రాజేశ్, నర్సయ్య పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు. 50మంది పండితులను సంస్థ పక్షాన సన్మానించి, భాగవతం గ్రంథాలను అందజేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన
ముంబై నవంబర్ 23:
భారత్–సౌతాఫ్రికా మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును BCCI ప్రకటించింది. ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.
గాయంతో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.
భారత్ జట్టు ఇలా ఉంది :
బ్యాట్స్‌మెన్: రోహిత్ శర్మ, యశస్వి... వనపర్తిలో మాతా–శిశు సంరక్షణ కేంద్రం సందర్శించిన కవిత
వనపర్తి నవంబర్ 23 (ప్రజా మంటలు):
వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా–శిశు సంరక్షణ కేంద్రం మరియు ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. జాగృతి "జనంబాట" కార్యక్రమంలో భాగంగా కొత్తకోట ప్రాంతంలో చేనేత కార్మికులతో కూడా ఆమె మాట్లాడి చీరలు, వస్త్రాల నేయడం గురించి వివరాలు తెలుసుకున్నారు.
సందర్శన తర్వాత కవిత... జగిత్యాలలో కొత్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అభినందనలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 23 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన నందన్నను ఘనంగా సత్కరించే కార్యక్రమం ఇందిరా భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్... జగిత్యాలలో సత్య సాయి బాబా శతవత్సర వేడుకలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 23 (ప్రజా మంటలు):శ్రీ భగవాన్ సత్య సాయి బాబా వారి శతవత్సర వేడుకలు జగిత్యాల సత్యసాయి మందిరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సత్య సాయి బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తరువాత, సత్య సాయి సేవా సమితి... జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం
జగిత్యాల (రూరల్ ) నవంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (DRDA) మరియు సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ,... చిన్నారుల హక్కులపై అవగాహన కల్పించాలి
రాంగోపాల్ పేట లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) :
అప్స స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, సర్వ్ నీడీ సహకారంతో రాంగోపాల్‌పేట డివిజన్లోని యూత్ హాస్టల్లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. అప్స సంస్థ పని చేస్తున్న 30 బస్తీలలోని బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్... తెలంగాణ ప్రజల హృదయంలో సర్దార్ పటేల్ కు శాశ్వత స్థానం
సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) :
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్బంగా సికింద్రాబాద్‌లో ఆదివారం సర్ధార్ 150 యూనిటీ మార్చ్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సీతాఫల్మండి శివాజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ, చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్... రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు వెల్లుల్ల విద్యార్థి ఎంపిక
మెట్టుపల్లి నవంబర్ 23(ప్రజ మంటలు దగ్గుల అశోక్)
మెట్టుపల్లి పట్టణ పరిధిలోని వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఖో ఖో పోటీలకు *నల్ల నవీన్*అండర్-17 బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఆదివారం నుండి మూడు రోజుల పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటిల్లో ఆడనున్నట్టు సర్కారు పెద్దలు...! ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి
సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్‌లోని పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 289వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాహనంలో నగరంలోని ఫుట్‌పాత్‌లు, సంచారజాతుల ప్రాంతాలను సందర్శించి నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేశారు. ప్రభుత్వం స్పందించి ఫుట్‌పాత్ పై నివాసం ఉంటున్న వారికి ఉపాధి ఇచ్చి శాశ్వత ఆవాసం కల్పించాలని... యశోద హైటెక్ సిటీలో AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్
హైదరాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు):
యశోద హాస్పిటల్స్–హైటెక్ సిటీలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు అత్యాధునిక AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్‌ను యశోద మేనేజింగ్ డైరెక్టర్ డా. జి.ఎస్.రావు ప్రారంభించారు. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించబడటం వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు.
సీనియర్ పల్మోనాలజిస్ట్ డా. నాగార్జున మాటూరు మాట్లాడుతూ...... జాఫ్రీ ఎప్స్టిన్ ఫైళ్లలో మోదీ, మరో మంత్రి :: దేశాన్ని. కుదిపేస్తున్న వార్త
"Modi on board" అనే మాట ఎం చెబుతుంది ?
ఇప్పుడొచ్చిన తాజా ఎపిస్టిన్ ఫైళ్లు (“Epstein Files”)లో భారతీయ రాజకీయ, వ్యాపార వర్గాలకి చెందిన కొన్ని ప్రముఖులతో గది చోటు పొందిన ఫైళ్లు వెళ్లదీయబడ్డాయి. ఈ విషయంపై లోతైన పరిశోధన ఇది ఎవరిని దోషుల గానో, బాధ్యులుగానో చెప్పడానికి కాదు.రాజకీయ,వ్యాపార సంబంధాలు ఎలా... ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటారు..? *కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజేశ్వరి విమర్శలు
సికింద్రాబాద్, నవంబర్ 23 ( ప్రజా మంటలు):
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖంతో విజయోత్సవాలు జరుపుకుంటోంది, ఎలాంటి నెరవేర్చని హామీలతో ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మల్లేశ్వరపు రాజేశ్వరి ప్రశ్నించారు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు మినహా ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు కాలేదని ఆమె విమర్శించారు.... 