ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం
పెద్దపల్లిలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ సభ
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం - రేవంత్ రెడ్డి
ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ సభ
పెద్దపల్లి డిసెంబర్ 04:
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం, రైతాంగానికి అండగా నిలవడం, మహిళలను ప్రగతి పథంలో నడిపించడమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.
సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా వివరించారు.
ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క,శ్రీధర్ బాబుతో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
🔹 ఈ వేదికగా.. TGPSC ద్వారా గ్రూప్ IV కేటగిరీ కింద కొత్తగా ఎంపికైన 8,084 మందికి, సింగరేణి సంస్థలో నియమితులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను లాంఛనంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించారు. పెద్దపల్లి జిల్లాలో దాదాపు 1035 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు.
🔹 SkillsUniversity తో కలిసి పని చేయడానికి సంబంధించి 7 ఏజెన్సీలతో ఇదే వేదికగా ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. అలాగే, అత్యంత కీలకమైన Digital Employment Exchange of Telangana (DEET) ఏర్పాటును ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే CM’s Cup -2024 ట్రోఫీని ఆవిష్కరించారు.
🔹 అనంతరం సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. గడిచిన పదేండ్లలో అభివృద్ధికి నోచుకోని ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళా సంఘాల్లో 67 లక్షల మంది ఉండగా, కోటి మందిని చేర్చి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.
🔹 తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి సాధన కోసం జరిగిన నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే శాఖల వారిగా మొత్తం 55,143 ఉద్యోగ నియామకాలు చేసి దేశంలోనే తెలంగాణ రికార్డు నెలకొల్పిన విషయాన్ని వివరించారు.
🔹 ప్రభుత్వ ఫలాలు సక్రమంగా అందాలని, బీసీలకు సరైన వాటా దక్కాలన్న ఉద్దేశంతోనే కులగణన చేపట్టినట్టు తెలిపారు.
🔹 నిరుపేదల బిడ్డల చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే పదేళ్లుగా పెంచని డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని గుర్తుచేశారు.
🔹 కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీకి ఒక ఇంజనీరింగ్, ఒక లా కాలేజీ మంజూరు చేస్తామని చెప్పారు.
🔹 పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు సాధించడం ప్రజా విజయంగా అభివర్ణించారు.
🔹 కాళేశ్వరం నుంచి చుక్కనీరు వినియోగించకుండా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి చరిత్ర రికార్డు సాధించాం. ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం.
🔹 గత ప్రభుత్వం చెల్లించని రైతు బంధు 7500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశాం. తొలి సంవత్సరంలో 21 వేల కోట్లతో 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర సృష్టించాం.
🔹 నిర్భందాల మధ్య సాగిన పదేండ్ల పాలన నుంచి స్వేచ్ఛ కల్పించామని పలు సందర్భాలు, సంఘటనలను ఉదహరించారు.
🔹 ఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి గారు వివరించారు.
కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ గడ్డం వంశీ గారు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ గారు, స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన గౌరవ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇటిక్యాల గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలి – జీవన్‌రెడ్డి
జగిత్యాల రూరల్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
ఇందిరా భవన్‌లో ఇటిక్యాల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయడం ఇటిక్యాల... అంగరంగ వైభవంగా కలియుగ దైవం కల్యాణ వేడుకలు
జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో గల శ్రీ శ్రీనివాసాంజనేయ భవాని శంకర దేవాలయంలో శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ వేడుకలు మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణాన్ని కొనసాగించారు భక్తులు... బీర్పూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు ఏకగ్రీవం_అధ్యక్షులుగా తుంగూరు సర్పంచ్ రాజగోపాల్ రావు
*
బీర్పూర్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు)మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు గా తుంగూర్ గ్రామ సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావు ని ఏకగ్రీవంగా ఏనుకున్న బీర్పూర్ మండల సర్పంచులు,
ప్రధాన కార్యదర్శి గా ఎల్లమట్ల హరీష్ (బీర్పూర్ సర్పంచ్ ), ఉపాధ్యక్షులు 1 గా బోడ సాగర్ (రంగసాగర్ సర్పంచ్ ),... జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)పండుగలు, ఎన్నికలు, జాతరలు ప్రశాంతంగా – అవాంఛనీయ సంఘటన లేకుండా ముగిసిన ఏడాది*
*మహిళలు, చిన్నారుల భద్రతే ప్రథమ లక్ష్యం,– డ్రగ్స్ పై జీరో టాలరెన్స్ విధానం అమలు*
*‘సురక్షిత ప్రయాణం’తో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చర్యలు
జిల్లాలో గత సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ... యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న
జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు 100 ఫీట్ల విస్తరణ జాప్యానికి స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన కారణమని మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మున్సిపల్ తీర్మానాన్ని తుంగలో... పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరకృఢత్వం మానసిక ఆరోగ్య ము అత్యంత అవసరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)
పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామశాల (జిమ్)ను మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. పోలీస్ సిబ్బంది రోజువారీ... పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 23( ప్రజా మంటలు దగ్గుల అశోక్)
ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని పుష్కర ఘాట్ల అభివృద్ధి కొరకు కావలసిన పనులను పర్యవేక్షించిన గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, జగిత్యాల మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ హైదరాబాద్ వారి కార్యాలయ అధికారులు మరియు ఇబ్రహీంపట్నం తాసిల్దార్, ఎంపీడీవో ఇతర మండల అధికారులు.... మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌పై ACB సోదాలు
మహబూబ్‌నగర్, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (Dy Commissioner) రవాణా శాఖాధికారి కిషన్ నాయక్ పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అధికార ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి ఈ దాడులు చేపట్టినట్లు... కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్
కోరుట్ల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో డాక్టర్ సాయికుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సాయికుమార్ నేడు కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జువ్వాడి నర్సింగరావు గారు “డాక్టర్ సాయికుమార్... ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు
అమరావతి డిసెంబర్ 23(ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టి పలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను, ఉద్యోగుల నివాసాలను తనిఖీ చేశారు.
విజయనగరం జిల్లా భోగాపురం సబ్‌రిజిస్ట్రార్ రామకృష్ణతో పాటు ఆయన సహ ఉద్యోగులు, మరో ప్రైవేట్... కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ
కోచి, కేరళ డిసెంబర్ 23 (ప్రత్యేక కథనం):
కోచిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అనంతరం ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తికి ఓ డాక్టర్ చేసిన అత్యవసర చికిత్స అక్షరాలా ప్రాణాలను నిలిపింది. శ్వాస తీసుకోలేక తంటాలు పడుతూ, మరణం అంచున ఉన్న ఆ వ్యక్తికి డాక్టర్ రోడ్డుపైనే తక్షణ శస్త్రచికిత్స చేసి... 