సైబర్ మోసాల,ట్రాఫిక్ నియమాలపై, విద్యార్థులకు అవగాహన సదస్సు
సైబర్ మోసాల,ట్రాఫిక్ నియమాలపై, విద్యార్థులకు అవగాహన సదస్సు
గొల్లపల్లి డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి మండల లోని చిల్వకోడూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థులకు షీ టీం, కళాబృందం లతో ట్రాఫిక్ నియమాలు, గంజాయి వల్ల కలిగే అనర్ధాలు, సైబర్ మోసాల, నూతన చట్టాలు గురించి గొల్లపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్.సతీష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ సిహెచ్ సతీష్, మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యం గా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఫొటో లు, వీడియోలు పోస్టుచేసే ముందు వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసు కోవాలని సూచించారు. విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ నియమాలు తెలిసినప్పుడే రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించగలుగుతామని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయని వీటిపై అవగాహన కలిగి వుండాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీబాయి హెడ్ కానిస్టేబుల్ తుమ్మ గణేష్ ,చంద్రయ్య పోలీసు సిబ్బంది, షీ టీమ్, కళాబృందం సభ్యులు విద్యార్థిని విద్యార్ధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన
హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి దావ వసంత సురేష్
జగిత్యాల జులై 23( ప్రజా మంటలు) పట్టణం 37 ,38 వార్డ్ లో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పరిశీలించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
ప్రజాస్వామ్య విలువలను... తమిళనాడు లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరు మార్పు
చెన్నై, జూలై 22: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ పేరును 'తలైవార్ కామరాజర్ అల్పాహార పథకం’గా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ... NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం: ఎం.కె. స్టాలిన్
:చెన్నై ,జులై 22:
“న్యాయం, NEET రెండూ కలసి ఉండలేవు. NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం” అని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ అన్నారు.తమిళనాడులో బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు NEETను వ్యతిరేకిస్తున్నాయని ఆయన తెలిపారు. NEET నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ పలుమార్లు... ప్రైవేట్ పాఠశాలలను వేధిస్తే కఠిన చర్యలు: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి
హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు ):
బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధుల బృందం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్‌ను కలిసి, ప్రైవేట్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని కొందరు అనధికార వ్యక్తులు బ్లాక్మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలపై వెంటనే చర్యలుప్రతినిధుల... ఢిల్లీ విద్యార్థులపై దాడికి బీజేపీ సమాధానం చెప్పాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ జులై 22 (ప్రజా మంటలు):
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. “బ్రిటీష్ జాహిల్ పార్టీ” అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటని ఆమె అన్నారు. ఈ... సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు రోడ్డు భద్రత చర్యలు పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జులై 22 (ప్రజా మంటలు)
ప్రతి 15 రోజులకు రవాణా, పోలీసు, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్ష
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసి, అవసరమైన అన్ని చర్యలను 60 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రత కమిటీ చైర్ పర్సన్ బి. సత్యప్రసాద్... రజక సంఘం ఆధ్వర్యంలో వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర
జగిత్యాల జూలై 22 (ప్రజా మంటలు)
రజక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర బుధవారం మధ్యాహ్నం గంటలకు ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా జగిత్యాల రజక సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాసం కావడంతో ప్రతి ఏటా నిర్వహించే వీరమ్మ బోనాల పండుగ సందర్భంగా మడలేశ్వర స్వామి వారి భారీ విగ్రహం... ఉద్యమకారుల గుర్తింపులో ఆలస్యం వద్దు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్, కల్వకుంట్ల కవిత తన సూచనలు, సలహాలతో కూడిన నివేదికను అందజేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయవద్దని ఆమె కమిటీని కోరారు.తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం... ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రజలు మీ ప్రభుత్వాన్ని పడగొడతరుప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొడతాంగ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నరు
హైదరాబాద్, జూలై 20 (ప్రజా మంటలు):
ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర... శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని మహాశివునికి జల అభిషేకం
జగిత్యాల జులై 20 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మహా శివునికి భక్తుల స్వహస్తాలతో రుద్ర నమక చమకాలతో అభిషేకాలు నిర్వహించారు
ఈ సందర్భంగా ఆలయంలోని మహాశివునికి ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించి మహా శివునికి సమృద్ధిగా వర్షాలు... సంసార సముద్రం నుండి రక్షించడానికి పరమాత్మ అవతరించాడు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి
జగిత్యాల జూలై 19(ప్రజా మంటలు) సంసారం అనే సముద్రము నుండి మనను రక్షించడానికి పరమాత్మ అవతరించాడని ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరమహంస పరివ్రా జకాచార్యులు శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ శ్రీ శ్రీ త్రీదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.
జిల్లా కేంద్రంలోని... 