ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
జగిత్యాల నవంబర్ 4 (ప్రజా మంటలు) :
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డితో కలసి కలెక్టర్ స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..... సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 22 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, ఆర్డీఓ లు మధు సుధన్, శ్రీనివాస్, జివాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంత రావు, వివిధ జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
