బీసీ నాయకుల చే బీసీ కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
కరీంనగర్ నవంబర్ 1 (ప్రజా మంటలు) :
తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ కి మెమోరాండం అఫిడవిట్ సమర్పించిన జగిత్యాల జిల్లా బీసీ నాయకులు...
విషయం: తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు గత 76 సంవత్సరాలుగా వెనుకబడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బి సి లకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బి సి లకు ఇస్తున్న పథకాలకు చట్టబద్ధత కల్పించాలని విన్నపం.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...... తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీల వారితో పోల్చుకుంటే 76 సంవత్సరాలనుండి అన్యాయం జరుగుతున్నది.
ప్రధానంగా గత పది సంవత్సరాల కాలంలో బి సి- ఎం బి సి కార్పొరేషన్ లు ఏర్పాటు చేసినప్పటికీ అమలు విషయానికి వస్తే చాలా అన్యాయం జరుగుతుంది.
బి సి- ఎం బి సి లను బాగుపరుస్తామని చెప్పిన గత ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వకపోవడం తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన కులవృత్తుల వారు నానా ఇబ్బందులకు గురైనారు.
బి సి ల బతుకు దుర్భరంగా మారాయి. కుల వృత్తులకు ఆదరణ కరువైంది. ఇప్పటికైనా మేం ప్రతిపాదిస్తున్న ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి అమలుకు తగు చట్ట పరిధిలో చర్యలు చేపట్టడం ఆదేశించగలరని మా యొక్క అభ్యర్థన.
- తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి చట్టబద్ధత చేయాలి.
- రాష్ట్రంలోని కులవృత్తుల వారికి బి సి కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలి.
- బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో 42% రిజర్వేషన్ కల్పించాలి.
- రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణనను చేపట్టి చట్టబద్ధత కల్పించాలి.
- పార్టీలకు అతీతంగా ఆయా పార్టీలలో పనిచేస్తున్న బి సి నాయకులకు తప్పకుండా వారికి 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు అవకాశం ఇవ్వాలి.
- తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 66% బి సి లము "మేమెంతో మాకంతవాటా" అనే నినాదం అమలు చేయాలి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, నియోజకవర్గ అధ్యక్షురాలు బిసి సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు గుంటి గంగారాం, బిసి సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు నులుగొండ సురేష్, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.3855.02 కోట్ల వ్యాపారానికి చేరుకున్న గాయత్రి బ్యాంకు : కొడిమ్యాలలో 68వ శాఖ ప్రారంభం
జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్నది. గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. కొడిమ్యాల మండల కేంద్రంలో బ్యాంకు 68వ శాఖను జగిత్యాల జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ బి. సత్యప్రసాద్ ఐఏఎస్ చేతుల మీదుగా సోమవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా... కస్టడీ మృతిపై తీవ్ర ఆరోపణలు: విచారణకు ఆదేశించిన TGHRC
హైదరాబాద్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
కర్లా రాజేష్ కస్టడీ మృతికి సంబంధించి వచ్చిన తీవ్ర ఆరోపణలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) పరిగణనలోకి తీసుకుంది. SR నెం.4129, 4130 ఆఫ్ 2025 కేసుల్లో అక్రమ నిర్బంధం, కస్టడీలో చిత్రహింసలు, తప్పుడు కేసు నమోదు వల్లే రాజేష్ మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయని కమిషన్... ప్రజా సమస్యలను పట్టించుకొని కేసీఆర్ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు
కరీంనగర్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
కరీంనగర్ ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుడ ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుతూ కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని తెలిపారు. మాజీ సీఎం... ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చొరవ చూపాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు)
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి... జగిత్యాలలో నూతన సర్పంచులకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
జగిత్యాల, డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గంలోని లక్ష్మిపూర్, నర్సింగపూర్, చల్గల్, దరూర్, సింగారవుపేట్, అల్లిపూర్, ఉప్పమడుగు, అయోధ్య, మహితపూర్ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాలతో తనకు... సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్: అభినందించి రివార్డ్ అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి స్పృహ కోల్పోగా,
అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్ చంద్రశేఖర్ ను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శాలువతో సన్మానించి రివార్డును... గద్వాల్ జిల్లాలో అక్షరాస్యత, రోడ్లు, సాగునీటి వైఫల్యాలపై కవిత తీవ్ర విమర్శలు
గద్వాల్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
జోగులాంబ గద్వాల్ జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, నిర్వాసితుల సమస్యలు, రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు.
రాజకీయ మార్పే పరిష్కారం
“70 ఏళ్లుగా... యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:?
జగిత్యాల / హైదరాబాద్ డిసెంబర్ 22 ప్రజా మంటలు:
జగిత్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సందర్భంగా యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతా అని ఎమ్మెల్యే... TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సౌజన్యంతో కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం, అదనపు క్లాస్రూమ్స్ను ప్రారంభించారు. టిడిఎఫ్–మన తెలంగాణ బడి ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అందించిన ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి.... గద్వాల జిల్లా ప్రజల సమస్యలపై కవిత ఘాటు ప్రశ్నలు
జోగులాంబ గద్వాల జిల్లా డిసెంబర్ 21(ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గద్వాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బీచుపల్లి బ్రిడ్జి వద్ద జాగృతి నాయకులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీచుపల్లి... తిమ్మాపూర్ జడ్పీ హైస్కూల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ధర్మపురి డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాధవరం కృష్ణారావు – ఆండాళ్ దేవి ల జ్ఞాపకార్థం వారి కుమారుడు మాధవరం విష్ణు ప్రకాశరావు (అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు) ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో... 