చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం కోసం తల్లితండ్రుల ఎదురుచూపు..

దాతలు ఆదుకోవాలని విన్నపం

On
చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం కోసం తల్లితండ్రుల ఎదురుచూపు..

చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం కోసం తల్లితండ్రుల ఎదురుచూపు...

గొల్లపల్లి అక్టోబర్ 17 (ప్రజా మంటలు) :

తమ చిన్నారి వైద్యానికి ఆర్థిక సహాయం చేసి, ప్రాణాలను  కాపాడండి అని తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు. గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన కంచెర్ల సంతోష్ -వర్షిణి దంపతులకు ఐదు నెలల క్రితం బాబు జన్మించాడు.బాబుకి ఈ మధ్య తీవ్రమైన జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా జ్వరం మెదడుకి ఎక్కిందని వెంటనే చికిత్స చేయకుంటే ప్రాణాలకే ప్రమాదామని అన్నారు. ఇప్పటికే చాలా ఖర్చు చేసిన వారు బాబు వైద్యానికి రోజుకి 50 వేల రూపాయల  ఖర్చవుతుందని  వైద్యులు తెలిపారు.

కూలి నాలి చేసుకొని జీవించే వారు అంత ఖర్చుపెట్టలేక తమ బాబుని బతికించుకునేందుకు ఆ తల్లి తండ్రుల పడే బాధ అంతా ఇంతా కాదు . ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో తమ చిన్నారిని బ్రతికించుకొనేందుకు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయం చేయాల్సిన వారు 9505043919 నంబర్‌లో సంప్రదించి తమ బిడ్డ ప్రాణాన్ని కాపాడాలని బాబు తండి సంతోష్ వేడుకుంటున్నారు.

----------------

Tags