బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం
ఈ నెల 3న "లోకాయుక్త" లో విచారణ
ఈ నెల 3న "లోకాయుక్త" లో విచారణ
బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం
లోకాయుక్త కు కూడా తప్పుడు నివేదికలు అందజేసిన జిల్లా ఉన్నతాధికారులు
బుగ్గారం/ జగిత్యాల అక్టోబర్ 01::
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో జరిగిన "అధికారుల నిర్లక్ష్యం" పై ఈ నెల 3న లోకాయుక్త లో విచారణ జరుగనుంది. ఈ మేరకు లోకాయుక్త రిజిస్ట్రార్ జారీ చేసిన నోటీసులు పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి కి అందాయి. మంగళ వారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులు బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం పై లోకాయుక్త కు కూడా తప్పుడు సమాచారంతో కూడిన నివేదికలు అందజేశారని
ఆరోపించారు.
లోకాయుక్త సూచనల మేరకు అట్టి నివేదికలపై అభ్యంతరాలను ఈ నెల 3న లోకాయుక్త రిజిస్ట్రార్ కు అందజేయనున్నట్లు ఆయన వివరించారు.
2020 నుండి నేటి వరకు జిల్లా, డివిజనల్, మండల పంచాయతీ అధికారులు సాగదీస్తూ చట్టపరంగా సరైన చర్యలు చేపట్టలేదన్నారు. అవినీతి - అక్రమాలకు పాల్పడ్డ
అధికారుల్లో పెరిగిపోయిన నిర్లక్ష్యం వల్లే బుగ్గారం జి.పి.లో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని చుక్క గంగారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు లోకాయుక్త ఆదేశాలను కూడా సక్రమంగా పాటించకుండా తప్పుడు సమాచారంతో కూడిన నివేదికలు అందజేయడం వారి అవినీతికి నిలువెత్తు అద్దం పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఆదేశించి జారీ చేసిన 18 ఆర్డర్లకు కూడా జిల్లా పంచాయతీ అధికారులు సమాచారం ఇవ్వకపోవడం శోషణీయం అన్నారు. అనేక సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జారీ చేయబడిన ఆదేశాలను సైతం జిల్లా పంచాయతీ అధికారులు బే - ఖాతర్ చేశారని ఆరోపించారు. విచారణ అధికారులు రాజకీయాలకు, ఇతర ప్రలోభాలకు లోనై సరైన విధంగా విచారణ జరుపలేదన్నారు. అధికారులు జరిపిన విచారణలో కూడా వాస్తవాలను కప్పి పుచ్చి తప్పుడు సమాచారం అందించారని వివరించారు. నిధుల దుర్వినియోగం పై పోరాటం చేస్తున్న తనపై ఎన్నెన్నో కుట్రలు - కుతంత్రాలు జరిగాయన్నారు. తనను అణగ త్రొక్కేందుకు అనేక ప్రయత్నాలతో పాటు భౌతిక దాడులు కూడా చేసి హత్యాయత్నాలు, సుపారి హత్యకు కూడా తీవ్ర ప్రయత్నాలు కొనసాగించారని తెలిపారు. బుగ్గారం జి.పి. నిధుల దుర్వినియోగంలో పూర్తి స్థాయి న్యాయం జరిగేంత వరకు తన న్యాయ పోరాటం ఆపేది లేదని, గ్రామ ప్రజల ఆశీస్సులు, సంపూర్ణ మద్దతు తనకు ఉందని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

ఆవిష్కరణలే ఆర్థికాభివృద్ధికి మూలం - 3గురు ఆర్థికవేత్తలకు నోబుల్

మోడీ పిలుపు మేరకు యు ఎన్ లో ఉద్యోగం వదిలిన ప్రశాంత్ కిషోర్/PK

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)