ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
కొందరు బడా జర్నలిస్టులు అనేక చోట్ల లబ్ధి పొందినట్లుగా ఆరోపణలు
సీఎం రేవంత్ సార్..విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి
(మానసాని కృష్ణరెడ్డి సీనియర్ జర్నలిస్ట్)
జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు.వర్కింగ్ జర్నలిస్టులందరికి ఎలాంటి వివక్షత లేకుండా, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాల్సిందే.వారికి ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే.ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇండ్ల జాగల పట్టాలను ఇవ్వడం అభినందించాల్సిందే.ఇందులో రెండో అంశానికి తావు లేదు.అయితే ఒక జర్నలిస్టుకు ఒకసారి మాత్రమే ఇండ్ల జాగలు ఇవ్వాలి.ఇది సహజ ధర్మం.అయితే ఇప్పటికే కొంతమంది రెండు మూడు ప్రదేశాల్లో ఇండ్ల స్థలాలు తీసుకుని ఇప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలను పొందినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.కొన్ని జిల్లాలో ఇప్పటికే ఇండ్ల జాగలు తీసుకుని లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ ఈ హౌజింగ్ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలు పొందినట్లుగా కొన్ని ఆరోపణలు రావడం మరి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళిందా ? లేక ఆయనకు తెలియకుండానే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు బడా జర్నలిస్టుల ముసుగులో అటు జిల్లాల్లో లబ్ధి పొంది ఇప్పుడు రాజధానిలో కూడా ఇండ్ల జాగలు దక్కించుకున్నట్లుగా గుసగుసలు విన్పిస్తున్నాయి.వీటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరిపితే నిజానిజాలు తేలుతాయని అంటున్నారు.అలాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేసిన జర్నలిస్టుల ఇండ్ల జాగలపైన కూడా వివాదం నెలకొన్నదనే సమాచారం ఉన్నది.ఈ జాగ తమ పట్టా భూమి అని కొందరు న్యాయస్థానాలను తాజాగా ఆశ్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ రాష్ట్ర సీఎం పంపిణీ చేసిన జాగ వివాదాస్పద స్థలం కావడంపైన విస్మయం వ్యక్తమవుతోంది.అదేవిధంగా హైదరాబాద్‌లో ఇండ్ల జాగలు పొందిన జర్నలిస్టుల్లో అధిక శాతం పక్కరాష్ట్ర పాత్రికేయులేననే ప్రచారం కూడా ఉన్నది. ఓ వర్గ లాబీమేరకే ప్రభుత్వం ఈ విషయంలో ముందుపడి కార్యక్రమాన్ని పూర్తి చేసిందని అంటున్నారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకుండా, ఇండ్ల జాగలు పొందకుండా ఉన్నారు.ఎన్నో యేండ్లుగా వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదని,కానీ కొందరు మాత్రం రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు దక్కించుకోగలిగారని ఇదెక్కడి న్యాయం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి నిష్పక్షపాతంగా విచారణ చేపడితే అన్ని వ్యవహరాలు బయటపడతాయాని పలువురు జర్నలిస్టులు అంటున్నారు.మరి నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని జర్నలిస్టు సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.
-------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ
