ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
కొందరు బడా జర్నలిస్టులు అనేక చోట్ల లబ్ధి పొందినట్లుగా ఆరోపణలు
సీఎం రేవంత్ సార్..విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి
(మానసాని కృష్ణరెడ్డి సీనియర్ జర్నలిస్ట్)
జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు.వర్కింగ్ జర్నలిస్టులందరికి ఎలాంటి వివక్షత లేకుండా, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాల్సిందే.వారికి ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే.ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇండ్ల జాగల పట్టాలను ఇవ్వడం అభినందించాల్సిందే.ఇందులో రెండో అంశానికి తావు లేదు.అయితే ఒక జర్నలిస్టుకు ఒకసారి మాత్రమే ఇండ్ల జాగలు ఇవ్వాలి.ఇది సహజ ధర్మం.అయితే ఇప్పటికే కొంతమంది రెండు మూడు ప్రదేశాల్లో ఇండ్ల స్థలాలు తీసుకుని ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలను పొందినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.కొన్ని జిల్లాలో ఇప్పటికే ఇండ్ల జాగలు తీసుకుని లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ ఈ హౌజింగ్ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలు పొందినట్లుగా కొన్ని ఆరోపణలు రావడం మరి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళిందా ? లేక ఆయనకు తెలియకుండానే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు బడా జర్నలిస్టుల ముసుగులో అటు జిల్లాల్లో లబ్ధి పొంది ఇప్పుడు రాజధానిలో కూడా ఇండ్ల జాగలు దక్కించుకున్నట్లుగా గుసగుసలు విన్పిస్తున్నాయి.వీటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరిపితే నిజానిజాలు తేలుతాయని అంటున్నారు.అలాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేసిన జర్నలిస్టుల ఇండ్ల జాగలపైన కూడా వివాదం నెలకొన్నదనే సమాచారం ఉన్నది.ఈ జాగ తమ పట్టా భూమి అని కొందరు న్యాయస్థానాలను తాజాగా ఆశ్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ రాష్ట్ర సీఎం పంపిణీ చేసిన జాగ వివాదాస్పద స్థలం కావడంపైన విస్మయం వ్యక్తమవుతోంది.అదేవిధంగా హైదరాబాద్‌లో ఇండ్ల జాగలు పొందిన జర్నలిస్టుల్లో అధిక శాతం పక్కరాష్ట్ర పాత్రికేయులేననే ప్రచారం కూడా ఉన్నది. ఓ వర్గ లాబీమేరకే ప్రభుత్వం ఈ విషయంలో ముందుపడి కార్యక్రమాన్ని పూర్తి చేసిందని అంటున్నారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకుండా, ఇండ్ల జాగలు పొందకుండా ఉన్నారు.ఎన్నో యేండ్లుగా వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదని,కానీ కొందరు మాత్రం రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు దక్కించుకోగలిగారని ఇదెక్కడి న్యాయం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి నిష్పక్షపాతంగా విచారణ చేపడితే అన్ని వ్యవహరాలు బయటపడతాయాని పలువురు జర్నలిస్టులు అంటున్నారు.మరి నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని జర్నలిస్టు సర్కిల్లో చర్చ నడుస్తోంది.
-------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
మెగా జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ గారి సహకారంతో బ్లూ ఓషన్ కంపెనీ నిర్వహించనున్న మెగా జాబ్ మేళా (మహిళలకు) కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్లో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
10వ తరగతి విద్యార్హత తో ,18 నుండి 35 వయస్సు కలిగి ఉన్న... గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు... ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, రాజ గౌడ్
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, రాజ గౌడ్ అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి అదనపు కలెక్టర్లు స్వీకరించారు
ఈ సందర్భంగా వారు... రెడ్ ఫోర్ట్. వద్ద పేలుడు — భద్రతా వ్యవస్థల వైఫల్యమా?
రెడ్ ఫోర్ట్ వద్ద పేలుడు — భద్రతా వ్యవస్థల వైఫల్యమా? ఉగ్ర హెచ్చరికలకా సూచన?
ఢిల్లీ పేలుళ్లు ఘటనపై ప్రత్యేక విశ్లేషణ
న్యూ ఢిల్లీ నవంబర్ 10 (ప్రత్యేక ప్రతినిధి):
భారత రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ రెడ్ ఫోర్ట్ సమీపంలో చోటుచేసుకున్న పేలుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు రేపుతోంది.ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్రంగా... మహాకాళి టెంపుల్ లో కార్తీక మాస సోమవారం వేడుకలు
మహిళ భక్తులకు వాయినాలు *ఆలయ ఆవరణలో ఆకాశదీపం, హరికథ
సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజామంటలు) :
కార్తీక మాసం సోమవారాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సాయంత్రం ఆకాశదీపం వెలిగించి, మహిళ భక్తులకు వాయినాలు అందచేశారు. కార్తీక మాస... గాంధీ మెడికల్ కాలేజీకి వ్యవసాయ ఉన్నతాధికారి పార్థివ దేహం అప్పగింత
సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజామంటలు) :
వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్(రిటైర్డ్) ఈ. రాఘవరావు (91)వృద్ధాప్య సమస్యలతో ఆదివారం సాయంత్రం అత్తాపూర్ లో కన్నుమూశారు. గతంలో ఆయన చేసిన డిక్లరేషన్ ప్రకారం ఆయన పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం గాంధీ మెడికల్ కాలేజీకి తీసుకువచ్చి, అనాటమీ డిపార్ట్ మెంట్ కు అప్పగించారు.
వైద్య విద్యార్థుల పరిశోధనల... రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలకు ఎంపికైన వెల్లుల్ల విద్యార్ధి
మెట్టుపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు దగ్గర అశోక్):
TSAT Network మరియు TSGHMA సంయుక్తంగా నిర్వహించిన *జగిత్యాల జిల్లా స్థాయి* పోటీల్లో మెటుపల్లి మండలం వెల్లుల్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి *గొర్ల శ్రీచరణ్* ఉపన్యాసం [బాలవక్త] పోటీలో *ప్రథమ స్థానం లో గెలిచి "రాష్ట్ర స్థాయి" పోటీలకు ఎంపిక అయినారు.
వ్యాసరచన... టీఎస్ జె యు జగిత్యాల జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
ప్రధాన కార్యదర్శిగా జోరిగే శ్రీనివాస్
మెట్టుపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ నందు జగిత్యాల జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, రాష్ట్ర... గొల్లపల్లి మండలంలో గంజాయి పట్టుకొన్న ఎస్ఐ, కృష్ణా సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామ శివారులో బాలస్తీ గణేష్ సం 23 వెల్గటూర్ మండలం స్తంభంపల్లి వాస్తవ్యుడు గంజాయి తరలిస్తుండగా పట్టు పడ్డ యువకుని వద్ద నుండి 80 గ్రాముల గంజాయి స్వాదిన పరుచుకొని ఎన్డిపిఎస్ చట్టం కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు
ఎస్ఐ... లోక కవి అందెశ్రీ అకాల మరణాని చింతిస్తు, సంతాపం ప్రకటించిన మిత్రుడు కవి చిన్నాడి రమణారావు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు)
తెలంగాణ ఉద్యమంలో 2003 సంవత్సరంలో కరీంనగర్ లో తెలంగాణ సభలో పరిచయము మా మధ్య స్నేహాన్ని వికసింపజేసి నేటి వరకు నిరంతరంగా కొనసాగింది .అందెశ్రీ గొల్లపల్లి మండలం కేంద్రంలో 2005వ సంవత్సరంలో పుస్తకావిష్కరణ సభలో ఆవిష్కర్తగా అలాగే 2022వ సంవత్సరంలో గాయం గేయమైన వేళ సభలో... జగిత్యాల భూ వివాదంపై పారదర్శకంగా విచారణ జరపండి: దావ వసంత సురేష్
జగిత్యాల, నవంబర్ 10 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమి అక్రమ కబ్జా ఆరోపణలు మరోసారి తెరమీదకొచ్చాయి. ఈ వివాదంపై తక్షణమే పారదర్శక విచారణ జరపాలని జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు... ఫరీదాబాద్‌లో ఇమామ్ ఇంటి నుండి 50 బస్తాల పేలుడు పదార్థం స్వాధీనం
పికప్ వాహనంలో పేలుడు బస్తాలు తరలింపువివరాలు వెల్లడించడానికి పోలీసుల నిరాకరణఫరీదాబాద్ (హర్యానా) నవంబర్ 10: హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో సోమవారం పోలీసుల సర్చ్ ఆపరేషన్ భారీ రహస్యం బయటపెట్టింది. ఒక ఇమామ్ నివాసంలో 50 బస్తాల పేలుడు పదార్థం లభ్యమవడంతో మొత్తం ప్రాంతంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ ఇమామ్ ఇంటికి ఆతంకవాది ముజమ్మిల్... 