పాన్ ఇండియా ఐకానిక్ టీచర్ అవార్డు వరించిన ఆదిలాబాద్ రాంనగర్ వాసి కరండే దినేష్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9349422113).
ఆదిలాబాద్, సెప్టెంబర్ 8 (ప్రజా మంటలు) :
ఉపాధ్యాయ వృత్తిలో 20 సంవత్సరాలపాటు అద్భుతమైన సేవలందిస్తున్న ఆదిలాబాద్ జిల్లా రాంనగర్ వాసి కరండే దినేష్ గారికి "పాన్ ఇండియా ఐకానిక్ టీచర్ అవార్డు" లభించింది.
ఈ అవార్డును 2024 సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గుంటూరులోని కెన్నెడీ నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన ఒక విశేష కార్యక్రమంలో ప్రదానం చేశారు.
కరండే దినేష్ ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా గత 20 సంవత్సరాలుగా వందలాది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతూ, సమాజ సేవకు ఆయన అంకితభావంతో పనిచేస్తున్నారు.
విద్యా రంగంలో ఆయన చేసిన విశేష కృషికి అనేక మంది ప్రశంసలు కురిపించారు. 2014లో కూడా ఆయన ఆదిలాబాద్ ప్రైవేటు యాజమాన్యాల ద్వారా బహుకరించిన అవార్డుల్లో "బెస్ట్ టీచర్ అవార్డు" ను అందుకోవడం గర్వకారణం.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా వి.వి. లక్ష్మి నారాయణ గారు (జే.డి), సీబీ ఐ మాజీ సంయుక్త డైరెక్టర్ లక్ష్మణ రావు, ఎమ్మెల్సీ గుంటూరు కృష్ణా జిల్లా మహ్మద్ నసీర్ అహ్మద్, ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ గల్లా మాధవి, ఎమ్మెల్యే గుంటూరు వెస్ట్ . షమా సుల్తానా, ఛైర్ వుమెన్, హోప్ విన్ ఆసుపత్రి, గుంటూరు పాల్గొని దినేష్ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును బహుకరించారు.
కరండే దినేష్ సాధించిన ఈ ఘనతకు విద్యా, సామాజిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని అందరూ ఆశిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం
