జైనూర్ అల్లర్ల బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుంది - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
జైనూర్ అల్లర్ల బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుంది - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హన్మకొండ సెప్టెంబర్ 06 :
జైనూర్ లో ఆదివాసీ మహిళపై అత్యాచారం ఘటనపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వ వీప్ లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ మరియు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు లతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఇలా చెప్పారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టింది. బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నాం...
మంత్రి సీతక్క రెండు సార్లు బాధితురాలిని పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు..
తక్షణ సాయంగా లక్ష రూపాయలను అందజేశారు.నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
జైనూర్ లో జరిగిన అల్లర్లను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కంట్రోల్ లో ఉంది.
డీజీ స్థాయి అధికారి స్వయంగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.జైనూరు లో జరిగిన సంఘటన ను బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది.
అత్యాచార ఘటనను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు.బాధిత మహిళ కు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు....
ఇది రాజకీయాలకు సమయం కాదు.రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇబ్బంది లేదు.అంతా ప్రశాంతంగా ఉంది..
హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి కావాలనే ప్రభుత్వంపైన దుష్పచారం చేస్తున్నారు...పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు..
తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను తగ్గించడానికి కుట్రలు చేస్తున్నారు..రాజకీయం కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడం కరెక్ట్ కాదు.
కేసీఆర్ పదేళ్లలో ఎన్ని దారుణాలు జరిగాయో అందరికి తెలుసు. హైదరాబాద్ శివారులో దిశ పైన జరిగిన అత్యాచారం, హత్య ప్రపంచం మొత్తానికి తెలుసు..
కనీసం దిశ కుటుంబాన్ని పలకరించని చరిత్ర కేసీఆర్ ది..హైదరాబాద్ నడిబొడ్డున సింగరేణి బస్తీలో ఆరేళ్ల పాప పైన అత్యాచారం జరిగితే దిక్కు లేదు...జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లో మైనర్ పైన కారులో అత్యాచారం జరిగిన విషయం హరీష్ రావుకు గుర్తు లేదా..?
చిన్నారులపై ఎన్ని అత్యాచారాలు జరిగాయో లెక్కనే లేదు.. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయి అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి..
మా ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయి పైన సీఎం ఉక్కుపాదం మోపారు...
తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TSNAB) ను పటిష్టం చేశాం...
పదేళ్లలో అనేక చోట్ల అల్లర్లు ,మతకల్లోలాలు చోటు చేసుకున్నాయి..
బైంసా లో ఎన్ని రోజులు కర్ఫ్యూ పెట్టారో అందరికీ తెలుసు...
ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా.అప్పుడు జరిగిన అల్లర్లలో రెండు వైపులా ఎంత నష్టం జరిగిందో తెలియదా..?
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎవరూ మరిచిపోలేదు..